తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికలు కీలక మలుపు తిరిగాయి. అధ్యక్ష పదవికి పోటీచేసేందుకు ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్‌కు లైన్ క్లియర్ అయినట్లు ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బరిలో ఉన్న జగన్మోహన్రావు తెలిపారు.
జయేష్ రంజన్ నామినేషన్ తిరస్కరణ చెల్లదని హైకోర్టు తీర్పు ఇచ్చిందని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనుమతి ఉంటే చాలని.. జయేష్ రంజన్ నామినేషన్ ఆమోదించాల్సిందేనని రిటర్నింగ్ అధికారికి హైకోర్టు స్పష్టం చేసిందని తెలిపారు.
ఈ నెల 9న జరిగే ఒలింపిక్స్ ఎన్నికల్లో తమ ప్యానల్ ఘన విజయం సాధిస్తుందని ధీమావ్యక్తం జగన్మోహన్రావు చేశారు.
ఇవీచూడండి: 'ఆ విషయంలో టీమిండియా తప్పిదాలు చేస్తోంది'