1. సచివాలయ నమూనాపై నేడు మరోదఫా సీఎం సమీక్ష
చూడగానే చూపరులను అబ్బురపరిచాలి. ప్రాంగణమంతా పచ్చదనం పరవాలి. మొత్తంగా సచివాలయం సమున్నతంగా ఉండేలా నమూనాను రూపొందించే పనిలో ప్రభుత్వం ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన పలు సూచనలపై ఆర్కిటెక్ట్ బృందం మేధోమథనం చేస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. 'తెలంగాణ ప్రభుత్వం స్పందించడం లేదు'
శ్రీశైలం దిగువన సాగునీటి అవసరాలు లేకపోయినా, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఇంకా నీటి కేటాయింపులు చేయకపోయినా... తెలంగాణ రాష్ట్రం ముందే విద్యుదుత్పత్తి ప్రారంభించిందని ఆంధ్రప్రదేశ్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. నివేదికలున్నా గుత్తేదారుపై చర్యలేవీ?
నిలోఫర్ ఆస్పత్రిలో ఆహార సరఫరా ఒప్పందానికి సంబంధించిన నిధుల దుర్వినియోగంలో గుత్తేదారుతో అందరూ కుమ్మక్కైనట్లుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. దుర్వినియోగమైన నిధుల్లో సగం మరోచోటికి తరలుతున్నట్లుందని అనుమానం వ్యక్తం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. 'తీసుకున్న లంచం తిరిగిచ్చేస్తా'
తమ భూములకు పట్టాలు ఇస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసిన తహసీల్దార్ ఇప్పడు బదిలీపై వెళ్తున్నారని చింతలమానేపల్లి మండలంలో పలువురు ఆందోళనకు దిగారు. తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. అయోధ్య మందిరానికి ఆకృతినిచ్చింది ఆ కుటుంబమే..
అయోధ్యలో సర్వాంగ సుందరంగా.. అడుగడుగునా విశిష్టతలతో.. రామమందిర నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆగస్టు 5న అంగరంగ వైభవంగా భూమిపూజ చేయడానికి ట్రస్ట్ సర్వసన్నద్ధమవుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. అఫ్గాన్‌లో ఆత్మాహుతి దాడి
అఫ్గానిస్థాన్ లోగర్ రాష్ట్రంలో పోలీసు తనిఖీ కేంద్రం లక్ష్యంగా ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు ముష్కరులు. ఈ దాడిలో 9 మంది మృతి చెందారు. 40 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఆరుగురు పోలీసులు, ముగ్గురు పౌరులు ఉన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. భారీస్థాయిలో పడిపోతున్న ఆర్థిక వ్యవస్థలు
కరోనావైరస్ ధాటికి ఆర్థిక వ్యవస్థలు కకావికలమవుతున్నాయి. ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ 33శాతం వార్షిక రేటుతో క్షీణించింది. అమెరికా చరిత్రలో ఇదే అథమ వృద్ధి రేటు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. 'ప్రపంచంలోనే అతిపెద్ద టోర్నమెంట్ ఐపీఎల్'
ఐపీఎల్, పీసీఎల్ లీగ్‌ల మధ్య చాలా వ్యత్యాసం ఉందని అన్నాడు పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్. ఈ క్రమంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద టోర్నమెంట్ ఏదైనా ఉందంటే అది ఐపీఎల్ అని పేర్కొన్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. 'చైనా దుర్బుద్ధిని తీవ్రంగా పరిగణించాలి'
చైనాపై మరోమారు తీవ్ర విమర్శలు చేశారు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో. భూటాన్‌లో ప్రాదేశిక వాదనలు, ఇటీవల భారత్‌లోకి చొరబాట్లు చైనా ఉద్దేశాలను సూచిస్తున్నాయని పేర్కొన్నారు. తమ అధికారాన్ని విస్తరించుకోవాలనే కోరికతో దుశ్చర్యలకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. వెబ్‌సిరీస్‌తో 'ఫిదా' చేయబోతున్న సాయి పల్లవి
ఇప్పటికే అగ్రనాయికలు సమంత, తమన్నా తదితరులంతా వెబ్‌సిరీస్‌ల్లో నటించేందుకు సిద్ధమయ్యారు. తాజాగా ఈ జాబితాలో సాయి పల్లవి చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.