"గర్భిణీలకు కరోనా సోకినా భయపడాల్సిన పనిలేదు. పుట్టబోయే బిడ్డపై కరోనా తీవ్ర ప్రభావం ఉండదు. గర్భిణీలు వ్యాక్సిన్ వేసుకోకూడదనే వార్తలు అసత్యం. వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల గర్భిణీలకు మేలే జరుగుతోంది. గర్భిణీలకు జ్వరం మాత్రం ప్రమాదమే, వీలైనంత త్వరగా తగ్గించుకోవాలి. టెస్టుల కోసం ఆస్పత్రికి వెళ్లినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. భౌతికదూరం, రెండు మాస్క్‌లు వంటి నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. గర్భిణీలకు నెగటివ్ వచ్చి లక్షణాలుంటే మరోసారి టెస్టు చేసుకోవాలి. అజిత్రోమైసిన్, రెమిడెసివిర్‌తో గర్భిణీలకు ప్రమాదమేం లేదు." - గైనకాలజిస్ట్ డాక్టర్ మంజుల అనగాని
'గర్భిణీలకు కరోనా సోకినా భయపడాల్సిన పనిలేదు'
కరోనా వైరస్ మనుషులను కుంగదీస్తోంది. శారీరాన్ని గుల్ల చేస్తోంది. ఇటీవల గర్భిణీలు ఎక్కువగా వైరస్ భారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గర్భంలోని శిశువుపై వైరస్ ఎలాంటి ప్రభావం చూపుతుందో అన్న ఆందోళనతో.. కాబోయే తల్లులు దిగులుపడుతున్నారు. మరీ ముఖ్యంగా ఆక్సిజన్ లెవల్స్ తగ్గి... రెమిడిసివర్ లాంటి మందులు వాడిన వారి మానసిక స్థితి మరింత అధ్వాన్నంగా తయారవుతోంది. వైరస్ సోకినప్పుడు వాడే మందులు పుట్టబోయే బిడ్డపై ఎలాంటి ప్రభావం చూపనున్నాయన్న అంశాలపై ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ మంజుల అనగానితో ఈటీవీ భారత్ ప్రతినిధి రమ్య ముఖాముఖి.
"గర్భిణీలకు కరోనా సోకినా భయపడాల్సిన పనిలేదు. పుట్టబోయే బిడ్డపై కరోనా తీవ్ర ప్రభావం ఉండదు. గర్భిణీలు వ్యాక్సిన్ వేసుకోకూడదనే వార్తలు అసత్యం. వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల గర్భిణీలకు మేలే జరుగుతోంది. గర్భిణీలకు జ్వరం మాత్రం ప్రమాదమే, వీలైనంత త్వరగా తగ్గించుకోవాలి. టెస్టుల కోసం ఆస్పత్రికి వెళ్లినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. భౌతికదూరం, రెండు మాస్క్‌లు వంటి నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. గర్భిణీలకు నెగటివ్ వచ్చి లక్షణాలుంటే మరోసారి టెస్టు చేసుకోవాలి. అజిత్రోమైసిన్, రెమిడెసివిర్‌తో గర్భిణీలకు ప్రమాదమేం లేదు." - గైనకాలజిస్ట్ డాక్టర్ మంజుల అనగాని
ఇదీ చూడండి: కరోనాను జయించాక ఆ టెస్ట్ చేయించుకోవాలా?