మాజీ మంత్రి ఈటల రాజేందర్ దిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆయన అనుచరులు ఘనస్వాగతం పలికారు. ఈటల వెంట మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి ఉన్నారు. శుక్రవారం రోజున .. భవిష్యత్ కార్యచరణ ప్రకటించనున్నారు.
![eatala rajender, etela rajender, eatala reached in Hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-hyd-07-03-airportetelaarraivel-av-ts10020_03062021101030_0306f_1622695230_0.jpg)
ఈ నెల 8 లేదా 9న ఈటల.. భాజపాలో చేరనున్నట్లు సమాచారం. ఇప్పటికే దిల్లీ వెళ్లి భాజపా జాతీయ నాయకత్వంతో చర్చించారు. ఈటల సహా మొత్తం ఐదుగురు నేతలు కాషాయ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది.
![eatala rajender, etela rajender, eatala reached in Hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-hyd-07-03-airportetelaarraivel-av-ts10020_03062021101030_0306f_1622695230_259.jpg)