VIJAYAWADA GIRL SUICIDE CASE: బాలికను వేధించి ఆమె మరణానికి కారణమయ్యారనే ఆరోపణలపై అదుపులోకి తీసుకున్న విజయవాడకు చెందిన వినోద్ జైన్‌ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. గతంలో అతడిపై ఏమైనా కేసులున్నాయా? అపార్టుమెంటులో ఎవరినైనా వేధించాడా అనే విషయమై ఆరా తీస్తున్నారు. అపార్టుమెంటులో మొత్తం 40 సీసీ కెమెరాలున్నా వాటికి సంబంధించిన 15 రోజుల డేటా మాత్రమే అందుబాటులో ఉంది. ఆ కెమెరాల దృశ్యాలను పోలీసులు క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు.
వినోదైజైన్ ఇంటిని పోలీసులు సీజ్ చేశారు. ఆయన భార్య ఇటీవల గుజరాత్ వెళ్లగా.. ఇంట్లో ఉన్న ఇద్దరు కుమారులను బంధువులకు అప్పజెప్పారు. బాలిక చేతిరాతను పోల్చేందుకు ఆమె రాసిన లేఖను, రాతపుస్తకాలను పరీక్షలకు పంపించారు. మరో వైపు వినోద్ జైన్‌ను కఠినంగా శిక్షించాలంటూ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో విజయవాడ నగరవ్యాప్తంగా ప్రదర్శనలు జరిగాయి.
ఇదీ చూడండి: సమాజంలో పెద్దమనిషిగా చలామణి.. కుమార్తె వయసున్న బాలిక పట్ల వక్రబుద్ధి