ETV Bharat / city

Fine for MLA: ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డికి జరిమానా.. ఎందుకంటే..? - జీహెచ్​ఎంసీ జరిమానా

GHMC fines Uppal MLA Subhash Reddy for setting up flexis in Uppal circle

author img

By

Published : Feb 10, 2022, 6:06 PM IST

Updated : Feb 12, 2022, 9:31 AM IST

18:03 February 10

Fine for MLA: ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డికి జరిమానా.. ఎందుకంటే..?

Fine for MLA: హైదరాబాద్​లోని ఉప్పల్‌ ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డికి జీహెచ్​ఎంసీ జరిమానా విధించింది. ఉప్పల్‌ సర్కిల్‌లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినందుకు గానూ.. ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డికి రూ.40 వేలు జరిమానా విధించారు.

గతంలోనూ జీహెచ్‌ఎంసీ పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు జరిమానాలు విధించింది.. మాదాపూర్‌ హైటెక్స్‌లో తెరాస ప్లీనరీ సందర్భంగా నగరవ్యాప్తంగా ఏర్పాటైన ఫ్లెక్సీలు, జెండాలు, కటౌట్లపై జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం పెద్దఎత్తున జరిమానాలు విధించింది. ఫ్లెక్సీలపై ట్విటర్‌లో వచ్చిన ఫిర్యాదులను ఒకేరోజు పరిశీలించింది. ఒక్కోదానికి రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు జరిమానా విధించింది. మొత్తం మీద 100 వరకు చలానాలు పడ్డాయి. వాటిలో మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ల పేరుతో ఉన్నవే ఎక్కువ. వీటికిగాను ఒక్కొక్కరికి రూ.5 లక్షలకుపైగా జరిమానాలు పడ్డట్లు అధికారులు తెలిపారు. బ్యానర్లపై ఈ నెల 21 నుంచే నెటిజన్లు ట్విటర్‌లో ఫిర్యాదులు చేయడం ప్రారంభించారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ట్విటర్‌లో పెట్టిన దానం నాగేందర్‌ ఫ్లెక్సీలకుగాను రూ.50 వేలు జరిమానా పడింది. కాంగ్రెస్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి ఫిర్యాదుతో మంత్రి తలసానికి రూ.5 వేలు చలానా విధించారు. మంత్రి మల్లారెడ్డికి రూ.10 వేలు, మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మికి రూ.25 వేలు, తెరాస ప్రధాన కార్యదర్శి పేరిట రూ.95 వేలు సహా ఫ్లెక్సీలు పెట్టిన మరికొందరు నేతలకూ జరిమానాలు పడ్డాయి.

ఇదీ చూడండి:

Last Updated : Feb 12, 2022, 9:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.