ETV Bharat / city

ఎన్నికలకు ముందే కొత్త చట్టం...పారదర్శకతే ప్రధాన లక్ష్యం - జీహెచ్​ఎంసీకి ప్రత్యేక చట్టం...

ఎన్నికలకు ముందే గ్రేటర్ హైదరాబాద్‌కు కొత్త చట్టం రానుంది. పంచాయతీరాజ్, పురపాలక తరహాలోనే జవాబుదారీతనం, పారదర్శకతతో కూడిన చట్టాన్ని జీహెచ్​ఎంసీ కోసం కూడా రూపొందించనున్నారు. నూతన చట్టం ఆధారంగానే కొత్త పాలకమండలి బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది.

ghmc new act coming before elections
ghmc new act coming before elections
author img

By

Published : Sep 27, 2020, 9:34 AM IST

ఎన్నికలకు ముందే కొత్త చట్టం...పారదర్శకతే ప్రధాన లక్ష్యం

హైదరాబాద్ మహానగర పాలకసంస్థ ప్రస్తుత పాలకమండలి పదవీకాలం వచ్చే ఏడాది ఫిబ్రవరి పదో తేదీతో ముగియనుంది. ఆలోగా జీహెచ్ఎంసీకి కొత్త పాలకమండలిని ఎన్నుకోవాల్సి ఉంది. ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. ప్రభుత్వపరంగా గ్రేటర్ ఎన్నికల దిశగా అవసరమైన అడుగులు వేస్తున్నారు. జీహెచ్ఎంసీ సంబంధిత అంశాలపై సర్కార్ ప్రత్యేకంగా దృష్టి సారించింది.

పూర్తి పారదర్శకంగా పాలన...

రాష్ట్రంలో స్థానికసంస్థల పరిపాలన పూర్తి పారదర్శకంగా జరిగేలా పంచాయతీరాజ్, పురపాలక చట్టాల స్థానంలో కొత్త చట్టాలను తీసుకొచ్చింది. అధికారాలు, నిధులు ఇస్తూనే... విధులు, బాధ్యతలను కూడా ప్రత్యేకంగా పేర్కొన్నారు. పచ్చదనం, పారిశుధ్యంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. పదిశాతం హరిత బడ్జెట్, నాటిన మొక్కల్లో 85శాతం బతికి లేకుంటే బాధ్యులపై చర్యలు, వందశాతం పన్నుల వసూలు, ఇతరత్రా అంశాలను పొందుపరిచారు. పౌరులు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించేలా నిబంధనలు చేర్చారు. చెత్త వేసినా, చెట్టు నరికినా జరిమానాలు విధించవచ్చు. వీటన్నింటి ఫలితాలు ప్రస్తుతం క్షేత్రస్థాయిలో కనిపిస్తున్నాయి.

జీహెచ్​ఎంసీకి ప్రత్యేక చట్టం...

గతంలో తీసుకొచ్చిన పురపాలక చట్టం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మినహా మిగతా నగర, పురపాలికలకు ఉద్దేశించింది. జీహెచ్ఎంసీకి గతంలో ప్రత్యేక చట్టం ఉంది. పాలకమండలి కొనసాగుతున్న నేపథ్యంలో కొత్త చట్టాన్ని తీసుకురాలేదు. పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు కూడా కొత్త చట్టాన్ని తీసుకురానున్నారు. పురపాలకచట్టం తరహాలోనే పారదర్శకత, జవాబుదారీతనానికి పెద్దపీట వేయనున్నారు.

ఎన్నికలకు ముందే చట్టం...

భాగ్యనగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేలా ప్రణాళికలను అమలు చేస్తున్న ప్రభుత్వం... అదే లక్ష్యంతో చట్టంలో నిబంధనలను పొందుపర్చనుంది. శీతాకాల సమావేశాల్లో చట్టాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంది. లేదంటే ఆర్డినెన్స్ ద్వారా కూడా చట్టాన్ని తీసుకురావచ్చు. కొత్త చట్టం ఆధారంగానే ఎన్నికల పక్రియతోపాటు కొత్త పాలకమండలి పనిచేయాల్సి ఉంటుంది.

ఇదీ చూడండి: దసరా నుంచి ధరణి పోర్టల్‌ ప్రారంభం...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.