Son Of India: సన్ ఆఫ్ ఇండియా చిత్రంపై సామాజిక మాధ్యమాలలో దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఏపీ తిరుపతి పోలీసులకు సినీనటుడు మోహన్ బాబు అభిమానులు ఫిర్యాదు చేశారు. మంచు కుటుంబ అభిమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ చక్రవర్తి తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మోహన్ బాబు కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మంచు కుటుంబ సభ్యులపై ట్రోల్స్ చేస్తున్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
'ప్రపంచమంతా నా కుటుంబం. ప్రపంచం బాధే నా బాధ' అని సన్ ఆఫ్ ఇండియాలో మంచు మోహన్ బాబు చెప్పిన సంభాషణలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఆయన నటించిన సన్ ఆఫ్ ఇండియా సినిమా ఈనెల 18న థియేటర్లలోకి వచ్చింది. అయితే ఈ సినిమా రిలీజైనప్పటి నుంచి ట్రోల్స్ ఎక్కువగా వస్తున్నాయంటూ మంచు ఫ్యామిలీ ఆరోపించింది. స్వయంగా మోహన్ బాబే రూ. 10 కోట్ల పరువు నష్టం దావా వేస్తాననడం చర్చకు దారితీసింది. ట్రోల్స్‌పై మంచు అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. సన్ ఆఫ్ ఇండియా సినిమాపై కావాలనే ట్రోల్స్ చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతిలో మంచు అభిమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Mohan babu manchu vishnu: కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు 'సన్ ఆఫ్ ఇండియా' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. అయితే ఎన్నడూ లేనంతగా విడుదలకు ముందే ఈ చిత్రంపై వ్యతిరేకత వచ్చింది. సోషల్ మీడియాలోనూ మోహన్‌బాబుతో పాటు ఆయన కుటుంబంపై తెగ ట్రోల్స్, మీమ్స్ వచ్చాయి. ఈ క్రమంలోనే ఆయన ఓ నిర్ణయం తీసుకున్నారు. సదర్ మీమ్ పేజీల అడ్మిన్లకు లీగల్ నోటీసులు పంపించారు. రూ.10 కోట్ల దావా కూడా వేసినట్లు తెలుస్తోంది.
ట్రోల్స్, మీమ్స్ తనను ఎంతో బాధపెడుతున్నాయని మోహన్‌బాబు గతంలోనూ ఆవేదన వ్యక్తం చేశారు. ఓ ఇద్దరు హీరోలు వెనకుండి ఈ పనిచేయిస్తున్నారని ఆరోపించారు. ఏదో ఓ సమయంలో వాళ్లు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని అన్నారు. అలానే టాలీవుడ్ ప్రస్తుత పరిస్థితి గురించి మోహన్‌బాబు ఇటీవల మాట్లాడారు. పరిశ్రమ మొత్తం ఒకే కుటుంబం అంటూనే పరస్పర విమర్శలు చేసుకుంటున్నారని అన్నారు. ఎవరు గోతులు వాళ్లే తీసుకుంటున్నారని తెలిపారు.
ఇదీ చదవండి: 10,12 తరగతుల బోర్డ్ పరీక్షలపై సుప్రీం కీలక నిర్ణయం