ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తొలి దశ ఉద్యమం చేసి 50 సంవత్సరాలు పూర్తైంది. 1969 ఉద్యమకారుల సంక్షేమ సంఘం హైదరాబాద్లో స్వర్ణోత్సవాన్ని నిర్వహించింది. మొదటగా గన్ పార్క్ వద్ద ఉన్న అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు.
ప్రభుత్వం ఆదుకోవాలి
1969 తొలిదశ తెలంగాణ ఉద్యమం బీజం వేయడం వల్లే మలిదశలో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని సంఘం నాయకులు తెలిపారు. ఏమీ ఆశించకుండా ఉద్యమం చేసిన తమను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్ర్య సమరయోధుల మాదిరిగానే తొలి దశ తెలంగాణ ఉద్యమ కారులకు పెన్షన్, ఉచిత వైద్యం కల్పించాలని కోరారు. ఇవీ చూడండి: ఈనెల 7 నుంచి కేసీఆర్ తుది విడత ప్రచారం