ముఖ్యమంత్రి కేసీఆర్ తుగ్లక్ తరహాలో నిర్ణయాలు తీసుకుంటున్నారని మాజీ ఎంపీ వివేక్ అన్నారు. నియంతృత్వ పాలన అంతమై ప్రజాస్వామ్య తెలంగాణ కోసమే తాను భాజపాలో చేరడానికి నిర్ణయించుకున్నానని తెలిపారు. జేపీ నడ్డా సమక్షంలో ఈరోజు సాయంత్రం వివేక్ భాజపాలో చేరతారని రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ వెల్లడించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు మోదీ సిద్ధంగా ఉన్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి అన్నారు. వివేక్ చేరికతో రాష్ట్రంలో భాజపా బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
- ఇదీ చూడండి : జలసౌధలో కృష్ణా బోర్డు సమావేశం