సంచలనం రేపిన హేమంత్ హత్య కేసులో జైల్లో ఉన్న నిందితులు అవంతి తండ్రి లక్ష్మారెడ్డి, మేనమామ యుగేందర్ రెడ్డిని ఆరు రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది. ఈ కేసులో ఇప్పటికే 14మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు ప్రస్తుతం ప్రధాన నిందితులుగా ఉన్న లక్ష్మారెడ్డి, యుగేందర్ రెడ్డిని విచారించనున్నారు. ప్రభుత్వంతో మాట్లాడి ఈ కేసును ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపిస్తామని సీపీ సజ్జనార్ తెలిపారు. బాధితులకు న్యాయం చేస్తామని ఈ కేసులో ఏ ఒక్కరికి సంబంధం ఉన్నా ఎవరిని వదిలిపెట్టేది లేదని సీపీ పేర్కొన్నారు.
హేమంత్ కుటుంబ సభ్యుల వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు. సుమారు 6 గంటల పాటు గచ్చిబౌలి పోలీసులు వివరాలు సేకరించారు. తనకు రక్షణగా పోలీసులు ఉంటారని అవంతిక పేర్కొన్నారు.
ఇవీ చూడండి: పరువు హత్య: పరారీలో ఉన్న కీలక నిందితుల అరెస్ట్