ప్రపంచంలో సీఎం కేసీఆర్‌ను మించిన హరిత ప్రేమికుడులేరని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. పట్టణాలు కాంక్రీట్ జంగల్‌గా మారిపోతున్నాయని... మున్సిపాలిటీల్లో 10 శాతం గ్రీన్ బడ్జెట్ పెట్టేలా చట్టం చేశారని గుర్తు చేశారు. వర్షాకాలం వస్తే హరితహారంలో మొక్కలు నాటాలనే సాంప్రదాయం రాష్ట్రంలో రావడానికి ముఖ్యమంత్రి కారణమన్నారు. మొక్కలు నాటడమే కాదు.. బతకకుంటే పదవి పోతుందని చట్టం చేశారని పేర్కొన్నారు. పచ్చదనం పెంపు వల్ల రాజకీయ ప్రయోజనాలు ఉండవని చెప్పారు.
దేశంలోనే అతిపెద్ద అర్బన్ ఎకో పార్కు మహబూబ్‌నగర్ జిల్లాలో ఏర్పాటు చేస్తున్నాం. జీహెచ్‌ఎంసీ పార్కుల్లో స్థలం ఉంటే అక్కడే ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేస్తాం. పార్కుల్లో వాననీరు ఇంకిపోయేలా ఏర్పాట్లు చేస్తున్నాం. హైదరాబాద్ చుట్టూ ఆక్సిజన్ పార్కు, నందనవనం పార్కుల నిర్మాణం చేపడుతున్నాం. హైదరాబాద్ పార్కుల్లో సైక్లింగ్ ట్రాక్‌లు ఏర్పాటు చేస్తాం.
- కేటీఆర్
ఇదీ చదవండి: 'కృష్ణా జలాల వివాదాల పరిష్కారానికి కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటు చేయండి'