1. సీఎంకు ధన్యవాదాలు
రాష్ట్రంలో ఉద్యోగులకు 30 శాతం ఫిట్ మెంట్, 61 ఏళ్ల వరకు ఉద్యోగ విరమణ వయసు సహా పలు హామీలు ఇచ్చిన నేపథ్యంలో.. సీఎం కేసీఆర్‌ను పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. 'ప్రతిపక్షాన్ని బతకనివ్వండి'
ప్రభుత్వంపై భాజపా ఒత్తిడి, నిరసనలు చేయడంతోనే ఉద్యోగులకు కేసీఆర్ పీఆర్సీని ప్రకటించారని భాజపా ఎమ్మెల్యే రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల దృష్ట్యా ఇష్టం లేకున్నా.. కష్టం కొద్ది పీఆర్సీ ప్రకటించారని ఎద్దేవా చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. లొంగిపోయిన అఖిలప్రియ భర్త, సోదరుడు
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బోయిన్పల్లి కిడ్నాప్‌కేసులో నిందితులు అఖిల ప్రియ సోదరుడు, భర్త పోలీసులకు లొంగిపోయారు. ఇన్నాళ్లు అజ్ఞాతంలో ఉన్న భార్గవరామ్, జగత్ విఖ్యాత్ రెడ్డి... బోయిన్పల్లి పీఎస్‌లో లొంగిపోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. 'ఆ నిందితున్ని వెంటనే శిక్షించాలి'
మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడైన తెరాస నాయకుడు అసిఫ్‌ను తక్షణమే శిక్షించాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరవైందని కామారెడ్డి ఏబీవీపీ కన్వీనర్ మనోజ్ ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. పార్లమెంటులో రగడ
మహారాష్ట్రలో ప్రకంపనలు సృష్టించిన ముంబయి మాజీ పోలీస్ కమిషనర్ పరమ్‌బీర్ సింగ్ లేఖ వివాదం.. పార్లమెంటుకు చేరింది. సీఎం ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం గద్దె దిగాలని భాజపా డిమాండ్ చేసింది. ఈ అంశంపై కాంగ్రెస్, భాజపా, స్వతంత్ర ఎంపీ నవనీత్ రవి రాణా మధ్య మాటల యుద్ధం జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. మాస్క్‌ల సాయంతో కాపీయింగ్
బిహార్‌లో పోలీసు నియామక పరీక్షలో చీటింగ్‌కు పాల్పడిన పలువురు అభ్యర్థులు అరెస్టయ్యారు. మాస్కుల్లో బ్లూటూత్ సహా చొక్కాలో జవాబు పత్రాలతో వారు కాపీయింగ్‌కు యత్నించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. 'ఆ కేకు తింటే నేరం కాదు'
జాతీయ జెండాను ముద్రించి ఉన్న కేకును కోసి తింటే.. నేరంగా పరిగణించలేమని మద్రాస్ హైకోర్టు తెలిపింది. ఈ చర్యను జాతీయ పతాకాన్ని అవమానించినట్లుగా గుర్తించలేమని ఓ కేసులో తీర్పు చెప్పింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. 'ఓడించాలనేదే ప్రజల కోరిక'
అసోం ఒప్పందాన్ని కాపాడేందుకు సీఏఏ వ్యతిరేక పార్టీలు కలిసికట్టుగా రావాల్సిన అవసరం ఉందన్నారు కాంగ్రెస్ నేత గౌరవ్ గొగొయి. ప్రజల్లో తమ గ్రాఫ్ పెరుగుతోందని.. భాజపా గ్రాఫ్ పూర్తిగా పడిపోతోందని పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. 'ఏ స్థానానికైనా రెడీ'
టీ20ల్లో ఓపెనింగ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ. యువ బ్యాట్స్‌మెన్ సూర్య కుమార్ యాదవ్ ఇదే విధంగా ఆడితే తాను ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌కు దిగేందుకు సిద్ధమని పేర్కొన్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. విజేతలు వీరే
67వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా నాని 'జెర్సీ', ఉత్తమ వినోదాత్మక చిత్రంగా మహేశ్‌బాబు 'మహర్షి' అవార్డులు దక్కాయి. ఉత్తమ హిందీ చిత్రంగా సుశాంత్ సింగ్ 'చిచ్చోరె' నిలిచింది. ఉత్తమ నటుడిగా ధనుష్, ఉత్తమ నటిగా కంగనా రనౌత్‌కు జాతీయ అవార్డు వరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.