ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్ @11AM

author img

By

Published : Oct 14, 2020, 10:58 AM IST

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ETV BHARAT TOP TEN 11AM NEWS
టాప్​టెన్​ న్యూస్ @11AM

1. దేశంలో కొత్తగా 63,509 మందికి కరోనా

దేశవ్యాప్తంగా కొత్తగా 63,509 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 730 మంది వైరస్​ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసులు 72,39,390కి చేరాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. వర్షాలపై కేటీఆర్‌ టెలీ కాన్ఫరెన్స్

హైదరాబాద్‌లో భారీ వర్షాలపై మంత్రి కేటీఆర్‌ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయానికి ఇప్పటికే పలువురు అధికారులు చేరుకున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ కలెక్టర్లతో కలిసి టెలీ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. జీహెచ్‌ఎంసీలో అత్యవసర సేవల నంబర్లు

జంటనగరాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. పలు ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి వారికి హెల్ప్​లైన్ నంబర్లు. జీహెచ్​‌ఎంసీ పరిధిలో 3 రోజులు ప్రజలు బయటకు రావొద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. నిలిచిన విద్యుత్, టెలిఫోన్, ఇంటర్నెట్ సేవలు

భారీ వర్షంతో హైదరాబాద్‌లో విద్యుత్, టెలిఫోన్, ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. పలు చోట్ల చెట్లు విరిగి పడడం వల్ల విద్యుత్​ తీగలు తెగిపోయాయి. నెట్​వర్క్ సరిగా లేక పలు విద్యాసంస్థలు ఇవాళ ఆన్​లైన్ పాఠాలకు సెలవు ప్రకటించాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. మట్టి మిద్దె కూలి ముగ్గురు మృతి

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందిన విషాదకర ఘటన నాగర్ కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. 10 కి.మీ మేర నిలిచిన వాహనాలు

వరుణుడి బీభత్సం ఉగ్రరూపం దాల్చింది. అక్కడా ఇక్కడా అని కాదు.. తెలంగాణలోని అన్నిచోట్ల విరామం లేకుండా వాన దంచికొట్టింది. దీనివల్ల హైదరాబాద్- విజయవాడ జాతీయరహదారిపై దాదాపు 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. విపత్తులను ఎదుర్కోవడంలో నేర్వాల్సిన పాఠాలెన్నో..

తరచూ విరుచుకుపడుతున్న తుపానులతో ఏర్పడే విపత్తులు భారీ ఆస్తి నష్టం కలిగిస్తున్నాయి. తీర ప్రాంత రక్షణకు పటిష్ఠ చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని అవి గుర్తుచేస్తున్నాయి. ఆ విషయంలో ప్రభుత్వ వ్యవస్థల ప్రణాళికలు దీర్ఘకాలంగా కార్యాచరణకు నోచుకోకపోవడం ఆందోళన కలిగిస్తున్న అంశం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. హెలికాప్టర్లు ఢీ- 15మంది మృతి

అఫ్గానిస్థాన్​లో వైమానిక దళానికి చెందిన రెండు హెలికాప్టర్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 15మంది మృతిచెందినట్లు స్థానిక వార్తాసంస్థ టోలో తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. దిల్లీ vs రాజస్థాన్​: ప్రతీకారం తీర్చుకుంటుందా?

ఐపీఎల్​లో దుబాయ్ వేదికగా మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. రాజస్థాన్​ రాయల్స్​, దిల్లీ క్యాపిటల్స్​ జట్లు టోర్నీలో మరోసారి తలపడనున్నాయి. రాజస్థాన్​పై పైచేయి సాధించాలని దిల్లీ ఆశిస్తుండగా.. ఈ మ్యాచ్​లో గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని స్మిత్​సేన ప్రణాళికలను రచిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. ఆర్​ఆర్​ఆర్​ తర్వాత చరణ్‌ సినిమా ?

లాక్​డౌన్​ సమయంలో కొందరు టాలీవుడ్​ కథానాయకులు తదుపరి సినిమాలను వరుసగా ప్రకటించగా.. స్టార్​ హీరో రామ్​చరణ్​ మాత్రం విభిన్నంగా అలోచిస్తున్నారు. ఆర్​ఆర్​ఆర్​ తర్వాత సినిమాను పాన్​ ఇండియా స్థాయిలో ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.