ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @7PM - top ten news till now

ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలు.

etv bharat telugu top ten news
టాప్​టెన్​ న్యూస్​@7PM
author img

By

Published : Nov 28, 2020, 6:59 PM IST

1.అభివృద్ధికే పట్టం కడతారు: కేసీఆర్

ఎన్నికల వేళ ఓటర్లు విచక్షణాధికారం వినియోగించాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. హైదరాబాద్​లోని ఎల్బీ స్టేడియం​లో నిర్వహించిన బహిరంగ సభలో ఓటర్లనుద్దేశించి గులాబీబాస్​ మాట్లాడారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2.హైదరాబాద్​లో యోగి

హైదరాబాద్​లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​ రోడ్​ షో నిర్వహించారు. గ్రేటర్​లో భాజపా అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ కూకట్​పల్లిలో ప్రచారం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3.నగర ఓటర్ల సౌకర్యార్థం

నగర ఓటర్ల సౌకర్యార్థం బల్దియా మై జీహెచ్​ఎంసీ యాప్​ రూపొందించింది. ఓటరు స్లిప్ డౌన్​లోడ్​, పోలింగ్​ బూత్​ వివరాలను యాప్​ ద్వారా పొందవచ్చని తెలిపింది. ఓటర్ స్లిప్​తోపాటు పోలింగ్ కేంద్రం ఎక్కడ ఉందో గూగుల్​ మ్యాప్​తో సహా వస్తుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4.'బస్తీలో గస్తీ కాసే ఎన్నికలివి'

తెరాస, ఎంఐఎం, భాజపా... మూడు పార్టీలు ఒక్కటేనని ఎంపీ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ హయాంలో హిందూ, ముస్లింలు అన్నదమ్ముల్లా కలిసి ఉన్నారన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5.'నిరసనలు కొనసాగిస్తాం'

దేశ రాజధానిలోనే ఉండి.. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతామని రైతులు తేల్చిచెప్పారు. కేంద్రం దిగొచ్చేంతవరకు వెనక్కి తగ్గమని స్పష్టం చేశారు. మరోవైపు దిల్లీ నిరసనల్లో తమ రైతులు పాల్గొనలేదని హరియాణా సీఎం మనోహర్​ లాల్​ ఖట్టర్​ వెల్లడించారు. ఆందోళనల వెనుక కొన్ని రాజకీయ పార్టీలు, సంఘాలు ఉన్నట్టు అభిప్రాయపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6.వ్యాక్సిన్ల పురోగతి ఎలా ఉందంటే..

కరోనా సంక్షోభం నుంచి బయటపడాలంటే.. మానవాళికి ఉన్న ఏకైక మార్గం వ్యాక్సిన్​. కరోనాకు విరుగుడు ఎప్పుడొస్తుందా? అని ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అంతర్జాతీయంగా అనేక పరిశోధన సంస్థలు, ఔషధ సంస్థలు.. టీకా తయారీలో తలమునకలై ఉన్నాయి. కొన్ని వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి అవుతున్న టీకాల పురోగతి ఎలా ఉందో తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. ఆ 8 రాష్ట్రాల్లోనే..

చలికాలంలో కరోనా మహమ్మారి క్రమంగా మళ్లీ తీవ్ర రూపం దాల్చుతోంది. దేశంలోని ఎనిమిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనే వైరస్​ వ్యాప్తి అధికంగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్ర, దిల్లీ, కేరళల్లో నమోదయ్యే కొత్త కేసుల సంఖ్య పెరుగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8.'మార్కోస్' దళాల మోహరింపు

చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో వాస్తవాధీన రేఖ వెంబడి పాంగాంగ్‌ సరస్సు వద్ద 'మార్కోస్‌' దళాలను మోహరించింది ప్రభుత్వం. వాయుసేన, సైనిక బలగాలతో కలిసి మార్కోస్ పనిచేయనున్నట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9.ఆసీస్​కు ఎదురుదెబ్బ!

భారత్​తో రెండో వన్డేకు ఆస్ట్రేలియా క్రికెటర్​ మార్కస్​ స్టాయినిస్​ అందుబాటులో ఉండేది లేనిది అనుమానంగా మారింది. తొలి వన్డేలో బౌలింగ్​ చేస్తున్న సమయంలో ఈ ఆల్​రౌండర్​ గాయం కారణంగా మైదానాన్ని వీడాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10.'హృతిక్​ రోషన్​ది గొప్ప మనసు'

మాజీ ప్రియుడు, బాలీవుడ్​ హీరో హృతిక్​ రోషన్​, నటుడు ఆదిత్యా పంచోలి గొప్ప మనసున్న వ్యక్తులని అభిప్రాయపడింది హీరోయిన్​ కంగనా రనౌత్​. ఈ మధ్య కాలంలో వీరిద్దరిని విమర్శించిన క్వీన్​.. మళ్లీ పొగడటం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్​ 'తలైవి' సినిమాలో నటిస్తోంది కంగన. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.