ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @ 9AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్​ టెన్​ న్యూస్​ @9AM
టాప్​ టెన్​ న్యూస్​ @9AM
author img

By

Published : Jul 19, 2021, 8:57 AM IST

సభా సమయం

నేటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. వచ్చే నెల 13 వరకు వీటిని కొనసాగించనున్నారు. పెట్రో ధరల పెరుగుదల, సాగు చట్టాల రద్దు, రఫేల్‌ ఒప్పందంపై దర్యాప్తు వంటి అంశాలపై ప్రభుత్వాన్ని తాజా సమావేశాల్లో ఇరుకున పెట్టేందుకు విపక్షాలు సిద్ధమమయ్యాయి. వాటిని దీటుగా ఎదుర్కొనేందుకు అధికార పక్షం పక్కా ప్రణాళికలు రూపొందించుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

హుజూరాబాద్​ నుంచే అమలు..

రాష్ట్రంలో అమలు చేయ తలపెట్టిన దళిత సాధికారత పథకానికి ‘తెలంగాణ దళిత బంధు’ పేరును సీఎం కేసీఆర్‌ ఖరారు చేశారు. రైతుబంధు తరహాలోనే ఈ పథకాన్ని కరీంనగర్‌ జిల్లాలోని హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

రేవంత్​ గృహనిర్బంధం

కోకాపేట భూముల వేలంలో అక్రమాలు జరిగాయని రాష్ట్ర కాంగ్రెస్ ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఆ భూములను సందర్శించాలని నిర్ణయించింది. ఇవాళ ఉదయం 11 గంటలకు కోకాపేట వెళ్లనున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు. ముందస్తుగా అప్రమత్తమైన పోలీసులు.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని గృహనిర్బంధం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

మొదటి ప్రమాద హెచ్చరిక

మూసీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలకు అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. హిమాయత్‌సాగర్‌లోకి మూసీ వరద అధికంగా వస్తున్న నేపథ్యంలో చర్యలు తీసుకుంటున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

టీకాతో రక్షణ

కరోనా టీకా(Corona Vaccine) రెండు డోసులు తీసుకున్న వారికి వైరస్ నుంచి ముప్పు తక్కువగా ఉంటుందని తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. టీకా తీసుకున్న వారిలో మరణాల శాతం తక్కువగా ఉందని పరిశోధనలో తేలింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

విషాదం

ఉత్తరాఖండ్​లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ ప్రభావంతో ఉత్తరకాశీ జిల్లాలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు గల్లంతయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

హ్యాకింగ్​ కలకలం

పలువురు కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టుల ఫోన్లు హ్యాకింగ్‌కు గురైనట్లు 'ది వైర్‌' వార్తాసంస్థ ఓ సంచలనాత్మక కథనం వెలువరించింది. 'పెగాసస్‌' అనే స్పైవేర్‌ సాయంతో ఈ హ్యాకింగ్‌ జరిగినట్లు తెలుస్తోందని వెల్లడించింది. బాధితుల జాబితాలో వ్యాపారవేత్తలు, ప్రభుత్వ అధికారులు, శాస్త్రవేత్తలు సహా ఓ సుప్రీం సిట్టింగ్‌ న్యాయమూర్తి కూడా ఉన్నారని చెప్పింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'మంకీ బీ వైరస్' కలకలం

చైనాలో కోతుల నుంచి సంక్రమించే 'మంకీ బీ'(Monkey B Virus) వైరస్‌ కలకలం రేపుతోంది. బీజింగ్​కు చెందిన ఓ పశువైద్యుడికి తొలిసారి ఈ వైరస్​ సోకినట్లు నిర్ధరణ అయిందని ఆ దేశం వెల్లడించింది. ఈ మధ్యే అతడు మరణించినట్లు చెప్పింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

పట్టు.. పతకం వచ్చేట్టు

టోక్యో ఒలింపిక్స్(Tokyo Olympics) మరో నాలుగు రోజుల్లో ప్రారంభంకానుంది. అయితే రెజ్లింగ్​లో భారత్​కు ఒకటి కన్నా ఎక్కువ పతకాలు వస్తాయని భారీగా అంచనాలు ఉన్నాయి. రెజ్లర్లు మంచి ఫామ్​లో ఉండటమే ఇందుకు కారణం. మరి మనోళ్లు ఎవరి మీద ఆశలు పెట్టుకున్నారో చూద్దాం.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

విప్లవాత్మక మార్పులు

వచ్చే పదేళ్లలో సినీ ప్రదర్శన రంగంలో విప్లవాత్మకం మార్పులు జరుగుతాయని అన్నారు ప్రముఖ నిర్మాత డి.సురేశ్ బాబు. బ్యాంకుల్లోనూ, ఆపార్ట్​మెంట్​ కాంప్లెక్స్​ల్లోనూ మినీ థియేటర్లు వచ్చే అవకాశముందని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.