ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @ 7PM - telangana news today

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ETV BHARAT TOP TEN 7PM NEWS
టాప్​టెన్​ న్యూస్​@7PM
author img

By

Published : Dec 21, 2020, 6:59 PM IST

1. సర్కారు అప్రమత్తం

యూకేలో కొత్త రకం కరోనా వైరస్ ప్రభలుతున్న నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. గత వారం రోజుల్లో విదేశాల నుంచి వచ్చిన వాళ్ల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నారు. ఎయిర్​పోర్ట్​లో అధికారులు కరోనా సర్వేలెన్సు చేస్తున్నారు. ఇటీవల ప్రారంభించిన ల్యాబ్​లో ఆర్టీపీసీఆర్ టెస్టులు సైతం నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. సీసీఎస్ దాడులు

హైదరాబాద్‌ బేగంపేట పిన్ ప్రింట్ టెక్నాలజీ లోన్ యాప్ కాల్‌సెంటర్‌పై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు దాడులు నిర్వహించారు. గురుగావ్ కేంద్రంగా కాల్‌ సెంటర్‌ కొనసాగుతున్నట్లు గుర్తించారు. బేగంపేట, పంజాగుట్ట, మరో ప్రాంతంలోని పిన్‌ ప్రింట్‌ కాల్‌ సెంటర్లలో సోదాలు కొనసాగిస్తున్నారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. యాసంగిపై మంత్రి సమీక్ష

యాసంగి పంట కాలంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి... ఉన్నతాధికారులతో సమీక్షించారు. పంటల కొనుగోళ్లు సహా తాజా యాసంగి పంటల సాగు సరళి, ప్రత్యామ్నాయ పంటల సాగు విధానం, రసాయన ఎరువుల వినియోగం, భూసార పరీక్షలు వంటి అంశాలపై చర్చించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. 'కేంద్రానిది పాత పాటే'

సాగు చట్టాలపై ఆమోదయోగ్య పరిష్కారం చూపుతామని హామీ ఇస్తే కేంద్రంతో ఎప్పుడు చర్చలు జరపడానికైనా సిద్ధమని చెప్పాయి రైతు సంఘాలు. కేంద్రం ఆదివారం తమకు పంపిన లేఖలో కొత్త అంశాలేమి లేవని, సాగు చట్టాల సవరణల గురించే మళ్లీ ప్రస్తావించిందని పేర్కొన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. డ్రోన్ల కలకలం

పాక్​ కుట్రను మరోసారి తిప్పికొట్టింది భారత సైన్యం. సరిహద్దులో అక్రమంగా ఆయుధాలను తరలిస్తున్న పాక్​ డ్రోన్లను దళాలు గుర్తించాయి. అవి జారవిడిచిన 11 హ్యాండ్ గ్రనేడ్లను స్వాధీనం చేసుకున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. భారీగా చిరుతలు

దేశంలో చిరుత పులుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2014తో పోల్చితే 60 శాతానికి పైగా వృద్ధి రేటు నమోదైనట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. వినీలాకాశంలో అద్భుతం

ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది. గురు, శని గ్రహాల కలయిక జరిగింది. భూమి మీద నుంచి చూస్తే.. రెండు అతిపెద్ద గ్రహాలు ఒకే నక్షత్రంలో కనువిందు చేస్తున్నాయి. దాదాపు 4 శతాబ్దాల తర్వాత చోటుచేసుకుంది ఈ అద్భుత ఘట్టం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. 'బోరిస్​'​ హాజరవుతారా?

యూకే కొత్త రకం కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న క్రమంలో బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్​.. భారత పర్యటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2021 గణతంత్ర వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరవుతారా? లేదా అనే సందేహాల నేపథ్యంలో స్పష్టత నిచ్చాయి విదేశాంగ శాఖ వర్గాలు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. తొలిసారి బరిలో సింధు, సైనా

వచ్చే ఏడాది జనవరిలో జరగబోయే యోనెక్స్​ థాయ్​లాండ్​ ఓపెన్​, టయోటా థాయ్​లాండ్​ ఓపెన్​, బీడబ్ల్యూఎఫ్​ వరల్డ్​ టూర్ ఫైనల్స్​లో పాల్గొనే ఆటగాళ్ల పేర్లను ప్రకటించింది బాయ్​. వీరిలో పీవీ సింధు, సైనా నెహ్వాల్​, బి.సాయి ప్రణీత్​, కిదాంబి శ్రీకాంత్​, సాత్విక్ ​సాయిరాజ్, చిరాగ్​ శెట్టి, అశ్విని పొన్నప్ప, ఎన్​ సిక్కి రెడ్డి ఉన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. 'రెడ్' ట్రైలర్​ డేట్ ఫిక్స్

కొత్త సినిమా అప్​డేట్స్​ వచ్చేశాయి. ఇందులో 'రెడ్' ట్రైలర్, 'థ్యాంక్యూ' షూటింగ్, 'అంతిమ్' కొత్త వీడియో, తమన్నా తొలి వెబ్ సిరీస్ విడుదల తేదీకి సంబంధించిన సంగతులు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.