ETV Bharat / city

ఈటీవీ భారత్​ ముఖ్యాంశాలు - ETV BHARAT MAIN NEWS

ETV BHARAT TOP NEWS
ETV BHARAT TOP NEWS
author img

By

Published : Dec 12, 2021, 6:04 AM IST

Updated : Dec 12, 2021, 10:05 PM IST

21:55 December 12

టాప్​ న్యూస్​ @10PM

  • రేపు తమిళనాడుకు సీఎం కేసీఆర్​

రేపు సీఎం కేసీఆర్‌ తమిళనాడు వెళ్లనున్నారు. శ్రీరంగంలో రంగనాథస్వామి ఆలయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకోనున్నారు.

  • 'రైతులను సీఎం కేసీఆర్​ మోసం చేస్తున్నారు..'

MP Arvind Comments: జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో ఏర్పాటు చేసిన భాజపా శిక్షణ ముగింపు శిబిరంలో నిజామాబాద్​ ఎంపీ అర్వింద్​ పాల్గొన్నారు. కార్యకర్తలనుద్దేశించి మాట్లాడిన అర్వింద్​ పలు సూచనలు చేశారు. రానున్న ఎన్నికల్లో భాజపా విజయం కోసం ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని కోరారు.

  • రైతులపై కేసులు.. ఉపసంహరణ నిర్ణయం ఆ రాష్ట్రాలదే!

Police Case on Farmers: సాగు చట్టాల రద్దుకోసం ఏడాదికాలంగా ఉద్యమంచిన రైతులపై నమోదైన కేసులను కొట్టివేత అనేది రాష్ట్ర పరిధిలోని అంశమని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌ వ్యాఖ్యానించారు. చట్టాల రద్దు ఎవరి విజయమో? ఓటమో కాదని వ్యాఖ్యానించారు.

అన్నదాత ఆత్మహత్య

Chili crop farmer suicide: మహబూబాబాద్ జిల్లాలోని దూద్యా తండాలో మిరప రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పంటకు ఆశించిన దిగుబడి రాదని మనస్తాపం చెంది ఉరి వేసుకుని అఘాయిత్యానికి ఒడిగట్టాడు.

  • 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్​.. తారక్-చరణ్ చూసినప్పుడు రియాక్షన్ ఇదే!

RRR trailer: 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్​ రిపీట్​గా చూస్తున్న అభిమానులు తెగ ఎగ్జైట్​ అవుతున్నారు. అలాంటిది ఆ సినిమా హీరోలు రామ్​చరణ్, ఎన్టీఆర్ ఎలా రియాక్ట్ అయ్యారంటే?

21:02 December 12

టాప్​ న్యూస్​ @9PM

  • కేకే, ఈటల ఆత్మీయ ఆలింగనం

Komatireddy son Wedding: హైదరాబాద్​లో మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి తన కుమారుడి వివాహా వేడుకను నిర్వహించారు. నూతన దంపతులను ఆశీర్వదించడానికి పలు పార్టీల రాజకీయ ప్రముఖులు విచ్చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తెరాస ఎంపీ కేకే, భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తదితర నాయకులు హాజరయ్యారు.

  • 'రావత్​ హెలికాప్టర్ క్రాష్'.. వీడియో తీసిన వ్యక్తి ఫోన్ స్వాధీనం!

Army helicopter crash: చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌(సీడీఎస్) జనరల్‌ బిపిన్‌ రావత్‌ సహా.. 13 మంది మృతి చెందిన ఘటనలో ప్రమాదానికి గురైన హెలికాప్టర్‌ను వీడియో తీసిన వ్యక్తి మొబైల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. విచారణలో భాగంగా కోయంబత్తూరులోని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు.

  • 'కాశీ విశ్వనాథ్‌ కారిడార్‌' ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం

Kashi Vishwanath Corridor: ఉత్తర్​ప్రదేశ్​ వారణాసిలో నిర్మించిన 'కాశీ విశ్వనాథ్‌ కారిడార్‌'ను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించనున్నారు. 'దివ్యకాశీ-భవ్య కాశీ' పేరుతో జరగనున్న ఈ కార్యక్రమం కోసం కాశీ పట్టణం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.

  • కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా మాట్లాడిన రోహిత్

Rohit Sharma Captain: టీమ్​ఇండియా జట్టుపై బయట జరిగే చర్చలు పెద్దగా పట్టించుకోనని అన్నాడు భారత జట్టు సారథి రోహిత్ శర్మ. జట్టు సభ్యులంతా క్రికెట్​పైనే దృష్టి పెట్టాలని సూచించాడు. దీనికి సంబంధించిన వీడియో ట్విట్టర్​లో షేర్​ చేసింది బీసీసీఐ.

  • ఛాతీపై పచ్చబొట్టుతో రజనీకాంత్​కు బర్త్​డే విషెస్..

టీమ్​ఇండియా సీనియర్ క్రికెటర్ రజనీకాంత్​ ఫొటోను పచ్చబొట్టుగా వేసుకున్నాడు. అందుకు సంబంధించిన ఫొటోను తన ఇన్​స్టాలో పోస్ట్ చేశాడు. ఇంతకీ అతడు ఎవరంటే?

19:51 December 12

టాప్​ న్యూస్​ @8PM

  • రాజస్థాన్​లో భూకంపం

Rajasthan Earthquake: రాజస్థాన్​లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్​పై దీని తీవ్రత 4.3గా నమోదైంది. ఈ మేరకు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం తెలిపింది.

  • బూస్టర్ డోసు ఇవ్వాలా, వద్దా?

Booster Dose in India: కరోనా కొత్త వేరియంట్​లు పుట్టుకొస్తున్న వేళ.. బూస్టర్ డోసు పంపిణీపై తీవ్రంగా చర్చ నడుస్తోంది. వెంటనే మూడో డోసు పంపిణీ చేయాలని కొందరు.. తీసుకోకపోయినా ఫర్వాలేదని మరికొందరు అంటున్నారు. 'బూస్టర్' వల్ల యాంటీబాడీలు పెరుగుతాయని, ప్రస్తుత ఒమిక్రాన్ వేరియంట్​ నుంచి రక్షణ కల్పిస్తాయని అంటున్నారు ఇంకొందరు. ఈ నేపథ్యంలో మూడో డోసు పంపిణీపై శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..

  • రసాయన పరిశ్రమలో ప్రమాదం

యాదగిరిగుట్ట శివారులోని రసాయన పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రియాక్టర్లలో ఒత్తిడి అధికమై రసాయనాలు బయటికి ఎగజిమ్మాయి. వెంటనే సైరన్ మోగడంతో కార్మికులు బయటికి పరుగులు తీశారు.

  • చైనా సరిహద్దుల్లో 59 గ్రామాలు ఖాళీ.. ఏం జరుగుతోంది?

Migration in Uttarakhand: చైనా సరిహద్దుల్లో ఉత్తరాఖండ్​ రాష్ట్రంలోని పిథోరాగఢ్​ జిల్లాలో ప్రజలు వలస వెల్లిపోతున్నారు. గడిచిన మూడేళ్లలో 59 గ్రామాలు ఖాళీ అయ్యాయి. సరిహద్దుకు అవతలివైపు చైనా కొత్తగా గ్రామాలు నిర్మిస్తుంటే.. భారత్​లో ప్రజలు వలస పోవటం ఆందోళన కలిగిస్తోంది. ఇంతకీ ప్రజలు స్వగ్రామాలను విడిచిపెట్టేందుకు కారణాలేంటి?

  • ధావన్​కు కష్టమే.. రుతురాజ్, వెంకటేష్ అయ్యర్​​కు ఛాన్స్!

Dhawan vs Ruturaj: టీమ్​ఇండియా జట్టు దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా వన్డే జట్టులో శిఖర్​ ధావన్​కు అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. విజయ్ హజారే ట్రోఫీలో శిఖర్​ ధావన్ ఫామ్​ను చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. మరోవైపు ఈ టోర్నీలో విధ్వంసం సృష్టిస్తూ.. శిఖర్​కు గట్టిపోటీఇస్తున్నారు యువ ఆటగాళ్లు రుతురాజ్ గైక్వాడ్, వెంకటేష్​ అయ్యర్. వీరిద్దరికీ తప్పకుండా అవకాశం లభిస్తుందని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.

18:49 December 12

టాప్​ న్యూస్​ @7PM

'టీకా అద్భుతంగా పనిచేస్తోంది'

తెలంగాణ వచ్చిన తర్వాత కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని తెలంగాణ డెవలప్​మెంట్​ ఫోరమ్​ ప్రకటించిందని కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి వెల్లడించారు. తెలంగాణలో ఉపాధి అవకాశాలు కల్పించాలని తెలంగాణ డెవలప్​మెంట్​ ఫోరమ్​ను ఆయన కోరారు. భారత్​లో తయారైన టీకా అద్భుతంగా పనిచేస్తోందన్నారు. రవీంద్రభారతిలో తెలంగాణ డెవలప్​మెంట్​ ఫోరమ్​ ఆధ్వర్యంలో ప్రవాసీ తెలంగాణ దివస్​ కార్యక్రమం జరిగింది.

  • నమస్తే పెట్టలేదని స్థానికున్ని కొట్టిన ఎమ్మెల్యే

charminar MLA Attack: తనను ఎమ్మెల్యే కొట్టారని ఓ స్థానికుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎందుకు కొట్టారని పోలీసులు అడిగితే.. ఆ వ్యక్తి చెప్పిన కారణం విని పోలీసులు షాక్​ అయ్యారు. మరి ఆ బాధితుడు చెప్పింది నిజమేనా అని సీసీటీవీ దృశ్యాలు చూస్తే.. కొట్టిందైతే కనిపిస్తోంది.. కానీ.. ఆ కొట్టడానికి అదే కారణమా అని పోలీసులు పునరాలోచనలో పడ్డారు.

  • కాంక్రీట్ మిక్సర్​తో పిండి కలిపి వంటలు

Food Made In Concrete Mixer: మధ్యప్రదేశ్​లోని మౌనీ బాబా ఆశ్రమంలో అతిపెద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఒక్కరోజే దాదాపు 2లక్షలమందికి పైగా భక్తులకు భోజనం అందించారు నిర్వాహకులు. వంటలు చేయడానికి కాంక్రీట్ మిక్సర్ యంత్రాన్ని వాడటం విశేషం.

  • సర్కారీ​ బడిలో కలెక్టర్​ కుమార్తె

Collector's daughter in govt school: సాధారణంగా ఏ కలెక్టర్ దగ్గరైనా డబ్బుల కొరత ఉండకపోవచ్చు. అలాగే ఏ ప్రైవేట్ స్కూల్ కూడా కలెక్టర్ బిడ్డకు అడ్మిషన్ నిరాకరించకపోవచ్చు. అయినా.. పెద్ద పెద్ద ప్రైవేట్ స్కూళ్లను వదిలేసి ఛత్తీస్​గఢ్​లో సర్​గుజా జిల్లా కలెక్టర్ సంజీవ్ కుమార్​ ఝా తన కుమార్తెను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. ఎందుకో తెలుసుకుందామా..?

  • 'రాధేశ్యామ్' సినిమా 'గీతాంజలి' మ్యాజిక్​ను రిపీట్​ చేస్తుందా?

Prabhas Radhe shyam: డార్లింగ్ ప్రభాస్ 'రాధేశ్యామ్' సినిమాపై రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. అప్పట్లో పూర్తిస్థాయి ప్రేమకథతో రూపొందిన 'గీతాంజలి' సెన్సేషన్​ సృష్టించింది. మరి 'రాధేశ్యామ్' ఆ మ్యాజిక్​ను రిపీట్​ చేస్తుందా?

17:44 December 12

టాప్​ న్యూస్​ @6PM

  • విటమిన్-డి నిర్ధరణకు కొత్త విధానం

Vitamin D New Test: తక్కువ సమయంతో పాటు అతి తక్కువ ఖర్చులోనే విటమిన్-డి స్థాయిలను గుర్తించే సరికొత్త విధానాన్ని ఉస్మానియా విశ్వవిద్యాలయ ఆచార్యులు ఆవిష్కరించారు. విటమిన్-డి నిర్ధరణకు ప్రస్తుతం ఉన్న ఎన్నో పద్ధతుల కంటే ఈ సరికొత్త విధానం ఎంతో మేలని అని చెబుతున్నారు.

  • రైతులకు ఏడాది ఫ్రీగా భోజనం పెట్టిన లంగర్​.. ఇకపై రెస్టారెంట్​!

Golden Hut Restaurant: దిల్లీ సింఘు సరిహద్దుల్లో రైతుల నిష్క్రమణతో.. అక్కడి ప్రముఖ గోల్డెన్​ హట్​ రెస్టారెంట్​ తిరిగి తెరుచుకొనేందుకు సిద్ధమైంది. రైతు ఆందోళనల కారణంగా ఈ రెస్టారెంట్​ మూతబడినప్పటికీ వారికి సొంత ఖర్చుతో అక్కడ ఏడాదిపాటు భోజనం ఏర్పాటు చేశారు యజమాని రాణా రాంపాల్​. మరోవైపు.. గాజీపుర్​ సరిహద్దుల్లో రైతులు లక్షలు వెచ్చించి నిర్మించుకున్న హౌస్​ ఆన్​ వీల్స్​ను తమ జ్ఞాపకంగా మలుచుకోనున్నారు.

  • భార్యను టీజ్​ చేశారని ఇద్దరు ఫ్రెండ్స్​ను చంపిన భర్త

Wife Tease Murder In Mysore: తన భార్య పట్ల అసభ్యంగా ప్రవర్తించారన్న కోపంతో ఇద్దరు స్నేహితులను చంపాడు ఓ వ్యక్తి. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది.

  • 'కెప్టెన్ కాకపోయినా కోహ్లీ ప్రమాదకరమే'

Gambhir on Kohli: టీమ్​ఇండియా వన్డే జట్టు సారథిగా విరాట్​ కోహ్లీని ఇటీవలే తప్పించింది బీసీసీఐ. ఈ నేపథ్యంలో విరాట్​ కోహ్లీపై పలు వ్యాఖ్యలు చేశాడు మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్. కోహ్లీపై ఇప్పుడు ఎలాంటి ఒత్తిడి ఉండబోదని, అతడిలో మరోసారి గొప్ప ఆటగాడిని చూస్తామని అన్నాడు. ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్‌ బ్రాడ్‌హాగ్‌ కూడా బీసీసీఐ నిర్ణయంపై తన అభిప్రాయాలను పంచుకున్నాడు.

  • రాజేంద్రప్రసాద్ ఓటీటీ ఎంట్రీ

Cinema news: సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో రాజేంద్రప్రసాద్ తొలి ఓటీటీ సినిమా, హనుమాన్, శ్యామ్​సింగరాయ్, గాలివాన, విక్రమ్ రాథోడ్ చిత్రాల కొత్త సంగతులు ఉన్నాయి.

16:46 December 12

టాప్​ న్యూస్​ @5PM

  • హిమవీరుడికి కుమార్తె అంత్యక్రియలు

Lt Colonel Harjinder Singh: తమిళనాడులో హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతిచెందిన లెఫ్టినెంట్ కల్నల్ హర్జీందర్ సింగ్‌ అంత్యక్రియలు దిల్లీలో సైనిక లాంఛనాల మధ్య జరిగాయి. సింగ్ చితికి ఆయన కుమార్తె నిప్పంటించారు. అంతకుముందు హర్జీందర్ భౌతికకాయానికి రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్ నివాళులు అర్పించారు.

  • Live Video: పోలీసులకు చిక్కకూడదని దుస్సాహసం

ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో తన ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడో వ్యక్తి. బెంగళూరులో డిసెంబర్ 9న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కత్రిగుప్పెకు చెందిన కౌశిక్, చేతన్ అనే స్నేహితులు హెల్మెట్ ధరించకుండా బైక్‌పై వెళ్తున్నారు. మార్గంమధ్యలో ట్రాఫిక్ పోలీసులు కనిపించారు. వారి నుంచి తప్పించుకునేందుకు వేగం పెంచారు. ఈ క్రమంలో డివైడర్‌ను బలంగా ఢీకొట్టారు.

  • కాంగ్రెస్​కు నిరసనల 'భయం'

Congress rally in Jaipur: ధరల పెరుగుదలకు నిరసనగా రాజస్థాన్​, జైపుర్​లో​ భారీ ర్యాలీ నిర్వహించింది కాంగ్రెస్​ పార్టీ. అయితే, నల్ల రంగు వస్త్రాలను మైదానంలోకి అనుమతించకపోవటం ప్రస్తుతం చర్చనీయాశంగా మారింది. కాంగ్రెస్​కు నిరసనల భయం పట్టుకుందని ప్రత్యర్థి పార్టీల నేతలు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు.. సభకు హాజరైన కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రసంగించకపోవటమూ చర్చకు దారితీసింది.

  • రజనీ స్టైల్లో వెంకటేశ్​ అయ్యర్​

Venkatesh Iyer Rajini: తలైవా​ రజనీకాంత్​కు స్పెషల్​గా బర్త్​డే విషెస్​ చెప్పాడు టీమ్​ఇండియా యువ క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్. విజయ్​ హజారే ట్రోఫీలో చంఢీగఢ్​ జట్టుపై సెంచరీ చేసిన తర్వాత రజనీ స్టైల్​లో సెల్యూట్​ చేశాడు.

  • టాప్​ ప్లేస్​లో​ విజయ్

Vijay master: తమిళ హీరో విజయ్.. ఈ ఏడాది ట్విట్టర్​ ట్రెండింగ్​లో తొలిస్థానం దక్కించుకున్నారు. ఆయన సినిమా 'మాస్టర్' కూడా టాప్​లో నిలవడం విశేషం.

15:51 December 12

టాప్​ న్యూస్​ @4PM

  • సైనికా.. సెలవికా..

Jawan saiteja: హెలికాప్టర్​ ప్రమాదంలో మృతిచెందిన జవాన్​ సాయి తేజ అంత్యక్రియలు ముగిశాయి. ఆయన సొంత ఊరు ఎగువరేగడ గ్రామంలో అంతిమ వీడ్కోలు పలికారు. గాల్లోకి కాల్పులు జరిపి... సైన్యం గౌరవ వందనం సమర్పించింది.

  • 'ప్రగతిభవన్​పై బీఎస్పీ జెండా ఎగరడం ఖాయం'

RS Praveen Kumar Speech: బహుజన, దళిత గిరిజన శక్తులు ఏకమై ప్రగతి భవన్​పై బీఎస్పీ జెండాను ఎగురవేస్తామని బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్​ ఆర్​ఎస్​ ప్రవీణ్​ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. బతుకులు మారాలంటే బహుజన రాజ్యం రావాలని అన్నారు.

  • 'అధికారం కోసమే హిందుత్వవాదుల ఆరాటం'

Congress rally in Jaipur: రాజస్థాన్​లోని జైపుర్​లో నిర్వహించిన ర్యాలీలో భాజపాపై పరోక్ష విమర్శలు గుప్పించారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ. నేటి భారత రాజకీయాల్లో హిందూ, హిందుత్వవాది మధ్య పోటీ నడుస్తోందని, తాను హిందువుని పేర్కొన్నారు. హిందుత్వవాదులకు అధికారమే ముఖ్యమని, 2014 నుంచి వారు అధికారంలో ఉన్నారని ఆరోపించారు. గడిచిన ఏడేళ్లలో మోదీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని డిమాండ్​ చేశారు ప్రియాంక గాంధీ.

  • 'పేదల లబ్ధి కోసమే బ్యాంకింగ్​ వ్యవస్థలో సంస్కరణలు'

PM Modi on Deposit Insurance: ప్రభుత్వం చేపట్టిన డిపాజిట్ ఇన్సూరెన్స్ సంస్కరణలు బ్యాంకింగ్ వ్యవస్థపై ఖాతాదారులకు విశ్వాసాన్ని కలిగిస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పేదలకు లబ్ధి చేకూర్చేలా గత ఏడేళ్లలో ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు.

  • 'సుమకు ఆ సత్తా ఉంది'

Suma kanakala movies: సుమ కొత్త సినిమా టీజర్​ రిలీజ్ చేసిన రానా.. చిత్రం విజయం సాధించాలని కోరుకున్నారు. అన్ని భాషల్లో నటించగల సత్తా సుమకు ఉందని అన్నారు.

14:31 December 12

టాప్​ న్యూస్​ @3PM

  • మరిన్ని రాష్ట్రాలకు ఒమిక్రాన్ వ్యాప్తి

Omicron in India: దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 36కు పెరిగింది. ఛండీగఢ్​లో తొలి కరోనా కేసు వెలుగులోకి రాగా.. కర్ణాటకలో మూడో కేసు బయటపడింది. ఆంధ్రప్రదేశ్​లోనూ తొలి ఒమిక్రాన్ కేసు నిర్ధరణ అయింది.

  • పాకాల సరస్సుకు పెనుశాపంగా..

Pollution At Pakhal Lake :ఆసియాలోనే అత్యంత స్వచ్ఛమైన సరస్సులో ఒకటైన పాకాల.. క్రమంలో దాని రూపును కోల్పోతోంది. పర్యటకులు, స్థానికుల నిర్లక్ష్యం కారణంగా క్రమంగా కాలుష్య కోరల్లో చిక్కుకుంటోంది. స్వచ్ఛతకు చిరునామాగా పేరొందిన పాకాల.. కాలుష్యానికి కేరాఫ్​గా మారిపోతోంది.

  • కొనసాగుతున్న అమరావతి రైతుల మహాపాదయాత్ర

amravati farmers: ఏపీలోని అమరావతి మహాపాదయాత్ర 42వ రోజును రైతులు ప్రారంభించారు. చిత్తూరు జిల్లాలోని అంజిమేడు నుంచి రేణిగుంట వరకు మహాపాదయాత్ర దాదాపు 11కి.మీ సాగనుంది.

  • టోర్నడో విధ్వంసం- కళ్లకు కట్టిన డ్రోన్​ వీడియోలు

Tornado in America: అమెరికాలో టోర్నడోలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ప్రజలు వణికిపోతున్నారు. దాదాపు 100 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గల్లంతయ్యారు. కెంటకీ రాష్ట్రం అత్యంత ప్రభావితమైంది. సుడిగాలులకు తోడు భారీ వర్షాలతో ఇళ్లు ధ్వంసమయ్యాయి. చెట్లు నేలకూలాయి. డ్రోన్​ దృశ్యాలు పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయి.

  • బాక్సాఫీస్​పై బాలయ్య సింహగర్జన

Akhanda Collections: బాలకృష్ణ నటించిన 'అఖండ' సినిమా బాక్సాఫీస్​ వద్ద భారీగా కలెక్షన్లు వసూలు చేస్తూ దూసుకెళ్తోంది. పది రోజుల్లోనే రూ.102కోట్ల గ్రాస్​ను వసూలు చేసినట్లు తెలిసింది. బాలయ్య కెరీర్​లోనే ఇంత భారీ మొత్తంలో కలెక్షన్లు రావడం ఇదే తొలిసారి.

13:56 December 12

టాప్​ న్యూస్​ @2PM

  • స్వగ్రామానికి జవాన్ల పార్థివదేహాలు

Tamil Nadu chopper crash: హెలికాప్టర్​ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లు నాయక్​ గుర్ సేవక్ సింగ్​, నాయక్ జితేంద్ర సింగ్ మృతదేహాలను స్వగ్రామాలకు తరలించారు. ఆదివారం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి.

  • పెంపుడు కుక్కల కోసం స్పెషల్ హాస్టల్​

Dog Hostel : మనుషులకు హాస్టల్స్​ ఉన్నట్టే అక్కడ పెంపుడు కుక్కల కోసం కూడా ఓ ప్రత్యేక వసతి గృహం ఉంది. యజమానులు లేని సమయంలో వారి పెంపుడు కుక్కల బాగోగులు చూడటమే ఈ డాగ్​ హాస్టల్​ పని. మరి అది ఎక్కడ ఉంది? దాని విశేషాలేంటో తెలుసుకుందామా?

  • కొవిడ్‌ తర్వాత రూటు మార్చిన సంప్రదాయ హోటళ్లు..

Quick service restaurants: కొవిడ్‌తో బాగా ప్రభావితమైన వాటిలో రెస్టారెంట్లు ఒకటి. కొన్ని మూతబడగా, మరికొన్ని కష్టంగా నెట్టుకొచ్చాయి. ఎక్కువ శాతం టేక్‌ అవే(ఇంటికి తీసుకెళ్లే) సేవలకే పరిమితం అయ్యాయి. కొవిడ్‌ తర్వాత మారిన పరిస్థితులు, ఆహార ప్రియుల ఆలోచనల్లో వచ్చిన మార్పులకు అనుగుణంగా రెస్టారెంట్ల యాజమానులు ‘క్విక్‌ సర్వీస్‌ రెస్టారెంట్ల’కు శ్రీకారం చుట్టారు.

  • టీమ్ఇండియా దక్షిణాఫ్రికా ప్రయాణం అప్పుడే!

IND vs SA Series: న్యూజిలాండ్​తో టెస్టు సిరీస్ ముగిశాక టీమ్ఇండియా ఆటగాళ్లకు కాస్త విరామం దొరికింది. దీంతో వారి ఫ్యామిలీతో సరదాగా గడుపుతున్నారు. అయితే త్వరలోనే దక్షిణాఫ్రికాతో సిరీస్​ జరగనుంది. ఇందుకోసం టీమ్ఇండియా ఈనెల 16న సౌతాఫ్రికాకు బయలుదేరనుందని తెలుస్తోంది.

MAA Elections 2021 Resignation: ప్రకాశ్​ రాజ్ ప్యానెల్​ సభ్యుల రాజీనామాను 'మా' అధ్యక్షుడు విష్ణు ఆమోదించారు. వారి స్థానాలను తన ప్యానెల్​ నుంచి ఓడిపోయిన వారితో భర్తీ చేస్తానని చెప్పారు. ఈ నియామక ప్రక్రియ చేయడానికి 'మా' బై లా రూల్​ ఏం చెబుతోందంటే?

12:50 December 12

టాప్​ న్యూస్​ @1PM

  • బిపిన్ రావత్​ చివరి సందేశం

Bipin Rawat last speech: 1971లో పాకిస్థాన్‌పై జరిగిన యుద్ధంలో భారత విజయానికి గుర్తుగా 'స్వర్ణిమ్​ విజయ్‌ పర్వ్​' వేడుకలను దిల్లీలోని ఇండియా గేట్​ వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేశ తొలి సీడీఎస్​ చివరి వీడియో రికార్డును ప్రసారం చేశారు. డిసెంబర్ 7న రికార్డు చేసిన ఈ వీడియోను భారత సైన్యం విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​.. వీరసైనికులకు సేవలను స్మరించుకున్నారు.

  • నెట్ ఎక్కువగా వాడితే డెట్ అయిపోతారు

telugu university celebrations: ఇంటర్నెట్​ను ఎంతవరకు వాడాలో అంతే వాడాలని.. నెట్​ ఎక్కువ వాడితే డెట్​​ అయిపోతారని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. హైదరాబాద్​లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 36 వ్యవస్థాపక దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వెంకయ్య నాయుడు పాల్గొన్నారు.

  • తెరాస ఎమ్మెల్యేలు మాతో టచ్​లో ఉన్నారు

MP Arvind on trs mlas: తెరాస ఎమ్మెల్యేలు తమతో టచ్​లో ఉన్నారని భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్​ తెలిపారు. తెలంగాణపై భాజపా ఫోకస్​ పెట్టిందని.. రానున్న రోజుల్లో మరిన్ని సంచలనాలు ఉంటాయని స్పష్టం చేశారు.

  • మంచు విష్ణు కీలక నిర్ణయం

MAA Elections Prakashraj resignation: 'మా' అధ్యక్షుడు విష్ణు కీలక నిర్ణయం తీసుకున్నారు. 11మంది ప్రకాశ్​ రాజ్​ ప్యానెల్​ సభ్యుల రాజీనామాను ఆమోదించారు. తన ప్యానెల్​ నుంచి ఓడిపోయిన సభ్యులను తిరిగి తన కార్యవర్గంలోకి తీసుకోనున్నట్లు తెలిపారు.

  • చైతూతో విడాకులు.. సామ్ ఏం చెప్పిందంటే?

Chaysam Divorce: నాగచైతన్యతో విడాకుల అంశంపై మరోసారి మాట్లాడటం తనకు ఇష్టం లేదని చెప్పారు హీరోయిన్​ సమంత. ప్రస్తుతం ఆమె పలు ప్రాజెక్టుల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.

12:06 December 12

టాప్​ న్యూస్​ @12 PM

  • ఆంధ్రప్రదేశ్‌లో తొలి ఒమిక్రాన్‌ కేసు నమోదు

ఏపీలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైందని ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. విజయనగరం జిల్లాకు చెందిన 34 ఏళ్ల వ్యక్తికి సోకిందని తెలిపింది. గత నెల 27న ఐర్లాండ్ నుంచి భారత్ వచ్చిన ప్రయాణికుడు ముంబయి మీదుగా విశాఖ వచ్చాడు. అక్కడి విమానాశ్రయంలో ఆర్టీపీసీఆర్​ పరీక్షలో కరోనా నిర్ధరణైంది. ఏపీకి వచ్చిన 15 మంది నమూనాలను..హైదరాబాద్ సీసీఎంబీకి పంపగా విజయనగరం జిల్లా వ్యక్తిలో ఒమిక్రాన్ వేరియంట్ గుర్తించారు.

  • అగ్ని ప్రమాదంలో 27 ఇళ్లు దగ్ధం

Himachal pradesh fire incident: అగ్ని ప్రమాదంలో 27 ఇళ్లతో పాటు రెండు దేవాలయాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. హిమాచల్ ప్రదేశ్​లోని కుల్లూ జిల్లాలో ఈ ఘటన జరిగింది.

  • ఎంసెట్​ ర్యాంకుల ఆధారంగా బీఎస్​సీ నర్సింగ్​ సీట్ల భర్తీ

BSC NURSING: ప్రస్తుత సంవత్సరానికి బీఎస్​సీ నర్సింగ్​ సీట్ల భర్తీ ఇంటర్‌ మార్కుల ఆధారంగానే జరుగుతున్నా.. వచ్చే ఏడాది నుంచి మాత్రం ఎంసెట్​ ర్యాంకుల ఆధారంగా జరగనుంది.

  • పాండ్యా గాయపడతాడని ముందే చెప్పా

Shoaib Akhtar about Hardik Pandya Injury: టీమ్ఇండియా ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యా గాయంతో కొంతకాలంగా ఇబ్బందిపడుతున్నాడు. అయితే అతడు గాయపడతాడని ముందే చెప్పాడట పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్.

  • స్పెషల్​ సాంగ్స్​లో చిందులేసిన స్టార్​ హీరోయిన్స్​ వీరే!

Tollywood Heroines in Item songs: 'పుష్ప' సినిమాలో 'ఊ అంటావా మావ ఉఊ అంటావా మావ' అంటూ స్టార్​ హీరోయిన్​ సమంత అభినయించిన సాంగ్​ అభిమానుల చేత ఈలలు వేయిస్తోంది. అయితే ఇలాంటి ప్రత్యేక గీతాల్లో ప్రముఖ కథానాయికలు కాలు కదపడం కొత్తేమీ కాదు. అంతకుముందు శ్రియ, శ్రుతిహాసన్​, కాజల్​, తమన్నా లాంటి వారు కూడా ఉన్నారు. ఓ సారి వాటిపై ఓ లుక్కేద్దాం..

10:50 December 12

టాప్​ న్యూస్​ @11AM

  • వృద్ధులకు బూస్టర్‌ డోసులు ఇస్తే మేలే

Booster Dose: ఒమిక్రాన్‌ వేళ.. ప్రయాణాలపై నిషేధం విధించడం కన్నా, పరీక్షలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుందని ప్రముఖ వైరాలజిస్ట్‌ డాక్టర్‌ గగన్‌దీప్‌ కాంగ్‌ అభిప్రాయపడ్డారు. వృద్ధులు, ఇతరత్రా వ్యాధులు ఉన్నవారికి మూడో విడత కింద బూస్టర్‌ డోసు ఇవ్వాలని సూచించారు.

  • తబ్లిగీ జమాత్​తో సమాజానికి ముప్పు

Saudi Tablighi Jamaat: తబ్లిగీ జమాత్​తో ప్రజలకు, సమాజానికి పెను ముప్పు పొంచి ఉందని సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు దేశంలో ఈ ఇస్లామిక్​ సంస్థపై నిషేధం విధిస్తున్నట్లు స్పష్టం చేసింది.

  • ఏపీ, తెలంగాణలో బంగారం ధర ఎంతంటే..?

Gold Price Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం ధర ఆదివారం స్థిరంగా ఉంది. వెండి ధరలో కూడా ఏ మార్పు లేదు.

  • క్రికెట్​ యుద్ధమైతే ఇతడో గ్రేట్ వారియర్!

Yuvraj Singh Birthday: 2002 క్రికెట్ మక్కా లార్డ్స్​లో ఇంగ్లాండ్​పై భారత్ విజయం.. 2007 టీ20 ప్రపంచకప్​లో బ్రాడ్ బౌలింగ్​లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు.. 2011 వన్డే ప్రపంచకప్​లో​ మ్యాన్ ఆఫ్​ ది టోర్నమెంట్.. ఇలాంటి ఎన్నో టోర్నీల్లో తనదైన రీతిలో ఆకట్టుకున్న​ టీమ్ఇండియా ఆల్​రౌండర్ యువరాజ్ సింగ్. ఈరోజు ఈ స్టైలిష్ బ్యాటర్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కథనం మీకోసం.

  • ఫిదా చేస్తున్న సామ్​ హాట్​లుక్స్​​

సుకుమార్​ దర్శకత్వంలో అల్లు అర్జున్​ హీరోగా తెరకెక్కిన సినిమా 'పుష్ప'. తాజాగా ఈ చిత్రంలోని స్టార్​ హీరోయిన్​ సమంత కాలు కదిపిన 'ఊ అంటావా మావ.. ఉఊ అంటావా మావ' అంటూ సాగే ప్రత్యేక గీతం విడుదలైంది. ప్రస్తుతం ఈ సాంగ్​ కుర్రకారును విపరీతంగా ఉర్రూతలూగిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ పాటలోని సామ్​కు సంబంధించిన హాట్​ లుక్స్ ​అలరిస్తున్నాయి. అభిమానులు ఆ పోజులకు ఫిదా అవుతున్నారు.

09:53 December 12

టాప్​ న్యూస్​ @10AM

  • భారత్ @ 7,774 కేసులు

India Covid Cases: దేశంలో కొవిడ్ వ్యాప్తి స్థిరంగా కొనసాగుతోంది. కొత్తగా 7,774 కేసులు వెలుగులోకి వచ్చాయి. 306 మరణాలు సంభవించాయి. శనివారం 89,56,784 మందికి టీకాలు అందించారు.

  • సెలైన్‌తో విషం ఎక్కించుకుని వైద్యుడి ఆత్మహత్య

Doctor Suicide in Hyderabad : సెలైన్‌లో విషం ఎక్కించుకుని ఓ వైద్యుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఎస్​ఆర్​ నగర్ ఠాణా పరిధిలో జరిగింది. మృతుడు ఏపీలోని కడప జిల్లా బద్వేలుకు చెందిన డా. రాజ్‌కుమార్‌(29)గా గుర్తించారు.

  • లోటుపాట్లు దిద్దుకొంటేనే ప్రజారోగ్యం

universal healthcare: ప్రపంచ జనాభాలో కనీసం 50శాతం ప్రజలకు వైద్య సదుపాయాలు అంతంత మాత్రంగానే లభ్యమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం 2030 నాటికి అందరికీ ఆరోగ్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తులు చేస్తోంది. ఇది సాకారం కావాలంటే.. అధిక జనాభా, నిరక్షరాస్యత, వ్యాధుల సంక్రమణ తీవ్రత, వైద్య సిబ్బంది కొరత, గ్రామీణ పట్టణ ప్రాంతాల మధ్య వైద్యసేవల్లో నెలకొన్న వ్యత్యాసం తదితర సవాళ్లను అధిగమించాల్సి ఉంది. కొవిడ్‌ సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజారోగ్య వ్యవస్థలోని లోటు పాట్లను సరిదిద్దుకొని, నిలకడైన పురోగతిని యుద్ధ ప్రాతిపదికన సాధించాల్సిన తరుణమిది.

  • 'ఆ విజయం భారత క్రికెట్ చరిత్రలో సువర్ణాధ్యాయం'

Sunil Gavaskar on Team India Gabba victory: ఈ ఏడాది ఆరంభంలో గబ్బా వేదికగా ఆస్ట్రేలియాను చిత్తు చేసింది టీమ్ఇండియా. ఆ వేదికపై ఆసీస్​కు అదే తొలి ఓటమి. తాజాగా ఇదే గబ్బాలో యాషెస్ సిరీస్​లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్టు జరిగింది. ఈ మ్యాచ్​లో ఘనవిజయం సాధించింది ఆసీస్. కాగా, ఈ గెలుపు భారత విజయానికి మరింత విలువనిచ్చిందని తెలిపాడు దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్.

  • ఏఆర్​ రెహ​మాన్​ ఉదారత

AR Rahman Sunshine Orchestra: తన సంగీతంతో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్నారు ఏఆర్‌. రెహమాన్​. స్వీయ సంగీత దర్శకత్వంలో పాటలు పాడి యావత్‌ సంగీత ప్రియుల్ని అలరిస్తుంటారు. అయితే ఆయనలో ఓ మంచి వ్యక్తి కూడా ఉన్నారు. ఎన్నో సేవకార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఓ ఫౌండేషన్​ ద్వారా ఎంతో మంది పేదపిల్లలను చేరదీసి వారిని సంగీత కళాకారులుగా తీర్చిదిద్దుతున్నారు. వారిలో చాలామంది ప్రపంచ వేదికలెక్కుతున్నారు. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం..

08:47 December 12

టాప్​ న్యూస్​ @9AM

  • దేశం అప్పు రూ.135 లక్షల కోట్లు

India debt 2021: గత 70 ఏళ్లలో భారతదేశ అప్పు 5.29 లక్షల శాతం పెరిగింది. 1950-51లో దేశం నికర అప్పు రూ.2,565.40 కోట్లు ఉండగా, 2021-22 నాటికి అది రూ.1,35,86,975.52 కోట్లకు చేరింది.

  • ప్రమాదంలో 'ఇంటర్నెట్'

log4shell exploit: డేటాను తస్కరించేందుకు వీలు కల్పించే కొత్త సాఫ్ట్‌వేర్‌ బగ్‌ పుట్టుకొచ్చింది. ప్రభుత్వాలు, సంస్థల అంతర్గత నెట్‌వర్కుల్లోకి దుండగులు సులభంగా చొచ్చుకెళ్లగల 'లాగ్‌4షెల్‌' బగ్​ సమస్య గురువారం వెలుగుచూసింది. చాపకింద నీరులా విస్తరించిన ఈ బగ్​.. గంటల వ్యవధిలోనే ప్రపంచవ్యాప్తంగా అలజడి రేపింది.

  • బౌరంపేటలో ప్రమాదంలో ముగ్గురు మృతి

Dundigal Car Accident : మేడ్చల్‌ జిల్లా దుండిగల్‌ పోలీస్‌స్టేన్‌ పరిధిలోని బౌరంపేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. బౌరంపేట కోకాకోలా కంపెనీ వద్ద ఘటన చోటుచేసుకుంది. ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. కారులో ఉన్న నలుగురిలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. గాయపడిన అశోక్‌ అనే వ్యక్తిని సూరారం మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు.

  • రోయింగ్​లో స్వర్ణంతో మెరిసిన భారత జోడీ

Asian Rowing Championships 2021: ఆసియా రోయింగ్ ఛాంపియన్​ షిప్​ పురుషుల డబుల్స్ విభాగంలో భారత రోయర్లు అర్జున్ లాల్-రవి స్వర్ణం కైవసం చేసుకున్నారు. సింగిల్ స్కల్స్​లో పర్మీందర్ సింగ్ రజతం గెలిచాడు.

  • ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు

Dhanush The Gray Man Movie: హాలీవుడ్​ సినిమా 'ది గ్రే మ్యాన్​'లో తనకు అవకాశం రావడం గొప్పగా భావిస్తున్నట్లు అన్నారు కోలీవుడ్​ స్టార్​ హీరో ధనుష్​​. ఈ చిత్రంతో నటుడిగా ఎన్నో కొత్త పాఠాలను నేర్చుకున్నట్లు తెలిపారు.

07:57 December 12

టాప్​ న్యూస్​ @8AM

  • ప్రత్యామ్నాయ పంటల దిశగా..

Alternative Crops : యాసంగిలో వరి వేయొద్దన్న సీఎం సూచనలతో రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పంటల వైపుగా రైతులు ఆలోచన చేస్తున్నారు. చిరుధాన్యాలు, పొద్దుతిరుగుడు, పప్పుధాన్యాల వైపు దృష్టి సారిస్తున్నారు. అయితే విత్తనాలు, మద్దతు ధరపై అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం భరోసా కల్పిస్తే ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు మొగ్గు చూపే అవకాశం ఉంది.

  • కశ్మీర్​లో ఎన్​కౌంటర్

జమ్ముకశ్మీర్​ అవంతిపొరా జిల్లాలోని బరాగామ్ ప్రాంతంలో భద్రతా బలగాలు.. ఉగ్రవాదులు మధ్య ఎదురుకాల్పలు జరిగాయి. ఈ ఘటనలో ఓ ముష్కరుడు హతమైనట్లు అధికారులు తెలిపారు.

  • మోదీ ట్విటర్‌ ఖాతా హ్యాక్‌

PM Modi twitter: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యక్తిగత ట్విట్టర్‌ ఖాతా హ్యాక్‌ అయింది. అయితే కొంతసేపటి తర్వాత ట్విట్టర్‌ యాజమాన్యం దాన్ని పునరుద్ధరించింది.

  • అస్సలు ఊహించలేదు

  • హైదరాబాద్​కు తొలి ఓటమి

విజయ్ హజారే ట్రోఫీలో వరుసగా రెండు విజయాలతో జోరు చూపించిన హైదరాబాద్​కు సౌరాష్ట్ర అడ్డుకట్ట వేసింది. అలాగే ఈ టోర్నీలో రెండు ఓటముల తర్వాత తొలి విజయాన్ని అందుకుంది ఆంధ్ర.

06:32 December 12

టాప్​ న్యూస్​ @7AM

  • సమ్మె నష్టం రూ.120 కోట్లపైనే!

Huge Loss to Singareni : కార్మికుల మూడు రోజుల సమ్మెతో సుమారు నాలుగు లక్షల టన్నులకుపైగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోవడంతో సింగరేణి సంస్థ రూ.120 కోట్లకుపైగా రాబడిని కోల్పోయింది. తెలంగాణలో నాలుగు బొగ్గు గనులను కేంద్రం.. వేలం జాబితాలో పెట్టినందుకు నిరసనగా కార్మికులు ఈ నెల 9 నుంచి 11 వరకు సమ్మె చేశారు. సమ్మెతో ఆందోళన తీవ్రతను కేంద్రం దృష్టికి తీసుకెళ్లగలిగామని కార్మిక సంఘాలు చెబుతున్నాయి.

  • RRR తొలిదశ పనులు వేగవంతం

Land acquisition for RRR: ప్రాంతీయ రింగ్‌ రోడ్డు తొలిదశ పనులు వేగం పుంజుకున్నాయి. నిర్మాణం కోసం అవసరమైన భూ సేకరణ ప్రక్రియను చేపట్టాల్సిందిగా కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి తాజాగా లేఖ రాసింది. ఈ నేపథ్యంలో రహదారి మార్గం వెళ్లే ప్రాంతాల్లోని ఒక్కో జిల్లాను ఒక్కో యూనిట్ గా తీసుకోవాలా? లేక నిర్ధారిత కిలోమీటర్లకు ఒక యూనిట్‌ను ఏర్పాటు చేయాలా? అన్న అంశంపై రాష్ట్ర అధికారులు ఆలోచిస్తున్నారు.

  • బంగారు గొలుసు ​మింగేసిన గోవు

Cow swallows gold chain: గోపూజలో భాగంగా ఆవు మెడలో 20 గ్రాముల బంగారు గొలుసు తొడిగారు ఆ ఇంటి కుటుంబ సభ్యులు. అయితే.. పూజ అనంతరం ఎంత వెతికినా వారికి ఆ బంగారు గొలుసు కనిపించలేదు. ఇక ఆ గొలుసును ఆవు మింగేసి ఉంటుందని అనుమానించిన ఆ కుటుంబీకులు ఏం చేశారంటే..?

  • కొవిడ్ వేళ పెరిగిన బరువును తగ్గిద్దాం!

Weight loss tips: కొవిడ్ మహమ్మారి సమయంలో ప్రపంచవ్యాప్తంగా చాలా మంది బరువు పెరిగారు. ఆంక్షల వల్ల ఇంటి నుంచి కదల్లేని పరిస్థితి, 'వర్క్‌ ఫ్రమ్‌ హోం' వంటివి ఇందుకు కారణం. ఈ అదనపు బరువును తగ్గించుకుని, కొవిడ్​కు పూర్వ దశకు చేరుకోవడానికి శరీరానికి ప్రేరణ అవసరమని చెబుతున్నారు నిపుణులు. శరీరంలోని అంతర్గత 'ఫ్యాట్‌ బ్రేక్‌'ను సద్వినియోగం చేసుకొని, బరువును తగ్గించుకోవాలని సూచిస్తున్నారు.

  • సింధు.. కొడుతుందా మళ్లీ

Badminton World Championships: 2013, 2014లో వరుసగా రెండు కాంస్యాలు.. సంతృప్తి చెందలేదు. 2017, 2018లో వరుసగా రెండు రజతాలు.. ఆగిపోలేదు. మొక్కవోని పట్టుదలతో మళ్లీ ప్రయత్నించింది. 2019లో తన కల నెరవేర్చుకుంది. ఆ ఏడాది ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ మహిళల సింగిల్స్‌ విజేతగా నిలిచి చరిత్ర సృష్టించిన పూసర్ల వెంకట సింధు.. ఇప్పుడు ఆ టైటిల్‌ నిలబెట్టుకోవడానికి బరిలోకి దిగుతోంది. కరోనా కారణంగా నిరుడు రద్దవడం వల్ల రెండేళ్ల పాటు ప్రపంచ ఛాంపియన్‌గా కొనసాగిన తెలుగమ్మాయి.. ఇంకో ఏడాది ఆ హోదాను అనుభవిస్తుందో లేదో స్పెయిన్‌లో తేలబోతోంది.

05:16 December 12

టాప్​ న్యూస్​ @6AM

  • త్వరలో కేసీఆర్​ జిల్లాల పర్యటన...!

CM KCR District Tour: ముఖ్యమంత్రి కేసీఆర్​ త్వరలో జిల్లాల్లో పర్యటించే అవకాశం ఉంది. వివిధ ప్రారంభోత్సవాలు, అభివృద్ధి కార్యాక్రమాల్లో సీఎం పాల్గొననున్నారు. ఈ మేరకు ఆయా జిల్లాల మంత్రులు, ముఖ్యనేతలతో ముఖ్యమంత్రి చర్చించారు. పార్టీ ఆధ్వర్యంలో ఆయా జిల్లాల్లో బహిరంగ సభలు కూడా ఏర్పాటు చేయనున్నారు.

  • నెలాఖరులో రైతుబంధు చెల్లింపులు...

Yasangi rythu bandhu: యాసంగి రైతుబంధు చెల్లింపులు ఈ నెలాఖర్లో జరిగే అవకాశం ఉంది. అందుకు అనుగుణంగా అధికారులు చెల్లింపులకు సిద్ధమవుతున్నారు. యాసంగి సాయంతో రాష్ట్రంలో రైతుబంధు కింద అందించిన మొత్తం రూ. 50 వేల కోట్ల మార్కు దాటనుంది.

  • ట్రైబ్యునల్‌-2 తీర్పు అమలు వద్దు...

Krishna water dispute: కృష్ణా జల వివాద ట్రైబ్యునల్‌ తీర్పు అమలుపై భాగస్వామ్య రాష్ట్రాలు సుప్రీంకోర్టులో తమ వాదనలు వినిపించేందుకు సిద్ధమయ్యాయి. తీర్పు అమలు చేసే 'బచావత్‌ ట్రైబ్యునల్‌' ప్రకారం క్యారీ ఓవర్‌ కింద చేసిన కేటాయింపులు కూడా దక్కే పరిస్థితి ఉండదని తెలంగాణ సర్కార్‌ పేర్కొంది. దీనిపై సమగ్ర అధ్యయనం జరగాల్సి ఉందని... తీర్పును నోటిఫై చెయ్యొద్దని కోరింది.

  • వరి సాగుకే రైతుల మొగ్గు...

Farmers preparing pady seedlings: వరి సాగు వద్దని.. ప్రత్యమ్నాయ పంటలు వేసుకోవాలని ప్రభుత్వం ఓ వైపు చెపుతున్నా... రైతులు మాత్రం యాసంగి కోసం వరి నారుమళ్లు సిద్ధం చేసుకుంటున్నారు. నీళ్లు పుష్కలంగా ఉన్నప్పుడు... వరికి బదులు ఇంకేమి పండిస్తామంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం కొన్నా కొనకున్నా వరే సాగు చేస్తామంటున్నారు.

  • మృతదేహాల గుర్తింపు ప్రక్రియ పూర్తి

chopper crash dead bodies: హెలికాప్టర్ ప్రమాదంలో అమరులైన వారందరి మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. శనివారం మొత్తం 10 మందిని గుర్తించగా.. ఆరుగురి భౌతికకాయాలను బంధువులకు అప్పగించారు. మిగిలిన నలుగురి పార్థివదేహాలను ఆదివారం బంధువులకు అందజేస్తారు.

  • బూస్టర్‌ డోసు వేసుకున్నా వదలని 'ఒమిక్రాన్‌'!

Omicron in vaccinated people: అమెరికాలో కరోనా కొత్త వేరియంట్​ ఒమిక్రాన్ కలకలం సృష్టిస్తోంది. ఆ దేశంలో కొత్తగా 43 మందికి ఒమిక్రాన్ నిర్ధరణ కాగా.. వారిలో 34మంది వ్యాక్సినేషన్ పూర్తయినవారే ఉన్నారు. అందులో 14 మందికి బూస్టర్‌ డోసు కూడా పూర్తయినా ఈ వేరియంట్​ బారిన పడటం గమనార్హం. మరోవైపు.. తైవాన్​లో తొలిసారి ఒమిక్రాన్ కేసు వెలుగు చూసింది.

America Tornado: అమెరికా కెంటకీ రాష్ట్రంలో టోర్నడో ధాటికి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 70కి చేరింది. పెనుగాలులతో కూడిన తుపాను ధాటికి వేర్వేరు ఘటనల్లో వీరంతా మరణించారు. మృతుల సంఖ్య 100 వరకు పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

  • ఈ ఒక్క పేరు చాలు!

Superstar rajinikanth birthday: కోట్లాదిమంది అభిమానుల ఆరాధ్య హీరో సూపర్​స్టార్ రజనీకాంత్.. 72వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన గురించి ఆసక్తికర విషయాలు మీకోసం.

  • అతడో అద్భుతమైన ఫీల్డర్..

Jadeja Fielding: టీమ్​ఇండియా ఆల్​రౌండర్ రవీంద్ర జడేజాను ప్రశంసలతో ముంచెత్తాడు మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్. జడేజా గొప్ప నైపుణ్యమున్న ఫీల్డర్ అని అన్నాడు. భారత జట్టు మాజీ సారథి అజహరుద్దీన్​ ఫీల్డింగ్ కూడా అద్భుతంగా ఉండేదని గుర్తుచేశాడు.

Last Updated : Dec 12, 2021, 10:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.