అధికారం కోసం దేశంలో కొందరు అశాంతి సృష్టిస్తున్నారని.. ముస్లింలను సంతృప్తి పరిచేందుకే కాంగ్రెస్, వామపక్షాలు ప్రయత్నం చేస్తున్నాయని వీహెచ్‌పీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి సురేంద్ర జైన్ ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ గతంలో పౌరసత్వ చట్ట సవరణకు ప్రయత్నాలు చేసిందని.. ఈ బిల్లుకు అనుకూలంగా చట్ట సభల్లో మాట్లాడిందని గుర్తుచేశారు. ఆ పని భాజపా చేస్తే ఇప్పడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారని నిలదీశారు. బంగ్లాదేశ్, పాకిస్థాన్, అఫ్గానిస్తాన్‌లో దళితులు వివక్షకు గురౌతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చట్టంలో భారత్‌లో ఉండే ముస్లింలకు ఎలాంటి నష్టం లేదని స్పష్టం చేశారు.