Governor Response: బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకపోవడంపై తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ఉంటాయని ప్రభుత్వం మొదట చెప్పిందన్న తమిళిసై.. ఇప్పుడు లేదని చెప్పడం సరికాదని అసహనం వ్యక్తం చేశారు. సంప్రదాయంగా ఉండాల్సిన గవర్నర్ ప్రసంగాన్ని ప్రభుత్వం రద్దు చేసిందని తమిళిసై పేర్కొన్నారు. గవర్నర్ ప్రసంగం లేకపోవడం వల్ల శాసనసభ్యుల హక్కులకు విఘాతం కలుగుతుందన్నారు. గతేడాది ప్రభుత్వ పనితీరుపై చర్చించే అవకాశాన్ని కోల్పోతున్నారని గవర్నర్ వివరించారు.
శాసనసభ్యుల హక్కులకు విఘాతం..
"గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశం ఏర్పాటు చేశారు. సుదీర్ఘ విరామం తర్వాత కొత్త సెషన్ కోసం సభ ఏర్పాటు చేస్తారు. కానీ.. గత సెషన్‌కు కొనసాగింపు అని ప్రభుత్వం చెబుతోంది. సంప్రదాయంగా ఉండాల్సిన గవర్నర్ ప్రసంగాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. సాంకేతిక అంశం వల్ల గవర్నర్ ప్రసంగాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. ప్రసంగాన్ని గవర్నర్ తయారు చేయరు.. అది ప్రభుత్వ ప్రకటన. గవర్నర్ ప్రసంగంలో పేర్కొన్న అంశాలపై సభలో చర్చ జరుగుతుంది. గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ఉంటాయని ప్రభుత్వం మొదట చెప్పింది. ఆర్థిక బిల్లు ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వ నా సిఫార్సు కోరింది. ఇప్పుడు గవర్నర్ ప్రసంగం లేదని ప్రభుత్వం చెప్పడం సరికాదు. రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఆర్థికబిల్లు ప్రవేశపెట్టేందుకు సిఫార్సు చేశా. ఆర్థిక బిల్లు సిఫార్సుకు సమయం తీసుకునే స్వేచ్ఛ నాకుంది. అయినా ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని తొందరగా సిఫార్సు చేశా. గవర్నర్ ప్రసంగం లేకపోవడం వల్ల శాసనసభ్యుల హక్కులకు విఘాతం. గతేడాది ప్రభుత్వ పనితీరుపై చర్చించే అవకాశాన్ని కోల్పోతున్నారు." - తమిళిసై సౌందరరాజన్, గవర్నర్
ఇదీ చూడండి: