ETV Bharat / city

Ganesh Chaturthi : గణేశ్ చతుర్థిపై కరోనా ప్రభావం.. విగ్రహాల కొనుగోళ్లు అంతంతమాత్రం

author img

By

Published : Sep 4, 2021, 1:47 PM IST

గణేశ్ చతుర్థి(Ganesh Chaturthi) అనగానే ముందుగా గుర్తొచ్చేది ముంబయి. ఆ తర్వాత అంత ఘనంగా గణపతి ఉత్సవాలు జరిగేది భాగ్యనగరంలోనే. వినాయక చవితి(Ganesh Chaturthi) వస్తోందంటే చాలు.. నగరమంతా సందడిగా మారుతుంది. చందాల వసూలు, విగ్రహాల కొనుగోలు, మండపాల ఏర్పాట్లతో మహానగరంలో కోలాహలం మొదలవుతుంది. గతేడాది కరోనా వల్ల ఈ ఉత్సవాలు జరగలేదు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి కాస్త తగ్గుముఖం పట్టడం వల్ల ఈ ఏడు గణేశ్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిపేందుకు భాగ్యనగరం ముస్తాబవుతోంది.

గణేష్ చతుర్థిపై కరోనా ప్రభావం
గణేష్ చతుర్థిపై కరోనా ప్రభావం
గణేశ్ విగ్రహాల కొనుగోళ్లు అంతంతమాత్రం

గణేశ్ చతుర్థి(Ganesh Chaturthi) వచ్చేస్తోంది. హైదరాబాద్​లో సందడి మొదలైంది. చందాల వసూళ్లు, విగ్రహాల కొనుగోళ్లు, మండపాల ఏర్పాట్లతో భాగ్యనగరం కోలాహలంగా మారింది. గతేడాది కరోనా వ్యాప్తి వల్ల ఉత్సవాలు జరపలేదు. ఈసారి అత్యంత వైభవంగా జరిపేందుకు ఏర్పాట్లు షురూ అయ్యాయి. బోనాల అనంతరం హైదరాబాద్​లో గణేశ్ పండుగ ఘనంగా జరుగుతుంది. గల్లీకో వినాయకుడిని ప్రతిష్టించి పోటీపడుతూ వేడుకలు నిర్వహిస్తారు. గణపతి విగ్రహాల కొనుగోళ్లు.. నెల రోజుల ముందునుంచే ప్రారంభమవుతాయి.

కరోనా తగ్గినా.. పెరగని కొనుగోళ్లు..

గతేడాది గణేశ్(Ganesh Chaturthi) మండపాలకు ప్రభుత్వం చాలా తక్కువ సంఖ్యలో అనుమతి ఇవ్వడం వల్ల హైదరాబాద్​లో మండపాల సంఖ్య తగ్గిపోయింది. వేడుకలు జరిగిన చోట కూడా నిరాడంబరంగా నిర్వహించారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా విగ్రహాల కొనుగోళ్లూ ఎక్కువగా జరగలేదు. దీనివల్ల వ్యాపారులు నష్టపోయారు. ఈఏడు కొవిడ్ ప్రభావం తక్కువగా ఉండటం వల్ల విగ్రహాల కొనుగోళ్లు గతేడు కంటే కాస్త ఎక్కువగానే ఉన్నా.. కరోనా కంటే ముందుతో పోలిస్తే చాలా తక్కువగా ఉన్నట్లు వ్యాపారులు చెబుతున్నారు.

విగ్రహాల తయారీ తగ్గిపోయింది..

హైదరాబాద్​లో విగ్రహాల తయారీ, వ్యాపారానికి ధూల్​పేట పేరుగాంచింది. ఇక్కడికి రాష్ట్రంలోని జిల్లాల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల నుంచి విగ్రహాలు కొనుగోలు చేసేందుకు వస్తుంటారు. ఈసారి రాష్ట్రం నుంచి మాత్రమే ప్రజలు ఇక్కడికి వస్తున్నారు. ఈ సారి ఇక్కడ కేవలం 8 నుంచి 10వేల విగ్రహాలు మాత్రమే తయారైనట్లు స్థానిక వ్యాపారులు అంచనా వేస్తున్నారు. సాధారణ సమయంతో పోల్చితే సగం వరకు విగ్రహాల తయారీ తగ్గిపోయిందని చెబుతున్నారు.

"కరోనా వ్యాప్తి, లాక్​డౌన్, ఆర్డర్లు లేక ఎక్కువ గణేశ్ విగ్రహాలు తయారు చేయలేదు. గతేడాది తయారు చేసిన విగ్రహాలు ఎక్కువగా విక్రయం జరగకపోవడం వల్ల చాలా నష్టపోయాం. ఈఏడు అది పునరావృతం కాకుండా ఉండాలని తక్కువ విగ్రహాలే తయారు చేశాం. ప్రస్తుతం కొంత వరకు విగ్రహాల కొనుగోళ్లు సంతృప్తికరంగానే ఉన్నాయి. కరోనా భయంతో విగ్రహాల తయారీ సగానికి తగ్గించాం. ప్రతి ఏడు తెలంగాణ నుంచే కాకుండా.. ఏపీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కొనుగోలుదారులు వచ్చేవారు. ఇప్పుడు కేవలం మన రాష్ట్రం నుంచే వస్తున్నారు."

- గణేష్ విగ్రహ తయారీదారులు

"గతేడాది కంటే ఈ ఏడు గణేశ్ విగ్రహాల ధర చాలా వరకు పెరిగింది. మేం కూడా ఎప్పుడు పెద్దపెద్ద విగ్రహాలు పెట్టేవాళ్లం. కానీ.. పెరిగిన ధరలతో చిన్న విగ్రహాలే పెడుతున్నాం. మరోవైపు కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ఉత్సవాలు జరిపేలా ప్లాన్ చేసుకున్నాం."

- గణేష్ మండపాల నిర్వాహకులు

గణేశ్ మండపాల నిర్వాహకులు కూడా తక్కువ ఎత్తు ఉన్న వాటికోసం చూస్తున్నారు. ఒకప్పుడు 20-25 అడుగుల ఎత్తున్న విగ్రహాలు ఎక్కువగా ఏర్పాటు చేసే చోట.. ఇప్పుడు 10 నుంచి 15 అడుగుల ఎత్తు వినాయకుడిని కొనుగోలు చేస్తున్నట్లు దుకాణాల నిర్వాహకులు చెబుతున్నారు.

ధరలు పెరిగాయి..

విగ్రహాల ధరలు కూడా ఈసారి బాగా పెరిగాయి. వివిధ విభాగాల్లో 40 నుంచి 100 శాతం పెరిగిందని మండపాల నిర్వాహకులు అంటున్నారు. విగ్రహ తయారీకి కావాల్సిన మెటీరియల్, రంగులు, కార్మికుల కూలీ పెరగడం వల్ల విగ్రహ ధరలు కూడా పెరిగాయని చెబుతున్నారు.

వచ్చే ఏడాదైనా కరోనా మహమ్మారి పూర్తిగా అంతమై.. ఎలాంటి భయాలు లేకుండా పండుగ జరుపుకోవాలని ఇటు ప్రజలు.. అటు వ్యాపారులు ఆశిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.