రాష్ట్ర విభజన జరిగాక ఏపీకి కచ్చితంగా వస్తుందన్న పరిశ్రమల్లో ప్రధానమైనది సినీ రంగం. ఇక్కడ అందుబాటులో ఉన్న వనరులు, ప్రకృతి అందాలు ఆ వాదనలకు బలాన్ని చేకూర్చాయి. దశాబ్దాలుగా హైదరాబాద్‌లో పాతుకుపోయిన ఇండస్ట్రీ ఒక్కసారిగా విశాఖకు రావడమంటే సాధారణ విషయం కాదు. బీచ్ రోడ్డు, కైలాసగిరి, సింహాచలం, అరకు ఇలా చెప్పుకోదగ్గ అనేక కనువిందు దృశ్యాలే కాదు, సినీ రంగంలోని 24 కళలకూ చెందిన ఎంతోమంది ప్రతిభావంతులైన యువకులూ విశాఖలో ఉన్నారు. విశాఖ నుంచి వెళ్లి చిత్రరంగంలో సత్తా చాటుకున్నవారికీ కొదవ లేదు.
మౌలిక వసతుల కల్పన
ఏపీలో చిత్రీకరణలకు ప్రభుత్వం సింగిల్ విండో అనుమతులు ఇస్తుండటం శుభసూచకమే అయినా ఇండస్ట్రీ తరలిరావాలంటే మరిన్ని విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని సినీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విశాఖలో రామానాయుడు స్టూడియో ఉన్నప్పటికీ మౌలిక వసతుల కల్పన మరింత వేగంగా జరగాలని నిపుణులు అంటున్నారు.
ఇదీ చదవండి : 'గ్రామీణ ప్రాంతాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి'