Free B.tech Seats: చదువులో ర్యాంకులు సాధించని ఎంతోమంది జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో రాణిస్తుంటారు. సమస్యలను లోతుగా అర్థం చేసుకొని వినూత్న పరిష్కారాలకు రూపం ఇచ్చి పరికరాలు, యంత్రాలు తయారు చేస్తుంటారు. అలాంటి ప్రతిభావంతులకు (గిఫ్టెడ్ చిల్డ్రన్)కు ఒక్కో కళాశాలల్లో 2 సీట్లు కేటాయిస్తామని ఏఐసీటీఈ ప్రకటించింది. ఆ మేరకు మార్గదర్శకాలను జారీ చేసింది.
త్వరలో కళాశాలల ఎంపిక..: విద్యాసంస్థ పనితీరు, కేంద్ర విద్యాశాఖ ఇచ్చే జాతీయ ర్యాంకింగ్(ఎన్‌ఐఆర్‌ఎఫ్), ఏఐసీటీఈ అటల్ ర్యాంకింగ్‌తో పాటు నేషనల్ బోర్డు ఆఫ్ అక్రిడిటేషన్(ఎన్‌బీఏ) గుర్తింపు తదితర కొలమానాల ఆధారంగా ఈ సీట్లు కేటాయించాల్సిన కళాశాలలను త్వరలో ఎంపిక చేస్తామని ఏఐసీటీఈ పేర్కొంది.
ప్రస్తుతానికి ఏఐసీటీఈ గుర్తించిన పోటీలు ఇవీ..
* రాష్ట్ర, జాతీయ స్థాయి హ్యాకథాన్
* సీఎస్‌ఐఆర్ ఇన్నోవేషన్ అవార్డు
* ఇన్‌స్పైర్ అవార్డు
* ఏపీజే అబ్దుల్ కలాం ఇగ్నైట్ పురస్కారం
* కిషోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన (కేవీపీవై)
* గూగుల్ సైన్స్ ఫెయిర్
* అటల్ న్యూ ఇండియా ఛాలెంజ్
* ప్రధానమంత్రి ఇన్నోవేటివ్ లెర్నింగ్ ప్రోగ్రామ్- ధ్రువ్
* నాసా రోవర్ ఛాలెంజ్
* ఇంటెల్ ఇంటర్నేషనల్ సైన్స్, ఇంజినీరింగ్ ఫెయిర్
* వరల్డ్ రోబోట్ ఒలింపియాడ్ ఇండియా
* ఫస్ట్ లెగో లీగ్ ఇండియా
* ఫస్ట్ టెక్ ఛాలెంజ్
* ఫస్ట్ రోబోటిక్స్ కాంపిటీషన్
* ఇండియన్ రోబో కప్ జూనియర్
* నేషనల్ సైన్స్ కాంకర్స్
* ఎన్‌ఎస్‌ఎస్, నాసా స్పేస్ సెటిల్‌మెంట్ కాంటెస్ట్
* ఇమేజిన్ కప్ (మైక్రోసాఫ్ట్)
* రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు నిర్వహించే ఒలింపియాడ్
* ఇన్నోవేటివ్ స్టార్టప్ అవార్డ్
ఎవరు అర్హులు..:
* ప్రభుత్వ, ప్రతిష్ఠాత్మక సంస్థలు నిర్వహించే జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో విజేతలు.
* కేంద్ర సైన్స్- టెక్నాలజీ విభాగం(డీఎస్‌టీ), బయోటెక్నాలజీ విభాగం(డీబీటీ), సీఎస్‌ఐఆర్, ఎన్‌సీఈఆర్‌టీ, కేంద్ర విద్యాశాఖ, డీఆర్‌డీవోల నుంచి ప్రాజెక్టులకు నిధులు పొందిన వారు.
* గుర్తింపు పొందిన బహుళ జాతి, స్వచ్ఛంద సంస్థల (గూగుల్, బెల్ ల్యాబ్స్, ఇంటెల్, టీసీఎస్, ఐబీఎం, టెస్లా, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, లాక్‌హీడ్ మార్టిన్, స్టెమ్ తదితర) నుంచి నిధులు పొందిన వారు.
* యూజీసీ గుర్తించిన కేర్-2 జర్నళ్లలో పరిశోధన పత్రాలు ప్రచురితమైన వారు
* జాతీయ, అంతర్జాతీయ పేటెంట్లు పొందిన వారు.
ఇంటర్ ఉత్తీర్ణులవ్వాలి...
* ఆయా విద్యార్థులు ఎస్సీ, ఎస్టీలైతే 40 శాతం, ఇతరులు 45 శాతంతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి.
* ఇంజినీరింగ్ చదవాలన్న ఆసక్తి ఉండటంతో పాటు తనకు సీటు కేటాయించాలని కళాశాలకు దరఖాస్తు చేసుకోవాలి. నిపుణుల కమిటీ ముఖాముఖికి హాజరుకావాల్సి ఉంటుంది.
ఇవీ చదవండి..:
Amith shah On CM Kcr: ఇంత అసమర్థ సీఎంను నేనెప్పుడూ చూడలేదు: అమిత్ షా
Ktr Nalgonda tour: భాగ్యనగరానికి 65 టీఎంసీల నీటికుండ: కేటీఆర్
బాలికపై నుంచి దూసుకెళ్లిన ట్రక్కు.. డ్రైవర్‌కు నిప్పంటించిన స్థానికులు