CHINTAMANENI: కోడి పందేలు అంటే తనకు ఎంతో ఇష్టమని, అది తన వ్యసనమని తెదేపా నేత చింతమనేని ప్రభాకర్ అన్నారు. ఏపీ ఏలూరులో నిర్వహించిన తెదేపా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తనకు కోడి పందేలు వేయడం వ్యసనం కావటంతోనే.. అక్కడికి వెళ్లానని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తున్న ఫొటోలు, వీడియోల్లో ఉన్నది తానేనని ఒప్పుకున్నారు. అయితే.. కోడి పందేల స్థావరం నిర్వహించాల్సిన అవసరం తనకు లేదని అన్నారు.
ఇదీ చదవండి: 'దేశానికి రాహుల్‌ను ప్రధానిని చేసినప్పుడే వైఎస్సార్ ఆత్మకు శాంతి..'
ద్రౌపది కోసం భాజపా పక్కా ప్లాన్.. రెండు రోజులు ముందే దిల్లీకి ఎంపీలు