ETV Bharat / city

కాంగ్రెస్​ను వీడనున్న భిక్షపతి యాదవ్!‌.. ఫలించని బుజ్జగింపులు

గ్రేటర్​ ఎన్నికలకు నగారా మోగిన తరుణంలో హైదరాబాద్​లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. పలువురు నేతలు పార్టీలు మారేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే మాజీ మేయర్​ బండ కార్తీక రెడ్డి భాజపాలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకోగా..తాజాగా భిక్షపతి యాదవ్‌ కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. ఇప్పటికే ఆయన కుమారుడు రవికుమార్‌ యాదవ్‌ కాంగ్రెస్​కు రాంరాం చెప్పారు.

ex mla bikshapathi yadav resign to congress

author img

By

Published : Nov 18, 2020, 11:34 AM IST

Updated : Nov 18, 2020, 12:40 PM IST

శేరిలింగంపల్లి కాంగ్రెస్​ పార్టీ ఇన్​ఛార్జి రవికుమార్​ యాదవ్​ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. ఈ రోజు మధ్యాహ్నం బండి సంజయ్‌ ఆధ్వర్యంలో భాజపాలో చేరనున్నారు. కుమారుడితో పాటే మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్‌ కూడా భాజపాలో చేరనున్నట్లు సమాచారం.

హస్తం వీడనున్న భిక్షపతి యాదవ్!‌.. ఫలించని బుజ్జగింపులు

ఈ నేపథ్యంలోనే మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్‌తో కాంగ్రెస్ నేతల సమావేశమయ్యారు. ఇరువురు నేతలు కాంగ్రెస్‌ను వీడుతున్నట్లు ప్రచారం జరగడంతో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌, ఎంపీ రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి గోపన్‌పల్లిలోని భిక్షపతి నివాసానికి వెళ్లారు. భిక్షపతి యాదవ్‌ కుమారుడు రవికుమార్‌ యాదవ్‌ పార్టీకి ఇప్పటికే రాజీనామా చేయగా.. ఇరువురిని బుజ్జగించేందుకు అగ్రనాయకత్వం ప్రయత్నించింది. ఇరువురు నేతలను బుజ్జగిచేందుకు కాంగ్రెస్‌ నేతలు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.

ఇవీ చూడండి: మోగిన బల్దియా నగారా.. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ

Last Updated : Nov 18, 2020, 12:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.