పీవీవీ ఇన్‌ఫ్రా లిమిటెడ్ డైరక్టర్ పిన్నమనేని వీర వెంకట సత్యనారాయణను కేంద్ర జీఎస్టీ అధికారులు అరెస్ట్ చేశారు. నకిలీ బిల్లులతో జీఎస్టీ ఎగవేతకు పాల్పడినట్లుగా గుర్తించామని డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటిలిజెన్స్-హైదరాబాద్ యూనిట్ జాయింట్ డైరెక్టర్ కిరణ్ రెడ్డి తెలిపారు. ఈనెల 19 వరకు పిన్నమనేనికి కోర్టు రిమాండ్ విధించిందన్నారు.
హైదరాబాద్ బేగంపేటలోని పీవీవీ ఇన్‌ఫ్రా కార్యాలయంతో పాటు మరో 12 చోట్ల కేంద్ర జీఎస్టీ నిఘా విభాగం అధికారులు సోదాలు నిర్వహించారు. గత నెల 22, ఈ నెల 5న చేసిన తనిఖీల్లోనూ పెద్ద ఎత్తున పత్రాలు, స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. సరకుల క్రయ విక్రయాలు చేయకుండానే.. రూ.69 కోట్లు విలువైన నకిలీ బిల్లులు సృష్టించి ఇతర సంస్థలకు ఇచ్చినట్లు గుర్తించారు. ఇతర వ్యాపార సంస్థలకు చార్టర్డ్ అకౌంటెంటుగా.. పన్ను ఎగవేతకు దోహదం చేసేవిధంగా సలహాలు, సూచనలు ఇచ్చినట్లు గుర్తించామన్నారు. సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
వీవీవీ సంస్థకు చెందిన మూడు బ్యాంకు ఖాతాలను అధికారులు స్తంభింపచేశారు. రూ. 69 కోట్ల విలువైన నకిలీ బిల్లులను ఆరు కంపెనీలకు ఇచ్చినట్లు గుర్తించారు. రూ.12.41 కోట్లు మేర జీఎస్టీ రాయితీ పొందేందుకు యత్నించినట్లు అధికారులు వెల్లడించారు.
ఇవీచూడండి: బంగారానికి మళ్లీ రెక్కలు- నేటి ధరలు ఇవే...