వచ్చే నెలలో.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను జైల్లో పెట్టేందుకు కుట్రలు జరుగుతున్నాయని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. ఏపీ ప్రభుత్వానికి పోయే కాలం వచ్చినందునే తన పైనా, అశోక్ గజపతిరాజు, ఇతర నాయకుల మీదా అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, 307 హత్యాయత్నం కేసుల నుంచి.. న్యాయ దేవత తనను కాపాడిందని చెప్పారు.
కొండపల్లిలో అక్రమ మైనింగ్ జరుగుతోందనడానికి అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని దేవినేని ఉమా అన్నారు. కొండపల్లి అడవి దోపిడీకి గురవుతుంటే జగన్ రెడ్డికి పచ్చ తోరణం ఎందుకని ప్రశ్నించారు. జే ట్యాక్స్ అందినందుకే అక్రమ మైనింగ్ దోషుల్ని ముఖ్యమంత్రి కాపాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమగ్ర విచారణ జరిగితే వందల కోట్లు ఫైన్ కట్టాల్సి వస్తుందనే అవినీతిలో భాగస్వామి అయిన జగన్ రెడ్డి అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.
ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా ఇంకా ఉద్ధృతంగా పోరాడుతామన్నారు. బెయిల్‌పై విడుదల అయిన ఉమా విజయవాడ గొల్లపూడి నివాసానికి చేరుకున్నారు. తెదేపా నేతలు, కార్యకర్తలు ఆయనకు బాణసంచా పేల్చి స్వాగతం పలికారు.
ఇవీచూడండి: ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్... రూ.95 లక్షల విలువైన ప్రాపర్టీని సీజ్