Traffic Jam in Hyderabad: స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు సీఎం కేసీఆర్, ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో సభ జరుగుతున్న పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎల్బీ స్టేడియం వైపు వాహనాలకు అనుమతి ఇవ్వకపోవడంతో అబిడ్స్, నాంపల్లి, లిబర్టీ, బషీర్‌బాగ్ పరిసర ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
గంటల తరబడి వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయి నిలిచిపోవడం వల్ల వాహనదారులు.. ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు వాహనదారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సాయంత్రంపూట కావడంతో కార్యాలయాల నుంచి ఇంటికి వెళ్తున్న వారు, విద్యార్థులు, ఉద్యోగులు ట్రాఫిక్‌లో చిక్కుకుని అవస్థలు పడ్డారు.
ఇవీ చదవండి: