ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​ @9AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్​ టెన్​ న్యూస్​ @9AM
టాప్​ టెన్​ న్యూస్​ @9AM
author img

By

Published : Jul 18, 2021, 8:57 AM IST

ఏ బోర్డుకు లేనన్ని?

దేశంలోని ఏ నదీ యాజమాన్య బోర్డుకూ లేని విస్తృత అధికారాలను కృష్ణా, గోదావరి బోర్డులకు కేంద్రం కల్పించింది. ఏ బోర్డుకు తమ ఆదేశాలను అమలు చేయని ప్రభుత్వాలపై చర్య తీసుకొనే అవకాశం లేదు. కానీ ఈ రెండు బోర్డులకు చర్యలు తీసుకొనే అవకాశాన్ని కేంద్రం కల్పించింది. తాజాగా కేంద్రం ప్రచురించిన గెజిట్‌ నోటిఫికేషన్‌లోని అంశాలను, దీనికి ఆధారంగా తీసుకొన్న ఏపీ పునర్విభజన చట్టంలోని అంశాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

వైద్యవిద్యలో వైపరీత్యం

కొవిడ్‌ దెబ్బ 25,000 మంది వైద్యవిద్యార్థుల మీద పడింది. ప్రాక్టికల్స్‌ కొరవడడంతో రోగిని ప్రత్యక్షంగా పరీక్షించి, వారి వ్యాధుల్ని తెలుసుకునే అవకాశం లేకుండాపోయింది. దీంతో వీరు రేపు నేరుగా రోగుల మీదే ప్రాక్టికల్స్‌ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

అప్పటివరకు స్పందించవద్దు..

కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధి ఖరారు ప్రకటన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. గెజిట్​ను పూర్తి స్థాయిలో అన్ని కోణాల్లో అధ్యయనం చేశాకే.. సర్కార్ వైఖరి వెల్లడయ్యే అవకాశం కనిపిస్తోంది. నిపుణులు, అధికారులు, ఇంజనీర్లతో సంప్రదింపులు జరుపుతోన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈ విషయమై ఇప్పుడే ఎవరూ స్పందించవద్దని నేతలకు సూచించినట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

నేటి నుంచి థియేటర్లు ఓపెన్​

సినిమా థియేటర్లను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ కోరింది. ఈ మేరకు ఛాంబర్‌ సభ్యులు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను శనివారం కలిశారు. రాష్ట్రంలో థియేటర్ల పునఃప్రారంభానికి చొరవ చూపాలని కోరారు. దీంతో ఆదివారం నుంచి థియేటర్ల పునః ప్రారంభానికి ఎగ్జిబిటర్లు సిద్ధమయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

త్వరలోనే మరో దఫా

మరో విడత భూముల అమ్మకానికి సర్కార్ సిద్ధమవుతోంది. మొదటి దఫాలో మంచి స్పందన వచ్చిన నేపథ్యంలో వీలైనంత త్వరగా మరోమారు భూములు విక్రయించాలని ప్రభుత్వం భావిస్తోంది. భూముల అమ్మకం ద్వారా రూ.పదివేల కోట్ల నిధులు రాబట్టుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

మహా విషాదం

మహారాష్ట్రలో విషాదం జరిగింది. ఓ పెద్ద గోడ కూలి గుడిసెలపై పడిన ఘటనలో 11 మంది మృతి చెందారు. చెంబుర్​ ప్రాంతంలోని భరత్​ నగర్​ కాలనీలో ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

కాంగ్రెస్​ కీలక భేటీ

పార్లమెంటు సెషన్​ సోమవారం.. ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇవాళ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన వర్చువల్​గా జరిగే ఈ భేటీలో.. కాంగ్రెస్ ఎంపీలు పాల్గొననున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

కాంవడ్​ యాత్ర రద్దు

ఉత్తర్​ప్రదేశ్​లో 'కాంవడ్​ యాత్ర'ను రద్దు చేసింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. యాత్ర అనుమతులపై సోమవారంలోపు వివరణ ఇవ్వాలని సుప్రీం కోర్టు నోటీసుల జారీ చేసిన క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'ఆర్ఆర్ఆర్' ప్రచారగీతం

ప్రచారంలో భాగంగా ఓ గీతాన్ని తెరకెక్కించే పనిలో ఉంది 'ఆర్ఆర్ఆర్' టీమ్. అలానే మిగిలిన పాట చిత్రీకరణ కోసం త్వరలో విదేశాలకూ వెళ్లనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

మ్యాచ్​ జరిగేనా?

కొలంబోలో ఆదివారం వర్షం పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ అంచనా. దీంతో టీమ్​ఇండియా-శ్రీలంక తొలి వన్డే జరుగుతుందా లేదా? అనేది చూడాలి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.