ETV Bharat / city

బంగారం అక్రమ రవాణాకు కేరాఫ్ అడ్రస్​గా శంషాబాద్ ఎయిర్​పోర్ట్​!

హైదరాబాద్‌కు బంగారం అక్రమ రవాణా ఆగడం లేదు. ఎప్పటికప్పుడు కొత్త మార్గాల్లో అక్రమార్కులు స్మగ్లింగ్‌ చేస్తున్నారు. నిఘా సంస్థల కళ్లుగప్పి...మూడో కంటికి తెలియకుండా గమ్య స్థానాలకు చేరవేసేందుకు యత్నిస్తున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో వరుసుగా అక్రమరవాణాదారులు పట్టుబడుతున్నా...స్మగ్లింగ్‌ కొనసాగుతూనే ఉంది.

smuggling
బంగారం అక్రమ రవాణాకు కేరాఫ్ అడ్రస్​గా శంషాబాద్ ఎయిర్​పోర్ట్​!
author img

By

Published : Apr 6, 2021, 4:19 AM IST

బంగారం అక్రమ రవాణాకు కేరాఫ్ అడ్రస్​గా శంషాబాద్ ఎయిర్​పోర్ట్​!

శంషాబాద్‌ విమానాశ్రయం...అక్రమ బంగారం రవాణాకు కేంద్ర బిందువుగా మారుతోంది. కొవిడ్‌ నిబంధనలు సడలింపుతో అంతర్జాతీయ విమానాలు రాకపోకలు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో బంగారం అక్రమ రవాణా కేసులు కూడా పెరుగుతున్నాయి. నిఘా సంస్థలు గట్టిగా ఉన్నప్పటికీ...వారిని బురిడీ కొట్టించేందుకు అక్రమార్కులు... రోజుకొక ఎత్తు వేస్తున్నారు. గల్ఫ్‌ దేశాల్లో బంగారం ధర భారత్‌ కంటే తక్కువగా ఉండడం..అక్కడ ఎలాంటి నియంత్రణ లేకపోవడంతో అక్రమార్కులకు కలిసొస్తోంది. గల్ఫ్‌ దేశాల నుంచి బంగారాన్ని పెద్ద ఎత్తున హైదరాబాద్‌కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు అక్రమార్కులు. అధికారుల కళ్లు గప్పేందుకు బంగారాన్ని బిస్కెట్ల రూపంకాని, నగల రూపంలోకాని తీసుకురావడం లేదు. పేస్టులా మార్చేసుకుని లో-దుస్తుల్లో దాచుకోవడం, యంత్రసామాగ్రి విడిభాగాల్లో దాయడం, జీన్స్‌ ఫ్యాంటులో నడుము చుట్టూ దాచుకోవడం, కడుపులోకాని, మూత్ర నాళంలో ఉంచడం, పల్చటి రేకుల్లా చేసి... వాటిని దాచుకుని తీసుకురావడం ద్వారా స్కానింగ్‌కు దొరక్కుండా బయట పడుతున్నారు.

గల్ఫ్ దేశాల నుంచే అధికంగా..

శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టులో కస్టమ్స్‌, సీఐఎస్‌ఎఫ్‌, డీఆర్‌ఐలకు చెందిన కేంద్ర విభాగాలకు చెందిన అధికారులు నిఘా పెడతారు. అయినప్పటికీ బంగారం అక్రమంగా తీసుకువచ్చేందుకు ప్రయత్నించి అక్రమార్కులు దొరికిపోతున్నారు. గల్ప్‌ దేశాలు... దుబాయి, షార్జా, కువైట్‌, ఖతార్‌, సౌదీఅరేబియా దేశాల నుంచి ఎక్కువగా బంగారం రవాణా అవుతోంది. గత సంవత్సరం ఏప్రిల్‌ నుంచి డిసెంబరు వరకు 11.43కిలోల బంగారం శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టు నుంచి స్వాధీనం చేసుకోగా.. ఈ ఏడాది జనవరి మార్చి చివర వరకు 10.55కిలోలు బంగారం స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ విమానాల రాకపోకలు కూడా యథావిధిగా ఉండటంతో... అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. పది రోజులుగా బంగారం అక్రమంగా రవాణా చేస్తూ....శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టులో రోజు విడిచి రోజు పట్టుబడుతూనే ఉన్నారు.

భయం లేకుండా..

దొరికితే బంగారంతోపాటు జైలుకు పోతామన్న భయం రవాణాదారుల్లో ఏ కోశాన కనిపించడం లేదు. అక్రమార్కులు ఇచ్చే కమీషన్‌కు కక్కుర్తి పడుతున్నారు. చెప్పిన చోటకు వెళ్తున్నారు. ఇచ్చిన పార్శిల్‌ తీసుకొస్తున్నారు...ఎవరి కంట పడకుండా బయట పడితే... ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం కమీషన్‌ ముట్టచెబుతారు. విమానాశ్రయంలో దొరికితే.... తమ పేర్లు ఎక్కడా బయట చెప్పవద్దని ముందే మాట తీసుకుంటున్నారు. అరెస్టు అయ్యి జైలుకు వెళ్లితే...బెయిల్‌పై తీసుకొచ్చేందుకు అవసరమైన ఆర్థికమద్దతు పూర్తిగా మీద వేసుకుంటున్నారు. అక్రమార్కులు.... ఇలా రవాణాదారులకు భరోసా కల్పిస్తుండడంతో....గల్ఫ్‌ దేశాలకు వెళ్లి బంగారాన్ని తెచ్చేందుకు చొరవ చూపుతున్నట్లు అధికారులు తెలిపారు.

ఇవీ చూడండి: 61లక్షల మంది భారతీయుల ఫేస్​బుక్​ డేటా లీక్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.