1.'సమస్యల్ని పరిష్కరిస్తాం'
సికింద్రాబాద్ ఇంపీరియల్ గార్డెన్లో జరిగిన మున్నూరు కాపుల ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అభివృద్ధి, సుపరిపాలన కావాలంటే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాసకు ఓటు వేసి గెలిపించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2.'కొట్లాడైనా పరిష్కరిస్తా'
జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ఎంపీ రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. సమస్యలు పరిష్కారం కావాలంటే కాంగ్రెస్ గెలవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3.అవినీతి సెగ
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వరుసగా పోలీసు అధికారులు ఏసీబీకి చిక్కడం కలకలం రేపుతోంది. రెండు నెలల వ్యవధిలోనే ముగ్గురు సీఐలను అనిశా అరెస్టు చేసింది. కామారెడ్డి పట్టణ సీఐ జగదీశ్ ఐపీఎల్ బెట్టింగ్ కేసులో బెయిలు ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేయగా.. అనిశా తనిఖీల్లో దొరికిపోయాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4.కాగితపు ముక్క పట్టించింది..
ఏపీలోని.. నడికుడి స్టేట్ బ్యాంక్ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. తెలంగాణ రాష్ట్రంలోని మిర్యాలగూడ ఎస్టీ కాలనీకి చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. సినిమాలు చూసి ఈ దొంగతనానికి పాల్పడిన దొంగలు... ఓ చిన్న కాగితపు ముక్కను క్లూగా వదిలేశారు. అదే వారిని సులువుగా దొరికిపోయేలా చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5.పరిశుభ్రంగా ఉంచడం ఎలా?
హైదరాబాద్లో జనాభా పెరిగేకొద్ది వ్యర్థాలు పెరుగుతున్నాయి. ప్రభుత్వాలు, జీహెచ్ఎంసీ అధికారులు వ్యర్థాల నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా.. రహదారులు, కాలనీల్లో అనేక చోట్ల చెత్త కుప్పలు తెప్పలుగా దర్శనమిస్తున్నాయి. అసలు చెత్త నిర్వహణలో లోపం ఎక్కడ వస్తోంది.. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం ఎలా అనే అంశాలపై ఈటీవీ భారత్ కథనం... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6.ఒకే రోజు 3 సంస్థలకు మోదీ
దేశంలో అభివృద్ధి చేస్తున్న మూడు కరోనా టీకాల గురించి ఆరా తీయనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇందుకోసం సీరం, జైడస్ క్యాడిలా, భారత్ బయోటెక్ సంస్థలను శనివారం స్వయంగా సందర్శించనున్నారు. వ్యాక్సిన్ పనితీరు, ఉత్పత్తి, పంపిణీకి సన్నద్ధత వంటి విషయాలను సమీక్షించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7.'టీకా అందేది అప్పుడే'
2022 చివరి నాటికి దేశ పౌరులందరికీ కరోనా టీకా అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు ప్రముఖ వైద్య నిపుణులు డా. సునీలా గార్గ్. ఈటీవీ భారత్కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన గార్గ్.. వ్యాక్సినేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం కొవిన్ అనే యాప్ను రూపొందించినట్లు చెప్పారు. వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియలో ప్రైవేటు సంస్థలది కీలక పాత్ర అని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8.భారీగా హెరాయిన్ పట్టివేత
డ్రగ్స్ రవాణా చేస్తున్న ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేశారు తూత్తుకుడి కోస్టుగార్డులు. వారి నుంచి రూ.500కోట్లు విలువైన హెరాయిన్, ఐదు తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9.ఉగ్రవాదులకు మద్దతుగా గ్రాఫిటీ
కర్ణాటకలోని మంగళూరులో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కలకలం సృష్టించారు. ఉగ్రవాదులకు మద్దతుగా గోడలపై రాతలు రాశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10.జీడీపీ 7.5 శాతం క్షీణత
ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం(జులై-సెప్టెంబరు)లో దేశ స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ) 7.5 శాతం క్షీణించింది. ఈ మేరకు జాతీయ గణాంకాల కార్యాలయం(ఎన్ఎస్ఓ) ప్రకటించింది. కరోనా సంక్షోభంతో పలు ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోవడమే కారణంగా పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.