1. నాలుగు బిల్లులు ప్రవేశపెట్టిన ప్రభుత్వం
రాష్ట్ర శాసన మండలి ప్రారంభమైంది. సభలో నాలుగు చట్టసవరణ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మండలి బయట వరద నీరు చేరడం వల్ల జీహెచ్‌ఎంసీ సిబ్బంది నీటిని తొలగిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. అప్రమత్తం చేశాం: కేటీఆర్
హైదరాబాద్‌లో వర్షాలపై శాసనమండలిలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. అన్ని విభాగాలు, ఎన్డీఆర్ఎఫ్ దళాలను అప్రమత్తం చేశామని చెప్పారు. ఆకాశం చిల్లులు పడుతుందా అన్నట్లుగా హైదరాబాద్‌లో వర్షాలు పడుతున్నాయని అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. దుబ్బాక ఉప ఎన్నికలో తెరాస అభ్యర్థి నామినేషన్
దుబ్బాక ఉప ఎన్నికలో తెరాస అభ్యర్థిగా సోలిపేట సుజాత నామినేషన్ దాఖలు చేశారు. ఆమె వెంట మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ వెళ్లి పత్రాలను సమర్పించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. లైవ్ వీడియో: చూస్తుండగానే కొట్టుకుపోయిన వ్యక్తి
జంటనగరాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. హైదరాబాద్ పాతబస్తీ ఫలక్‌నుమా సమీపంలోని బార్కాస్‌లో ఓ వ్యక్తి అందరూ చూస్తుండగానే వరద నీటిలో గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న జీహెచ్‌ఎంసీ రెస్య్కూ టీమ్, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. భాజపా గూటికి కుష్బూ- లాభం ఎవరికి?
రాజకీయ నాయకురాలిగా మారిన నటి కుష్బూ.. కాంగ్రెస్‌ను వీడి భాజపాలో చేరారు. ఆరేళ్లు అధికార ప్రతినిధిగా పనిచేసిన తర్వాత హస్తం పార్టీకి గుడ్ బై చెప్పేశారు. తమిళనాట అభినయంతో ఎంతో ఆదరణ దక్కించుకున్న కుష్బూ కాంగ్రెస్‌ను వీడటానికి బలమైన కారణాలే ఉన్నాయనే వాదనలు ఓవైపు.. ఇన్నాళ్లూ విమర్శలు గుప్పించిన భాజపాలో చేరటం వెనుక మర్మమేంటనే ప్రశ్నలు మరోవైపు. ఇంతకీ కుష్బూ ఇమేజ్ తమిళనాడులో భాజపాకు కలిసొస్తుందా? లేదంటే భాజపాలో చేరటం కుష్బూనే అందలం ఎక్కిస్తుందా ? మొత్తంగా కాషాయ కండువా కప్పుకున్న కుష్బూ భవిష్యత్ ప్రణాళికలెలా ఉండనున్నాయి ? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. ఆ విద్యార్థులకు మరోసారి పరీక్ష రాసే అవకాశం
కొవిడ్-19 దృష్ట్యా జేఈఈ( అడ్వాన్స్డ్ )2020 పరీక్షకు హాజరు కాని విద్యార్థులకు సువర్ణావకాశం లభించింది. కరోనా నిర్ధరణ అయి పరీక్ష రాయలేని విద్యార్థులకు 2021 లో పరీక్ష రాసేలా మరోసారి అవకాశం ఇవ్వనుంది జాయింట్ అడ్మిషన్ బోర్డు. దీనికి సంబంధించి వయోపరిమితిని సైతం సవరించే ఏర్పాట్లు చేస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. 'విద్వేష రాజకీయాలకు నిదర్శనం'
దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి మోదీ సర్కార్‌పై మరోమారు విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. విద్వేషపూరిత రాజకీయాల వల్లే తలసరి జీడీపీ బంగ్లాదేశ్‌తో సమాన స్థితికి చేరిందని దుయ్యబట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. 'బైడెన్ గెలిస్తే వారు రెచ్చిపోతారు'
కరోనా నుంచి కోలుకున్న డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో జోరు పెంచారు. ప్రత్యర్థి బైడెన్‌పై ప్రచార సభలో మరోసారి విరుచుకుపడ్డారు. అమెరికా చరిత్రలోనే బైడెన్ లాంటి 'చెత్త అభ్యర్థి'ని చూడలేదని దుయ్యబట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. ధోనీ ఫ్యాన్ ఇల్లు!
ధోనీపై అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు తమినాడుకు చెందిన ఓ అభిమాని. ఇంటికి పసుపు రంగు వేయించి, చెన్నై సూపర్‌కింగ్స్ లోగో, ధోనీ ఫొటోలతో ముస్తాబు చేశాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. అఖిల్ సినిమాలో రష్మిక ?
వరుస విజయాలతో జోరుమీదున్న రష్మిక త్వరలోనే యువకథానాయకుడు అక్కినేని అఖిల్‌తో జత కట్టనున్నట్లు సమాచారం. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి రష్మికను ఎంపిక చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.