ETV Bharat / city

శేషాచలం అడవుల్లో అగ్నిప్రమాదం.. వారి పనేనా..?

author img

By

Published : Mar 17, 2022, 2:18 PM IST

శేషాచలం అడవుల్లో అగ్నిప్రమాదం.. వారి పనేనా..?
శేషాచలం అడవుల్లో అగ్నిప్రమాదం.. వారి పనేనా..?

14:13 March 17

ఆంధ్రప్రదేశ్​లోని తిరుమల తిరుపతిలోని శేషాచలం అటవీ ప్రాంతంలోని ఫారెస్ట్ బీట్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటలు పెద్దఎత్తున ఎగిసిపడ్డాయి. విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

ఇదిలా ఉండగా.. అటవీ ప్రాంతంలోని కరకంబాడి ఫారెస్ట్ బీట్‌లో మంటలు చెలరేగినట్టు అటవీ అధికారులు వెల్లడించారు. ఎర్ర చందనం స్మగ్లర్ల వల్లే ఈ మంటలు చెలరేగి ఉంటాయని భావిస్తున్నారు. ఈ మేరకు మంటలను అదుపు చేసినట్లు తెలిపారు.

శేషాచలం అడవుల్లో తరచూ చెలరేగుతోన్న కార్చిచ్చుతో అరుదైన వృక్ష, జంతు జాతులు అంతరించిపోతున్నాయి. ఫలితంగా అపార నష్టం వాటిల్లుతోంది. ఈ క్రమంలోనే అగ్ని ప్రమాదాలు జరగకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.