ETV Bharat / city

Podu land registration : పోడుభూముల సమస్య పరిష్కారానికి భారీ దరఖాస్తులు - పోడు భూముల రిజిస్ట్రేషన్​కు భారీ దరఖాస్తులు

పోడు భూముల(Podu land issue) సమస్య పరిష్కారానికి రాష్ట్రవ్యాప్తంగా భారీ దరఖాస్తులు(Podu land registration) వస్తున్నాయి. ఈనెల 8 నుంచి మొదలైన దరఖాస్తు పంపిణీ, స్వీకరణ ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. అటవీహక్కుల చట్టం(forest rights act 2005) 2005 నిబంధనలకు లోబడి సర్కారు దరఖాస్తులు స్వీకరిస్తోంది.

Podu land registration
Podu land registration
author img

By

Published : Nov 18, 2021, 6:54 AM IST

రాష్ట్రంలో పోడు భూముల(Podu land issue) సమస్య పరిష్కారానికి భారీగా దరఖాస్తులు(Podu land registration) వస్తున్నాయి. ఈ భూములపై హక్కులు కల్పించేందుకు ఈ నెల 8 నుంచి మొదలైన దరఖాస్తు పంపిణీ, స్వీకరణ ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. ప్రాథమిక సమాచారం మేరకు అటవీశాఖ(telangana forest ministry) అంచనాలను మించి 12 లక్షల ఎకరాలకు దరఖాస్తులు రానున్నట్లు సమాచారం. ఈ నెల 20 నాటికి రాష్ట్రవ్యాప్తంగా అందిన దరఖాస్తుల(Podu land registration) సమాచారం తీసుకుని, తదుపరి పరిశీలనకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయనుంది. రాష్ట్రంలో 2450 గిరిజన గ్రామాలు(4300 ఆవాసాల) పరిధిలో పోడు భూముల సమస్యలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. అటవీహక్కుల చట్టం 2005 నిబంధనలకు లోబడి సర్కారు దరఖాస్తులు స్వీకరిస్తోంది.

గ్రామసభల్లో అర్హుల ఎంపిక..

గ్రామాల వారీగా ఏర్పాటు చేసిన అటవీహక్కుల కమిటీలు(forest rights committees), గ్రామస్థాయి కమిటీలు(village level committees) గ్రామాల్లో అవగాహన కల్పించాయి. ఏజెన్సీల్లోని కొన్ని గ్రామాల్లో గురువారానికి, మరికొన్ని గ్రామాల్లో ఈ నెల 20 నాటికి స్వీకరణ ప్రక్రియ పూర్తికానుంది. ఏజెన్సీయేతర జిల్లాల్లోని పోడు సమస్యలున్న గ్రామాల్లో దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. ప్రతిగ్రామంలో భారీగా గిరిజనులు పోడుభూములపై హక్కుల కోసం దరఖాస్తు(Podu land registration) చేసుకున్నారని క్షేత్రస్థాయి అధికారులు ప్రభుత్వానికి తెలిపారు. అంచనాలను మించి విస్తీర్ణం 10-12 లక్షల ఎకరాలకు చేరే అవకాశమున్నట్లు సమాచారం.

రాష్ట్రవ్యాప్తంగా వచ్చేవారం నుంచి ప్రభుత్వం(telangana government) దరఖాస్తుల పరిష్కారం(solution for Podu land issue) ప్రారంభించనుంది. గ్రామాల వారీగా అటవీ హక్కుల కమిటీలు, గ్రామ స్థాయి కమిటీలు ఆయా గ్రామాల్లో వచ్చిన దరఖాస్తుల మేరకు షెడ్యూలు ప్రకటించి ప్రక్రియ ప్రారంభించనున్నాయి. అటవీశాఖ వద్ద ఉన్న శాటిలైట్‌ మ్యాపులు, సాంకేతికత, దరఖాస్తుతో జతచేసిన పత్రాలను పరిశీలించి అర్హులను గుర్తించనున్నాయి. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు కొన్ని గ్రామాల్లో 15 రోజుల నుంచి నెలరోజుల వరకు సమయం పట్టే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. పరిశీలన పూర్తయిన తరువాత ఆయా వివరాలన్నీ కంప్యూటరీకరించి, గ్రామ సభలు నిర్వహించి అర్హులను గుర్తిస్తాయి. ఆ తరువాత అర్హత కలిగిన దరఖాస్తులను తదుపరి పరిష్కార ప్రక్రియ కోసం డివిజనల్‌ కమిటీలకు...అవి జిల్లా కమిటీలకు పంపించనున్నాయి. అక్కడ ఆమోదంతో గిరిజన రైతులకు హక్కుపత్రాలు అందనున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.