రాష్ట్రంలో చెరువుల ఆక్రమణలపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. పత్రికల్లో కథనాలపై సుమోటోగా విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. రాష్ట్రంలోని అన్ని చెరువులకు పరిరక్షణ కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. చెరువుల పరిరక్షణ కమిటీల్లో సంబంధిత జిల్లా ఎస్పీ సభ్యుడుగా ఉండాలని స్పష్టం చేసింది.
చెరువుల పరిరక్షణ కమిటీలు.. ఆక్రమణలను గుర్తించి చర్యలు తీసుకోవాలన్న ఉన్నత న్యాయస్థానం.. డిసెంబర్ 10 వరకు నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఇవీ చూడండి: ఆస్తుల నమోదుకు గడువు లేదు... హైకోర్టుకు సర్కారు స్పష్టం