1. కొవాగ్జిన్ వినియోగానికి ఓకే
కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి సీడీఎస్‌సీవో అనుమతి ఇచ్చింది. అత్యవసర వినియోగానికి ప్రత్యేక నిపుణుల బృందం సిఫారసు చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. దాదాకు విజయవంతం
గుండెపోటుకు గురైన బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీకి చేసిన యాంజియోప్లాస్టీ విజయవంతమైంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉన్నట్లు స్పష్టం చేసిన వైద్యులు.. మరో 24గంటల పాటు వైద్య పర్యవేక్షణలో ఉంచుతామని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. డ్రైరన్ వ్యాక్సినేషన్ సక్సెస్
రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ కోసం చేపట్టిన డ్రైరన్ విజయవంతంగా ముగిసింది. ప్రభుత్వం ముందుగా నిర్ణయించిన 7 కేంద్రాల్లో రెండు గంటల పాటు డ్రైరన్ సాగింది. వివరాలను అధికారులు కొవిన్ సాఫ్ట్‌వేర్‌లో పొందుపరిచిన అధికారులు... పూర్తివివరాలను కేంద్ర ప్రభుత్వానికి పంపించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. 'కేసీఆర్ ఇచ్చింది శూన్యం'
గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడంలేదని.. ఫలితంగా సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు ఒత్తిడికి గురవుతున్నారని.. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కేంద్రం ఇచ్చిన నిధులతోనే గ్రామాల్లో పనులు జరుగుతున్నాయని అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. సంతోషంగా ఉంది : హరీశ్
నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చడం ఆనందంగా ఉందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేసీఆర్ నగర్లో అర్హులైన 192 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పట్టాలను ఆయన పంపిణీ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. 53 నెమళ్లు మృతి?
రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలో 53 నెమళ్లు అనుమానస్పద రీతిలో మృతి చెందాయి. మరో 26 గాయపడ్డాయి. ఈ ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేపడుతున్నామని అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. ముంబయి దాడుల సూత్రధారి అరెస్టు
లష్కరే తొయిబా కమాండర్ జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీ అరెస్టయ్యాడు. ఉగ్రవాదులకు నిధులు అందిస్తున్నారనే ఆరోపణలతో లఖ్వీని పాకిస్థాన్ కౌంటర్ టెర్రరిజం డిపార్ట్మెంట్ అదుపులోకి తీసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. గుజరాత్లో కొత్త రకం కరోనా
దేశంలో కరోనా కొత్తరకం స్ట్రెయిన్ విస్తరిస్తోంది. బ్రిటన్ నుంచి అహ్మదాబాద్‌కు వచ్చిన నలుగురికి పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. వారందరినీ ప్రత్యేక ఐసోలేషన్‌కు తరలించినట్టు అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. 'మోదీకి దేశమే సర్వస్వం'
ప్రజాదరణ అధికంగా ఉన్న దేశాధినేతల జాబితాలో ప్రధాని మోదీ మొదటి స్థానంలో ఉండటం దేశానికి గర్వకారణమని భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా కొనియాడారు. ప్రధానికి దేశమే సర్వస్వమని, మహమ్మారి సమయంలో ఆయన చూపిన నాయకత్వ పటిమకు ఇవి ప్రశంసలు వంటివని కేంద్ర మంత్రులు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. విజయ రాఘవన్ టీజర్
మిమ్మల్ని అలరించేందుకు కొత్త సినిమా కబుర్లు మీ ముందుకొచ్చేశాయి. ఇందులో మోహన్‌లాల్ 'మరక్కార్', విజయ్ ఆంటోని నటిస్తోన్న 'విజయ రాఘనవ్', యువ హీరో ఆది నటించిన 'శశి' చిత్రాల విశేషాలు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.