ETV Bharat / city

క్రమబద్ధీకరిస్తే భరించలేని భారం పడుతుంది: జీహెచ్​ఎంసీ - పొరుగు సేవల సిబ్బంది క్రమబద్ధీకరణపై హైకోర్టకు జీహెచ్​ఎంసీ నివేదిక

జీహెచ్​ఎంసీలో పని చేస్తున్న జౌట్​ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలన్న హైకోర్టు సింగిల్ జడ్జి ఉత్తర్వులను కొట్టివేయాలని కమిషనర్​ కోరారు. వారిని క్రమబద్ధీకరిస్తే... సంస్థపై భరించలేని భారం పడతుందని వివరించింది. ఈ మేరకు పూర్తి వివరాలతే నివేదిక సమర్పించింది.

ghmc submit report to high court on out sourcing employees regularization
క్రమబద్ధీకరిస్తే భరించలేని భారం పడుతుంది: జీహెచ్​ఎంసీ
author img

By

Published : Oct 1, 2020, 5:22 AM IST

జౌట్ సోర్సింగ్ పద్దతిలో శానిటరీ సూపర్​వైజర్లు, పారిశుద్ధ్య కార్మికులు, ఎంటమాలజీ ఫీల్డ్ వర్కర్లు, ఫీల్డ్ సూపర్​వైజర్లుగా పనిచేస్తున్న వారిని క్రమబద్దీకరించాలన్న సింగిల్ జడ్జి ఉత్తర్వులను అమలు చేస్తే బల్దియాపై భరించలేని భారం పడుతుందని జీహెచ్ఎంసీ హైకోర్టుకు నివేధించింది. ఈ ఉత్తర్వులను అమలు చేయాలంటే భారీగా పోస్టులను మంజూరు చేయాల్సి ఉంటుందని... దీనివల్ల ఏడాదికి రూ. 625 కోట్ల భారం పడుతోందని పేర్కొంది. ఇప్పటికే బల్దియా బడ్జెట్ 16.3 శాతం వేతనాలకు వెచ్చిస్తున్నామని... దీనికి మించి ఖర్చుపెట్టలేని పరిస్థితి ఉందని వెల్లడించింది.

హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ పూర్తి వివరాలతో జీహెచ్​ఎంసీ కమిషనర్ అప్పిల్ చేశారు. ప్రస్తుతం కార్పొరేషన్​లో మొత్తం 5140 పోస్టులు మంజూరు కాగా... 2491 భర్తీ అయినందున... మరో 2649 పోస్టులు ఖాళీ ఉన్నట్టు వెల్లడించారు. ఇందులో ప్రభుత్వం, సంస్థల్లో కొన్ని విధుల నిర్వహణ కాంట్రాక్ట్ పద్దతిన అప్పగించే ప్రక్రియ సాగుతుందని అన్నారు. అయితే జౌట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల్లో కూడా మూలవేతనానికి అనుగుణంగానే చెల్లస్తున్నట్టు తెలిపారు. అందువల్ల సింగిల్ జడ్జి ఉత్తర్వులను కొట్టివేయాలని కమిషనర్ కోరారు. ఈ పిటిషన్​పై తదుపరి విచారణ ఈ నెల 9 కి వాయిదా పడింది.

ఇదీ చూడండి: అన్​లాక్​-5: సినిమా హాళ్లు తెరిచేందుకు కేంద్రం అనుమతి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.