ETV Bharat / city

కోడెల సేవలు చిరస్మరణీయం: బాలకృష్ణ

author img

By

Published : May 2, 2020, 9:23 PM IST

హైదరాబాద్​లోని బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ ఆస్పత్రిలో దివంగత నేత డాక్టర్ కోడెల శివప్రసాద్​రావు జయంతిని నిర్వహించారు. కోడెల చిత్రపటానికి పూలమాల వేసి నందమూరి బాలకృష్ణ నివాళులర్పించారు. ఆస్పత్రికి ఆయన అందించిన సేవలను కొనియాడారు.

hero bala krishna tribute to kodela siva prasad on birth anniversary in indo american hospital
కోడెల సేవలు చిరస్మరణీయం: బాలకృష్ణ

బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ ఆస్పత్రి అభివృద్ధికి కోడెల శివప్రసాద్‌రావు ఎంతో కృషి చేశారని... ఆస్పత్రి ఛైర్మన్‌, సినీ హీరో బాలకృష్ణ గుర్తుచేశారు. దవాఖానాను దేశంలోనే అత్యున్నతస్థాయి క్యాన్సర్‌ చికిత్సా కేంద్రంగా మలచడంలో కోడెలలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్ ఆస్పత్రిలో దివంగత నేత డాక్టర్‌ కోడెల శివప్రసాద్‌ జయంతి నిర్వహించారు.‌ బాలకృష్ణతో పాటు ట్రస్ట్‌ సభ్యులు, వైద్య సిబ్బంది కోడెల చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు. కోడెలతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

కోడెల సేవలు చిరస్మరణీయం: బాలకృష్ణ

ఇవీ చూడండి: 'కరోనా పరీక్షలో అందరమూ ఉత్తీర్ణులు కావాల్సిందే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.