ఏపీలోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య చుక్కల మందుపై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. చుక్కల మందుకు సంబంధించిన నివేదిక అందిందని ప్రభుత్వం హైకోర్టుకు వివరించింది. చుక్కల మందు వల్ల ఎలాంటి దుష్పరిణామాలు ఉండవని తెలిపింది. ఈ ఔషధం ప్యాకింగ్, నిల్వకు నెల నుంచి మూడు నెలలు సమయం పట్టే అవకాశం ఉందని ప్రభుత్వం కోర్టుకు వివరించింది.
స్టెరిలిటీ టెస్టుకు సంబంధించి నివేదిక రాకుండా చుక్కల మందుకు అనుమతి ఇవ్వలేమని ప్రభుత్వం తెలిపింది. ఇందువల్ల మూడు నెలల తర్వాత పంపిణీ చేసే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది. భోజన విరామం నేపథ్యంలో హైకోర్టు విచారణను వాయిదా వేసింది. అనంతర ఆనందయ్య, పిటిషనర్ల వాదనలు ధర్మాసనం విననుంది.