ETV Bharat / city

RTC Losses: పీకల్లోతు కష్టాల్లోకి ఆర్టీసీ.. అదనపు ఖర్చే కోటి..! - tsrtc latest news

అసలే నష్టాల్లో కొనసాగుతున్న గ్రేటర్ ఆర్టీసీకి కరోనా మరిన్ని నష్టాలను మూటగట్టింది. అన్నీ కుదురుకుని... నష్టాల ఊబి నుంచి మెల్లగా బయటపడుతున్న క్రమంలో.. ఒక్కసారిగా విధించిన లాక్​డౌన్​తో ఆర్టీసీ కకావికలమైపోయింది. ఇక రెండో విడత లాక్​డౌన్​తో పీకల్లోతు కష్టాల్లోకి కూరుకుపోయింది. ఒకవైపు ప్రైవేట్ వాహనాలు, మరోవైపు వ్యక్తిగత వాహనాలు రోడ్డెక్కడంతో ఆర్టీసీ మరింత కుదేలైపోయింది.

Heavy losses in greater hyderabad rtc
Heavy losses in greater hyderabad rtc
author img

By

Published : Jun 30, 2021, 5:24 PM IST

గ్రేటర్ పరిధిలో ఆర్టీసీ పరిస్థితి రోజురోజుకి దయనీయంగా మారిపోతుంది. ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గిపోవడం వల్ల ఆదాయం లేక.. నిర్వహణ మరింత భారంగా తయారవుతోంది. గ్రేటర్ పరిధిలో 29 డిపోలు ఉన్నాయి. రెండేళ్ల క్రితం వరకు గ్రేటర్ పరిధిలో 2,750 బస్సులు తిరిగేవి. ఆ సమయంలో సుమారు 30 లక్షల మంది ప్రయాణికులు బస్సుల్లో ప్రయాణం సాగించేవారు. 70 శాతం వరకు ఆక్యుపెన్సీ రేషియో ఉండేది. కరోనా తర్వాత 1,700 బస్సులు తిప్పుతున్నారు. మరో 400 అద్దె బస్సులు ఇప్పటికీ రోడ్డెక్కలేదు. ప్రస్తుతం 42 శాతం ఆక్యుపెన్సీ రేషియో కొనసాగుతుంది. ప్రయాణికుల సంఖ్య కూడా 15 నుంచి 20లక్షలకు తగ్గిపోయింది. కరోనాకు ముందు రోజుకి 30 వేల ట్రిప్పులు తిరిగితే.. ప్రస్తుతం అందులో సగానికి పడిపోయింది. ఈ పరిణామంతో నిర్వహణ భారం పెరిగిపోయింది. దీనికి తోడు పెంచిన జీతభత్యాల పెంపు ఆర్టీసీకి భారంగా మారిపోయింది. గతంలో డీజీల్​పై రోజుకి రూ. లక్షా 75 వేల వరకు ఖర్చు చేసేవారు. ప్రస్తుతం రూ.లక్షా పదివేల వరకు ఖర్చు చేస్తున్నారు. గ్రేటర్ పరిధిలో నెలకు రూ.85 కోట్లు కేవలం జీతాలకే వెచ్చించేవారు. అవి కూడా ప్రస్తుతం రావడం లేదంటున్నారు. రోజురోజుకి డీజీల్ ధరలు పెరిగిపోతుండడం కూడా ఆర్టీసీకి మోయలేని భారంగా తయారైంది.

అదనపు ఖర్చే కోటి..

గ్రేటర్ ఆర్టీసీ గతంలో రోజుకి రూ.కోటి నష్టంతో కొనసాగేది. ఇప్పుడు అదనపు నష్టాలు కూడా మూటగట్టుకోవాల్సి వస్తుంది. కరోనా రెండో దశ ఉద్ధృతి ప్రభావంతో ఆర్టీసీకి మరింత నష్టం వాటిళ్లుతోందని అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఒకవైపు మెట్రో రైళ్లు పరుగులు పెట్టడం.. మరోవైపు ప్రైవేట్ వాహనాలు, వ్యక్తిగత వాహనాలను ప్రజలు వినియోగించడం వల్ల ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ప్రతిరోజూ రూ.2.5 కోట్ల ఆదాయం లభించినప్పటికీ... మరో రూ.99 లక్షల వరకు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుందని అధికారులు వాపోతున్నారు. డ్రైవర్లు, కండక్టర్లు ఎంత కష్టపడినప్పటికీ.. ఓఆర్ మాత్రం పెరగడం లేదంటున్నారు. పాఠశాలలు, కళాశాలలు ఇంకా ప్రారంభం కాకపోవడం కూడా ఆర్టీసీకి నష్టమేనంటున్నారు. నెలవారీ పాసులు తీసుకుని ప్రయాణించే వారు కూడా తగ్గిపోవడం కూడా ఆర్టీసీపై ప్రభావం చూపిస్తుందంటున్నారు.

ప్రస్తుతం 20 వేల ట్రిప్పులే..

మొదటి దశ లాక్​డౌన్ సుమారు ఏడునెలలకు పైగా కొనసాగింది. ఆ తర్వాత క్రమంగా బస్సులను రోడ్డెక్కించాల్సి వచ్చినప్పటికీ.. ఆక్యుపెన్సీ మాత్రం దారుణంగా పడిపోయింది. 50 శాతం నుంచి 45 శాతానికి పరిమితమైంది. కొవిడ్ కాలంలో నగరవాసులు సొంత వాహనాల వినియోగానికి ఎక్కువగా అలవాటుపడ్డారు. గతేడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు బస్సులు నడిచినా.. అక్యుపెన్సీ పెరగలేదు. గతంలో సిటీ బస్సులు 1,150 రూట్లలో ప్రతిరోజూ 42 వేల ట్రిప్పులు తిరిగేవి. ఏడాది క్రితం 850కి పైగా బస్సులను తొలగించడంతో సుమారు 10 వేల ట్రిప్పులకు కోతపడింది. నగర శివార్లలోని వందకు పైగా పల్లెలకు బస్సుల రాకపోకలను కుదించారు. కొవిడ్​తో సుమారు 32 వేల ట్రిప్పులకు తగ్గిపోయింది. అందులోనూ ప్రస్తుతం 20 వేల ట్రిప్పుల వరకే తిప్పుతున్నామని అధికారులు పేర్కొంటున్నారు.

400 కోట్ల నష్టాల్లో...

ప్రయాణికుల సంఖ్య దాదాపు 15 లక్షలకు తగ్గినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది వరకు రూ.150 కోట్ల వరకు నష్టాల్లో ఉన్న ఆర్టీసీ.. కొవిడ్ కారణంగా మరిన్ని నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. ప్రస్తుతం ఈ భారం సుమారు రూ.400 కోట్ల మేర నష్టాల్లో ఆర్టీసీ కూరుకుపోయినట్టు అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వమే ఆదుకోవాలి...

బెంగళూరు, ముంబయి వంటి నగరాల్లో ప్రభుత్వ ఆర్థిక సహాయంతోనే బస్సులు నడుస్తున్నాయని కార్మికనేతలు పేర్కొంటున్నారు. గతంలో గ్రేటర్ హైదరాబాద్ నుంచి కూడా ఆర్థిక సహాయం అందించారు. ఆ తర్వాత జీహెచ్​ఎంసీ నుంచి ఎటువంటి ఆర్థిక సహాయం అందడలేదని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం ఆర్టీసీకి ఆర్థికంగా చేయూతనిచ్చి.. ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చూడండి: AP-TS Water Dispute: నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద భద్రత కట్టుదిట్టం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.