ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం రైతులు, మహిళలు చేపట్టిన ఆందోళనలు నేటికి 250 రోజులకు చేరాయి. ఇవాళ రాజధాని రణభేరి పేరుతో రాజధాని గ్రామాల్లో రైతుల నిరసనలు చేపట్టారు.
అమరావతినే కొనసాగించాలని...
రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ.. కరోనా సమయంలోనూ తుళ్లూరులో రైతులు, మహిళలు నిరసనలు హోరెత్తిస్తున్నారు.
నిర్ణయం మారకుంటే ఉద్ధృతం చేస్తాం...
ప్లకార్డులు పట్టుకుని విభిన్న రూపాల్లో నిరసనలు తెలియజేశారు. రాజధాని విషయంలో ప్రభుత్వం నిర్ణయం మార్చకుంటే మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇవీ చూడండి : వరదల నష్టాన్ని.. సీఎం దృష్టికి తీసుకెళ్తా : ప్రభుత్వ విప్ రేగా కాంతారావు