తాతలు.. అమ్మమ్మలు.. పెద్దమ్మలు.. పెదనాన్నలు.. అక్కలు.. తమ్ముళ్లు.. బావలు.. మరదళ్లు.. ఆహా ఇలా చెబుతుంటేనే ఇంత బాగుంటే.. వారంతా ఒక దగ్గర చేరి సందడి చేస్తే ఎలా ఉంటుంది. ఇంకేముంది సందడే సందడి. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలో నెలకొన్న సందడిని చూసేందుకు రెండు కళ్లు చాలవంటే అతిశయోక్తి కాదు. ఐదారు తరాలు.. 300లకు పైగా కుటుంబాలు.. గ్రంధివారి వంశ వృక్షం పేరిట.. గ్రంధి నానబ్బులు 50వ పెళ్ళి రోజు జరుపుకుంటున్న సందర్భంగా వీరంతా ఒక దగ్గర కలిసి కనువిందు చేశారు.
తరాల అంతరాన్ని మరిచి ఆడిపాడారు..
గ్రంధి తమ్మయ్య మూలపురుషుడిగా చేసుకొని సుమారు ఐదు తరాలు వారు.. రాజానగరం మండలం దివాన్ చెరువు రాజా రాజేశ్వరి కల్యాణ మండపంలో సమావేశమయ్యారు. చిన్న, పెద్ద ముసలి, ముతకా, యువత అంతా కలిసి.. అరమరికలు లేకుండా.. తరాల అంతరాన్ని మరిచి ఆడిపాడారు.
ఒకరికి ఒకరు పరిచయం చేసుకుంటూ.. వారి మధ్య ఉన్న బంధాలను మరోసారి గుర్తు చేసుకుంటూ.. అనుబంధాలను పెనవేసుకుంటూ పోయారు. ఇలా అందరం ఒక చోట కలవటం ఆనందంగా ఉందని.. సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
- ఇవీ చూడండి : లైంగికదాడి భయం నుంచి బయటపడలేని పసిమొగ్గలు!