విద్యాసంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో జూనియర్ కళాశాలల్లో ఒప్పంద అధ్యాపకుల సేవలు వినియోగించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. 2020-21 సంవత్సరానికి జనరల్, ఒకేషనల్ కేటగిరీల్లో 3970 మంది అధ్యాపకులను ఒప్పంద, తాత్కాలిక, గంటల ప్రాతిపదికన వినియోగించుకోనున్నారు.
ఇందులో 3599 మంది ఒప్పంద ప్రాతిపదికన, 138 మంది తాత్కాలిక పద్ధతిన, 54 మంది గంటల ప్రాతిపదికన అధ్యాపకులు ఉన్నారు. వీరితో పాటు పార్ట్ టైం ల్యాబ్ అటెండర్లు, సీనియర్ ఇన్స్ట్రక్టర్లు, కంప్యూటర్ టెక్నీషియన్లు ఉన్నారు. 74 మంది జూనియర్ అసిస్టెంట్లు, ఆఫీస్ సబార్డినేట్లను పొరుగుసేవల విధానంలో తీసుకోనున్నారు. ఈ మేరకు ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదీ చూడండి: 'ఈటీవీకి పాతికేళ్ల పండుగ శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్'