అక్రమ నిర్మాణాలపై హెచ్ఎండీఏ చర్యలు కొనసాగుతున్నాయి. నాలుగో రోజు ఐదు మున్సిపాలిటీల పరిధిలో 12 నిర్మాణాలపై చర్యలు తీసుకున్నట్లు హెచ్ఎండీఏ టాస్క్ఫోర్స్ టీమ్స్ వెల్లడించాయి. ఇప్పటి వరకు 45 అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్లు హెచ్ఎండీఏ, డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ పేర్కొన్నాయి. నిర్దిష్టమైన అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలు, గోదాములు వంటి అక్రమ నిర్మాణాలపై కూల్చివేత చర్యలు కొనసాగుతున్నాయి.
4 రోజులు.. 45 అక్రమ నిర్మాణాల కూల్చివేత..
మున్సిపల్ చట్టం పరిధికి లోబడి అక్రమ నిర్మాణాలపై జిల్లా టాస్క్ ఫోర్స్ బృందాలు, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ ప్లానింగ్ అధికారులు, హెచ్ఎండీఏ ఎన్ఫోర్స్మెంట్ యంత్రాంగం సంయుక్తంగా నిర్వహిస్తున్న కూల్చివేత చర్యల్లో భాగంగా నాలుగో రోజు ఐదు మున్సిపాలిటీల పరిధిలో పన్నెండు పెద్ద అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకున్నారు. మొత్తంగా గత నాలుగు రోజుల్లో నలభై ఐదు అక్రమ నిర్మాణాలను డిస్ట్రిక్ట్ టాస్క్ఫోర్స్ బృందాలు కూల్చివేశాయి.
ఉక్కుపాదం..
నాలుగో రోజు కొంపల్లి, తుర్కయంజాల్, నార్సింగి, శంషాబాద్, కొత్తూరు మున్సిపాలిటీల పరిధిలో డిస్ట్కిక్ట్ టాస్క్ ఫోర్స్, హెచ్ఎండీఏ బృందాలు విధులు నిర్వహించాయి. కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఐదు అక్రమ నిర్మాణాలు, నార్సింగి మున్సిపాలిటీ పరిధిలో మూడు అక్రమ నిర్మాణాలను, తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలో రెండు అక్రమ నిర్మాణాలను, శంషాబాద్, కొత్తూరు మున్సిపాలిటీల పరిధిలో ఒకటి చొప్పున మొత్తం పన్నెండు అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!