Flights Cancelled Due to Cyclone Asani: తీవ్ర తుపాను 'అసని' ప్రభావం.. విమాన రాకపోకలపై పడింది. ఏపీ విశాఖలో ఏర్పడిన ప్రతికూల వాతావరణంతో కర్నూలు, బెంగళూరు, హైదరాబాద్ నుంచి రావాల్సిన ఇండిగో విమానాలు వెనుదిరిగాయి. హైదరాబాద్, ముంబయి, చెన్నై, విజయవాడ, రాజమహేంద్రవరంలో ఇండిగో సర్వీసులు రద్దయ్యాయి.
ఉప్పాడ తీరంపై తుపాను ప్రభావం: కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంపై తుపాను తీవ్ర ప్రభావం చూపుతోంది. సమీప గ్రామాల్లో ఇళ్లు కోతకు గురవుతున్నాయి. బలమైన ఈదురుగాలులకు కెరటాలు ఎగసిపడుతున్నాయి. ఈ దురుగాలులకు భారీ పంటు ఉప్పాడ తీరానికి కొట్టుకొచ్చింది. కాకినాడ బీచ్ రోడ్డుపైకి కెరటాలు ఎగసిపడుతున్నాయి.
ఇవీ చూడండి: Accident CCTV Footage: డ్రైవర్ నిర్లక్ష్యంతో కారు కింద పడి చిన్నారి దుర్మరణం
దివ్యాంగ చిన్నారికి విమానంలో నో ఎంట్రీ.. కేంద్రమంత్రి ఫైర్.. దిగొచ్చిన ఇండిగో!