చారిత్రక గోల్కొండ కట్టడం పరిరక్షణకు వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. ఏం చర్యలు తీసుకున్నారో నవంబరు 26న వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆర్కియాలజికల్ సర్వే డైరెక్టర్‌ను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.
కుతుబ్ షాహి టూంబ్స్, గోల్కొండ కోట పగుళ్లు బారి... వాటిలో వాన నీరు చేరి దెబ్బతింటున్నాయని ఓ ఆంగ్ల పత్రికలో ప్రచురితమైన కథనాన్ని హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తూ విచారణను నవంబరు 26కి వాయిదా వేసింది.