హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్డులో మార్వాడీ యువ సంఘటన్ హైదరాబాద్, సికింద్రాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో... 'ఫిట్ హైదరాబాద్' పేరిట 2కే రన్ నిర్వహించారు. భాగ్యనగర ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు నిర్వహించిన పరుగులో యువతీయువకులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పీపుల్స్ ప్లాజా వద్ద నుంచి ప్రారంభమైన పరుగు జలవిహార్ వరకు సాగింది.
నిత్యం పని ఒత్తిడితో ఉండే ప్రజలు రోజూ అరగంట తప్పని సరిగా నడక, పరుగు చేయాలని... అప్పుడే ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటారని నిర్వాహకులు తెలిపారు. ఈ విషయంలో ప్రజలకు అవగాహన పెంచేందుకే ఫిట్ హైదరాబాద్ పరుగు నిర్వహించినట్లు పేర్కొన్నారు. పరుగులో యువతతో పాటు పాల్గొన్న మలక్పేట్ డెఫ్ అండ్ డమ్ విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, మెమెంటోలను నిర్వాహకులు అందజేశారు.