ETV Bharat / city

భాగ్యనగరంలో థీమ్ పార్కుల నిర్మాణం.. మరింత ఆహ్లాదం - ghmc

భాగ్యనగర ప్రజలకు మరింత ఆహ్లాదం పంచడానికి జీహెచ్​ఎంసీ ఓ వినూత్న ప్రయత్నం చేయనుంది. నగరంలో 57 పార్కులను థీమ్​ పార్కులుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.

GHMC decided to renovated 57 parks as theme parks
భాగ్యనగర వాసులకు ఆహ్లాదం పంచేందుకు థీమ్​ పార్కులు
author img

By

Published : Jan 4, 2021, 7:43 PM IST

గ్రేటర్​ హైదరాబాద్​లో 57 పార్కులను థీమ్ పార్కులుగా అభివృద్ధి చేయాలని జీహెచ్​ఎంసీ నిర్ణయించింది. ఇప్పటికే ఉన్న ఈ పార్కులను వినూత్నంగా పునర్నిర్మించి నగరవాసులకు ఆహ్లాదాన్ని పంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

ఇందిరా పార్కు, జలగం వెంగళ్రావు పార్కులను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయడానికి డిజైన్లు రూపొందించేందుకు టెండర్లను కూడా ఆహ్వానించారు. ఈ ప్రతిపాదిత 57 పార్కుల్లో ఎల్బీనగర్​ జోన్​లో 16, కూకట్​పల్లి జోన్​లో 6, శేరిలింగంపల్లి జోన్​లో 10, సికింద్రాబాద్ జోన్​లో 8, ఖైరతాబాద్ జోన్​లో 14, చార్మినార్ జోన్​లో 3 పార్కులను థీమ్ పార్కులుగా రూపొందించనున్నారు.

థీమ్ పార్కుల్లో.. సైన్స్, పర్యావరణ, బతుకమ్మ, 7 వండర్లు, ఇల్యూషన్, నాలెడ్జ్, జపనీస్, మొఘల్ గార్డెన్, నిజాం షాహీ థీమ్ పార్కు, ఫౌంటెన్ థీమ్, రాక్ గార్డెన్, చిల్డ్రన్స్, విమెన్ వంటి తదితర థీమ్​లతో పార్కులను అభివృద్ధి చేయాలని జీహెచ్​ఎంసీ అధికారులు నిర్ణయించారు. ఈ డిజైన్లు రూపొందించి పనులు ప్రారంభించేందుకు జీహెచ్​ఎంసీ అర్బన్ బయోడైవర్సిటీ విభాగం చర్యలు చేపట్టింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.