ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా యాచారం మండలానికి చెందిన ఐదు గ్రామాల రైతులు పాదయాత్ర చేపట్టారు. మిర్కాన్పేట్ కుర్మిద్ద, తాడిపర్తి, నానక్ నగర్, మేడిపల్లి గ్రామాల నుంచి రైతులు పాదయాత్రలో పాల్గొన్నారు. ఫార్మాసిటీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. జాతీయ జెండాలతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు.
భూములు లాక్కుంటే.. తమ భూమిలో తామే కూలీ చేసుకునే పరిస్థితి వస్తుందని వాపోయారు. మొదట అసైన్డ్ భూములు తీసుకుంటాం అని చెప్పిన ప్రభుత్వం.. నేడు పట్టా భూములనూ బలవంతంగా సేకరిస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫార్మా కంపెనీకి భూములను ఇచ్చేది లేదని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: ఉద్యోగులపై పని భారం తగ్గించాలి: అశ్వత్థామ రెడ్డి