ETV Bharat / city

ఈటీవీ భారత్​ ముఖ్యాంశాలు

BHARAT
ఈటీవీ భారత్​
author img

By

Published : Nov 27, 2021, 6:00 AM IST

Updated : Nov 27, 2021, 9:59 PM IST

21:52 November 27

టాప్​ న్యూస్​@10PM

  • సిరివెన్నెలకు అస్వస్థత

ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్​లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

  • సొంత రిస్క్​తో వరి సాగు చేసుకోవచ్చు

పారాబాయిల్డ్ బియ్యం తీసుకోరాదని కేంద్ర ప్రభుత్వం, ఎఫ్​సీఐ నిర్ణయించాయని సీఎస్​ సోమేశ్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో యాసంగిలో సాగయ్యే వరి పారాబాయిల్డ్ బియ్యానికే అనుకూలమన్నారు. రైతులు యాసంగిలో వరి సాగు చేయవద్దని చెప్పారు.

  • ఆ ఇద్దరికి కరోనా

ఒమిక్రాన్​ వైరస్​ వేరియంట్​ను దక్షిణాఫ్రికాలో తొలుత గుర్తించారు. ఇది ఇతర దేశాలకు వ్యాపించినట్టు అనుమానాలు ఉన్నాయి. ఈ తరుణంలో.. దక్షిణాఫ్రికా నుంచి భారత్​కు వచ్చిన ఇద్దరికి వైరస్​ నిర్ధరణ అయిన వార్త కలకలం సృష్టిస్తోంది. అయితే తదుపరి పరీక్షలు నిర్వహించిన అనంతరం.. ఆ ఇద్దరికి ఒమిక్రాన్​ సోకలేదని తేలింది.

  • బన్నీ చేతుల మీదుగా రిలీజ్​​

Akhanda movie new trailer released: దర్శకుడు బోయపాటి తెరకెక్కించిన 'అఖండ' సినిమాకు సంబంధించిన కొత్త ట్రైలర్​ను విడుదల చేశారు హీరో అల్లుఅర్జున్​. ఈ ప్రచార చిత్రంలో బాలయ్య డైలాగ్​లు, యాక్షన్​ అదిరిపోయింది.

  • అలా చేయకపోతే పీఎఫ్‌ జమ కాదు!

ఈ నెలాఖరు నాటికి.. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ సార్వత్రిక ఖాతా సంఖ్య(యూఏఎన్‌)ను ఆధార్‌తో అనుసంధానించాల్సి (link aadhaar to pf number) ఉంటుంది. లేదంటే.. ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల్లో వచ్చే నెల నుంచి కంపెనీ వాటా జమ కాదు!

20:50 November 27

టాప్​ న్యూస్​@9PM

  • రేేపే సమావేశం

ఈ నెల 29 నుంచి ప్రారంభమవుతున్న లోక్​సభ శీతాకాల సమావేశాల(parliament winter session) నేపథ్యంలో.. రేపు తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశం(trs parliamentary party meeting) కానుంది.

  • 'వరి కొనకపోతే.. ఉరి తీయటం ఖాయం'

హైదరాబాద్​ ఇందిపార్క్​లోని ధర్నాచౌక్​లో కాంగ్రెస్​ తలపెట్టిన వరిదీక్ష(Congress vari Deeksha)లో తెరాస ప్రభుత్వంపై పీసీసీ రేవంత్​రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు(pcc chief revanth reddy fire on cm kcr) గుప్పించారు.

  • తొలిరోజే ఆ బిల్లు

సోమవారం నుంచి జరగనున్న శీతాకాల పార్లమెంట్​ సమావేశాల్లో.. తొలిరోజే సాగు చట్టాల రద్దు బిల్లును (Farm Bill Repeal) కేంద్రం ప్రవేశపెట్టనుంది. దీనిని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్.. లోక్‌సభ ముందుకు తీసుకెళ్లనున్నారు.

  • ఒమిక్రాన్​ అలర్ట్

Harish rao review on corona: కొవిడ్ కొత్త వేరియంట్లపై రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అవుతోంది. కొత్త వేరియంట్ వ్యాపిస్తున్న దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రయాణికుల విషయంపై రేపు చర్చించనున్నారు. ఈ మేరకు ఆరోగ్య శాఖ అధికారులతో మంత్రి హరీశ్ రావు సమీక్షించనున్నారు.

  • కివీస్​ను చుట్టేసిన స్పిన్నర్లు

భారత్​తో జరుగుతున్న తొలి టెస్టు(IND vs NZ Test) మొదటి ఇన్నింగ్స్​లో 296 పరుగులకు ఆలౌటైంది న్యూజిలాండ్. టీమ్ఇండియా బౌలర్లలో అక్షర్ పటేల్ 5, అశ్విన్ 3 వికెట్లతో మెరిశారు.

19:54 November 27

టాప్​ న్యూస్​@8PM

  • ఆ బిల్లు తొలిరోజే..!

  • హెచ్​ఐసీసీలో పల్మనాలజీపై సదస్సు

హైదరాబాద్​ హెచ్​ఐసీసీలో ఇంటర్వెన్షనల్​ పల్మనాలజీపై అంతర్జాతీయ సదస్సు(Interventional Pulmonology bronchus 2021) జరుగుతోంది. యశోద ఆస్పత్రుల ఆధ్వర్యంలో 'బ్రాంకస్​- 2021' పేరిట రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సును ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వర్చువల్​గా ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన ప్రఖ్యాత వైద్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

  • సూట్​కేస్​ హ్యాండిల్​లో బంగారం...!

హైదరాబాద్‌లోని శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో బంగారం పట్టుబడింది(gold smuggling in hyderabad airport). రూ.20 లక్షలు విలువచేసే బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం(gold seized in shamshabad airport) చేసుకున్నారు. ఎయిర్‌పోర్టులో నిర్వహించిన తనిఖీల్లో... సూట్​కేస్​ హ్యాండిల్​లో బంగారాన్ని గుర్తించారు.

18:52 November 27

టాప్​ న్యూస్​@7PM

  • 'అది రైతుల కోసం కాదు'

ధర్నాచౌక్​​లో కేసీఆర్​ చేసిన ధర్నా రైతుల కోసం చేసింది కాదని... తమ కుమారుడు ముఖ్యమంత్రి కావాలని చేశారని కేంద్రమంత్రి కిషన్​రెడ్డి ఆరోపించారు. హుజూరాబాద్ ఫలితం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ధాన్యం వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్రం చేసుకున్న ఒప్పందం ప్రకారం రాష్ట్రంలోని ధాన్యం కొనుగోలు చేస్తామని ఆయన అన్నారు.

  • 'అందువల్లే సమస్యలు!'

చట్టాల ప్రభావాన్ని అంచనా వేయకుండానే శాసనసభ ఆమోదించటం ద్వారా.. ఒక్కోసారి పెద్ద సమస్యలకు దారితీస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎన్​వీ రమణ(cji nv ramana news). దాని ఫలితంగా న్యాయ వ్యవస్థపై కేసుల భారం పెరిగిపోతుందన్నారు.

  • ఆ టీజర్ రిలీజ్​కు టైమ్​ ఫిక్స్​

మెగాస్టార్​ చిరంజీవి, రామ్​చరణ్​ కలిసి నటిస్తున్న చిత్రం 'ఆచార్య'. ఈ సినిమాలో 'సిద్ధ'గా నటిస్తున్న చెర్రీకి సంబంధించిన టీజర్​ను నవంబర్ 28న సాయంత్రం 4.05గంటలకు రిలీజ్​ చేయనున్నట్లు తెలిపింది చిత్రబృందం. దీంతోపాటే ఓ మేకింగ్​ వీడియోను రిలీజ్​ చేసింది.

  • ఆ వన్డే సిరీస్ వాయిదా

క్షిణాఫ్రికా-నెదర్లాండ్స్ మధ్య జరగాల్సిన వన్డే సిరీస్​ను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది క్రికెట్ సౌతాఫ్రికా. ప్రస్తుతం ఆఫ్రికా దేశాల్లో కరోనా కొత్త వేరియంట్ కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

17:59 November 27

టాప్​ న్యూస్​@6PM

'వరి కొనకపోతే..అంతే'

  • కాంగ్రెస్​కు టీఎంసీ ఝలక్​

పార్లమెంట్​ శీతాకాల సమావేశాలకు ముందు కాంగ్రెస్​ పార్టీకి షాక్​ ఇచ్చింది తృణమూల్​ కాంగ్రెస్(trinamool congress)​. ఆ పార్టీ సమన్వయంతో నడిచేందుకు నిరాశక్తత వ్యక్తం చేసింది. ఈనెల 29న కాంగ్రెస్​ తలపెట్టిన ప్రతిపక్షాల (opposition parties meet) సమావేశానికి హాజరుకావటం లేదని స్పష్టం చేసింది.

  • పట్టుకున్న పామే కాటేసింది

పట్టుకున్న పాము కాటు వేయడంతో వృద్ధుడు మృతిచెందిన ఘటన కర్ణాటకలోని యాదగిరి జిల్లాలో జరిగింది. వాడ్గెరా తాలుకా గోడిహలా గ్రామానికి చెందిన వృద్ధుడు బసవరాజు పూజారికి గ్రామంలోకి వచ్చిన పాములను పట్టుకునే అలవాటు ఉంది

  • హైపర్​ ఆది 'పుష్ప' స్టెప్

'జబర్దస్త్'​ లేటెస్ట్​ ప్రోమో విడుదలై తెగ నవ్విస్తోంది. హైపర్​ఆది, చలాకీ చంటి, రాకెట్​ రాఘవ తమ స్కిట్​లతో కితకితలు పెట్టించారు. ఇక జడ్జి రోజా వేసిన పంచ్​లు కడుపుబ్బా నవ్విస్తున్నాయి.

  • వరల్డ్​కప్ క్వాలిఫయర్ టోర్నీ రద్దు

కరోనా కొత్త వేరియంట్ కారణంగా మహిళల ప్రపంచకప్ క్వాలిఫయర్ టోర్నీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది ఐసీసీ. జింబాబ్వేలోని పరిస్థితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాయింట్ల పట్టికలో మెరుగ్గా ఉన్న పాకిస్థాన్, బంగ్లాదేశ్, వెస్టిండీస్​లను మెగాటోర్నీకి అర్హత సాధించిన జట్లుగా పేర్కొంది ఐసీసీ.

16:55 November 27

టాప్​ న్యూస్​@5PM

  • కొత్త వేరియంట్​పై తెలంగాణ అలర్ట్

కొవిడ్ కొత్త వేరియంట్లపై రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అవుతోంది. కొత్త వేరియంట్ వ్యాపిస్తున్న దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రయాణికుల విషయంపై రేపు చర్చించనున్నారు. ఈ మేరకు ఆరోగ్య శాఖ అధికారులతో మంత్రి హరీశ్ రావు సమీక్షించనున్నారు.

  • వారికి కొవిడ్​ టెస్ట్​ తప్పనిసరి కాదు

శబరిమల తీర్థయాత్రలో పాల్గొనే చిన్నారులకు ఆర్‌టీపీసీఆర్‌ టెస్టు తప్పనిసరి కాదని కేరళ ప్రభుత్వం తెలిపింది. కరోనా నిబంధనలు మాత్రం తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది.

  • ' ఆయన ఇంటి ముందు కూర్చుంటాం'

అబద్ధాలతో ముఖ్యమంత్రి కేసీఆర్​ పబ్బం గడుపుతున్నారని కాంగ్రెస్​ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(MP Komati Reddy in Vari Deeksha) విమర్శించారు. ఇందిరా పార్కు వద్ద కిసాన్​ కాంగ్రెస్​ తలపెట్టిన 'వరి దీక్ష'లో పాల్గొన్న కోమటి రెడ్డి.. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేసీఆర్​ వైఖరిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రైతులతో పెట్టుకోవద్దని హెచ్చరించారు.

  • ఇకపై వారి​ మకాం అక్కడే!

హీరోయిన్​ నయనతార.. రజనీకాంత్‌, ధనుష్‌ వంటి సెలబ్రిటీలు నివసిస్తున్న పోయస్‌ గార్డెన్‌లో ఓ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసిందని సమాచారం. త్వరలోనే తన ప్రియుడు విఘ్నేశ్​ను వివాహం చేసుకుని ఆమె గృహప్రవేశం​ చేయనుందని తెలిసింది.

  • వికెట్ కోల్పోయిన భారత్​

15:49 November 27

టాప్​ న్యూస్​@4PM

  • 'ఆంక్షల ఎత్తివేతపై పునరాలోచించాలి'

అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు ఎత్తివేయాలని ఇటీవల తీసుకున్న నిర్ణయంపై పునరాలోచించాలని అధికారులను ప్రధాని మోదీ ఆదేశించారు. కరోనా కొత్త వేరియంట్​ వ్యాప్తి నేపథ్యంలో ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు.

  • 'ఒమిక్రాన్' పై పనిచేస్తాయ్!

omicron variant vaccine effectiveness: కరోనా కొత్త వేరియంట్​ ఒమిక్రాన్​తో(omicron variant) ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్న క్రమంలో దక్షిణాఫ్రికా ప్రకటన ఊరట కలిగిస్తోంది. ప్రస్తుతం ఉన్న కొవిడ్​ టీకాలు కొత్త వేరియంట్​పై ప్రభావవంతంగానే పనిచేస్తున్నాయని(omicron variant vaccine effectiveness) పేర్కొంది ఆ దేశ ఆరోగ్య శాఖ.

  • పెళ్లిలో రూ.2కోట్ల నగల చోరీ

ఓ ఐదు నక్షత్రాల హోటల్‌లో భారీ చోరీ జరిగింది. 2 కోట్ల విలువైన వజ్రాల నగలతో పాటు, రూ. 95 వేల నగదును గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. జైపుర్‌లో గురువారం ఈ దొంగతనం (robbery in jaipur) జరిగింది.

  • సల్మాన్​ సినిమాలో ఆమెకు ఆఫర్​.. !

pragya jaiswal antim: హీరోయిన్​ ప్రగ్యాజైశ్వాల్​కు ఓ బంపర్​ ఆఫర్​ చేజారిందట! సల్మాన్​ఖాన్​​ హీరోగా విడుదలైన 'అంతిమ్​: ది ఫైనల్​ ట్రూత్​'లో మొదట ఆమెకు అవకాశం వచ్చిందని, కానీ ఆ తర్వాత అనుకోని కారణాల వల్ల అది చేజారిందని తెలిసింది.

  • అతని ఖాతాలో మరో రికార్డు.. !

టీమ్ఇండియా సీనియర్ స్పిన్నర్ రవి అశ్విన్ ఖాతాలో మరో రికార్డు చేరింది. ఈ ఏడాది టెస్టుల్లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్​గా ఘనత వహించాడు.

14:40 November 27

టాప్​ న్యూస్​@3PM

  • నీట్​ ​ వాయిదాపై వైద్యుల ఆందోళన

Resident Doctors Strike: నీట్​- పీజీ 2021 కౌన్సిలింగ్​ ఆలస్యం కావడాన్ని నిరసిస్తూ.. దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు రెసిడెంట్ వైద్యులు. ఎఫ్​ఓఆర్​డీఏ ఇచ్చిన దేశవ్యాప్త నిరసనలకు సంఘీభావంగా వైద్యులు తమ విధులు బహిష్కరించి నిరసనలో పాల్గొన్నారు.

  • 30 మందికి కరోనా.. 15 రోజులు సెలవులు

మేడ్చల్​ జిల్లా టెక్​ మహీంద్రా యూనివర్సిటీని డీఎంహెచ్​వో మల్లికార్జున్(Corona in Tech Mahindra University)​ పరిశీలించారు. 30 మందికి కొవిడ్​ పాజిటివ్​ నిర్ధరణ అయిందని.. వారంతా రెండు డోసులు తీసుకున్న వారే అని డీఎంహెచ్​వో పేర్కొన్నారు. ప్రస్తుతం బాధితులంతా హోం ఐసోలేషన్​లో ఉన్నట్లు చెప్పారు.

  • 'పరంబీర్​ సింగ్​కు సమన్లు

Param Bir Singh News: బలవంతపు వసూళ్ల కేసులో భాగంగా ముంబయి మాజీ పోలీస్ కమిషనర్​ పరమ్​బీర్​సింగ్​కు మహారాష్ట్ర సీఐడీ సమన్లు జారీ చేసింది. సోమవారం లేదా మంగళవారం రోజు కార్యాలయం ఎదుట హాజరుకావాలని ఆదేశించినట్లు అధికారవర్గాలు తెలిపాయి.

  • 'విరాటపర్వం' పై త్వరలో క్లారిటీ

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో బింబిసార, విరాటపర్వం, యోధ, అఖండ ప్రీ రిలీజ్​ ఈవెంట్​కు సంబంధించిన కొత్త సంగతులు ఉన్నాయి.

  • సెమీస్​లో ఇంటిదారి..!

Indonesia Open semi finals 2021: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఇండోనేసియా ఓపెన్​ సెమీస్​ పోరులో నిరాశపరిచింది. థాయ్​లాండ్ క్రీడాకారిణి రచనోక్​ చేతిలో ఓటమి చవిచూసింది.

13:50 November 27

టాప్​ న్యూస్​@2PM

  • 'ఫైజర్' ఎదుర్కొంటుందా?

కరోనా కొత్త వేరియంట్​ ఒమిక్రాన్​కు తమ వ్యాక్సిన్లు ఎంత మేరకు అడ్డుకట్ట వేస్తుందనే విషయంపై స్పష్టత లేదని ఫైజర్, బయోఎన్​టెక్(Pfizer vaccine omicron varinat) సంస్థలు తెలిపాయి. అయితే కొత్త వేరియంట్​ను ఎదుర్కోగల టీకాను తాము 100 రోజుల్లో అభివృద్ధి చేస్తామని చెప్పాయి.

  • ఆ వర్సిటీకి 15 రోజులు సెలవులు

  • ఆందోళనలు విరమించి.. ఇళ్లకు వెళ్లాలి

కొత్త వ్యవసాయ చట్టాల రద్దు(farm laws repeal) బిల్లును శీతాకాల సమావేశాల తొలిరోజే పార్లమెంట్​లో ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. ఈ క్రమంలో రైతులు ఆందోళనలు విరమించి.. తిరిగి ఇళ్లకు వెళ్లాలని కోరారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి(Agriculture Minister) నరేంద్ర సింగ్​ తోమర్​. కనీస మద్దతు ధర కోసం కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

  • సెమీస్​లో సింధు ఓటమి

Indonesia Open semi finals 2021: ఇండోనేసియా ఓపెన్ సెమీస్​లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు నిరాశపరిచింది. థాయ్​లాండ్​ షట్లర్ రచనోక్ ఇంతనాన్ చేతిలో పరాభవం పాలైంది.

  • ఆలియా భట్​ పాత్ర 15 నిమిషాలేనా?

సంక్రాంతి కానుకగా రిలీజయ్యే 'ఆర్ఆర్ఆర్'లో నటీనటుల పాత్ర నిడివి గురించి సోషల్ మీడియాలో తెగ మాట్లాడుకుంటున్నారు. అందులో భాగంగానే ఆలియా రోల్​ కేవలం 15 నిమిషాలే ఉంటుందని అంటున్నారు! మరి ఇందులో నిజమెంత?

12:55 November 27

టాప్​ న్యూస్​@1PM

  • కొత్త వేరియంట్లు, మూడో దశ వస్తే..

Minister Harish rao review on corona New variants:కొత్త వేరియంట్లు, మూడో దశ వస్తే ఏర్పాట్లపై ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు... ఆ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ప్రజారోగ్య బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహిస్తున్నారు.

  • సీఎం కుర్చీ కోసం కొట్లాట

ముఖ్యమంత్రి కేసీఆర్ దిల్లీ ఎందుకు వెళ్లారో ఎవరికీ అర్థం కాలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. సొంత పనుల కోసం దిల్లీ వెళ్లి.. కేంద్రాన్ని అప్రతిష్ఠ పాలు చేశారని మండిపడ్డారు. ప్రగతిభవన్​(pragathi bhavan)లో నాలుగు స్తంభాలాట మొదలైందని.. సీఎం కుర్చీ కోసం కొట్లాట షురూ అయిందని తెలిపారు. 2023లో అధికారంలోకి వచ్చేది భాజపానేనని.. తాము అధికారంలోకి వస్తే.. అర్హులందరికీ ఉచిత విద్య, వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు.

  • నక్సల్స్​ దుశ్చర్య- రైల్వే ట్రాక్​ను ధ్వంసం

ఛత్తీస్​గఢ్​లోని కిరండోల్​-విశాఖ రైల్వే ట్రాక్​ను ధ్వంసం చేశారు (Naxalite Attack in Chhattisgarh Today) నక్సలైట్లు. ఇటీవల మృతిచెందిన సహచరులకు నివాళిగా నక్సల్స్​ ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.

  • ప్రపంచానికి కరోనా 'కొత్త' ముప్పు

దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్​ (omicron variant)​ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. గత వేరియంట్లతో పోలిస్తే అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుందనే ఆందోళనలతో ఆంక్షల దిశగా అడుగులు వేస్తున్నాయి పలు దేశాలు. ఈ కొత్త రకం(Covid new variant) అంత ప్రమాదకరమా? ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏమంటోంది?

  • ఆ వాట్సాప్‌ల జోలికెళ్తే..

ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగిస్తున్న మేసేజింగ్​ యాప్​.. వాట్సాప్(WhatsApp news)​. ఇది యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందుబాటులో ఉంచుతుంది. అయితే ఇందులో లభించని ఫీచర్లను జత చేసి.. ఏపీకే రూపంలో వాట్సాప్​ నకలను విడుదల చేస్తున్నారు కొందరు సైబర్ నేరగాళ్లు. ఇలాంటివి డౌన్​లోడ్​ చేసుకుంటే డేంజర్​లో పడినట్లేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి అటువంటి వాట్సాప్​ నకిలీ యాప్​ల గురించి తెలుసుకోండి.

11:43 November 27

టాప్​ న్యూస్​@12PM

  • తెలంగాణలో ధాన్యం కొంటాం

తెలంగాణలో యథావిధిగా ధాన్యం సేకరిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గతంలో నిర్ణయించిన కనీస మద్దతు ధరకే ధాన్యం కొంటామని స్పష్టం చేసింది. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల కోసం అన్నదాతలు ఆందోళనలు చేపడుతున్న వేళ కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

  • వ్యాక్సినేషన్​పై మోదీ సమీక్ష

దేశంలో కొవిడ్ పరిస్థితులు, వ్యాక్సినేషన్‌ పంపిణీపై ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన కొవిడ్ కొత్త వేరియంట్‌ 'ఒమిక్రాన్‌' కలవరపెడుతున్న వేళ ప్రధాని సమీక్ష ప్రాధాన్యం సంతరించుకుంది.

  • ఎస్​బీఐకి ఆర్​బీఐ షాక్

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు(ఎస్‌బీఐ)(RBI penalty SBI) రూ.కోటి జరిమానా విధించింది రిజర్వు బ్యాంక్ ఆఫ్​ ఇండియా(ఆర్‌బీఐ). నియంత్రణపరమైన నిబంధనలు ఉల్లంఘించినందుకే ఈ జరిమానా విధించినట్టు ఆర్​బీఐ ఓ ప్రకటనలో తెలిపింది.

  • రెండు వికెట్లు కోల్పోయిన కివీస్

భారత్​- న్యూజిలాండ్ మధ్య కాన్పుర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో మూడో రోజు లంచ్​ సమయానికి కివీస్ 197 పరుగులు చేసింది. రెండు వికెట్లు కోల్పోయింది.

  • ఆ ఛాన్స్ కొట్టేసిన రమ్యకృష్ణ!

సీనియర్ నటి రమ్యకృష్ణ బంపర్ ఆఫర్ కొట్టేసింది! తమిళ బిగ్​బాస్-5కు కొన్ని వారాలపాటు హోస్ట్​గా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇంతవరకు హోస్ట్ చేసిన విలక్షణ నటుడు కమల్​ హాసన్​ ఇటీవల కొవిడ్ బారిన పడటమే ఇందుకు కారణం.

10:51 November 27

టాప్​ న్యూస్​@11AM

  • ఇవాళ, రేపు మోస్తరు వర్షాలు

Rain Alert in Telangana: ఈశాన్య భారత ప్రాంతాల నుంచి తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో శని, ఆదివారాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు ప్రకటనలో పేర్కొంది.

  • ఆ జిల్లాలకు మరోసారి భారీ వర్ష సూచన!

AP rains 2021: భారీ వర్షాలతో అతలాకుతలం అయిన ఏపీకి మరో ముప్పు పొంచి ఉంది. ఈ నెల 29న అండమాన్ తీరంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. చిత్తూరు, నెల్లూరు జిల్లాలో మరోసారి వర్షాలు పడతాయని స్పష్టం చేసింది.

  • మరణ శిక్షను సమర్థించిన సింగపూర్ కోర్టు

డ్రగ్స్​కేసులో ఇద్దరు భారత సంతత వ్యక్తులకు మరణశిక్ష సరైందేనని తీర్పునిచ్చింది సింగపూర్ ఉన్నత న్యాయస్థానం. ఈ కేసులో యావజ్జీవ జైలు శిక్ష పడిన మరో వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్​ను తోసిపుచ్చింది.(singapore indian origin death penalty)

  • కోహ్లీకి డ్యాన్స్​ నేర్పిన చాహల్ భార్య

Virat dance with Dhanashree: రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు జట్టు ఇటీవల షేర్ చేసిన ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆర్సీబీ మాజీ సారథి విరాట్ కోహ్లీకి డ్యాన్స్​ నేర్పిస్తూ కనిపించింది స్పిన్నర్ చాహల్ భార్య ధనశ్రీ వర్మ.

  • టాలీవుడ్​లో ప్రముఖ దర్శకుడు మృతి

ఫిట్స్​ రావడం వల్ల తెలుగు సీనియర్ డైరెక్టర్ కేఎస్ నాగేశ్వరరావు హఠాన్మరణం చెందారు. ఈ విషయమై పలువురు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.

09:46 November 27

టాప్​ న్యూస్​@10AM

  • లారీ బోల్తా.. 4 కి.మీ. మేర ట్రాఫిక్ జామ్

Hyderabad vijayawada traffic jam: విజయవాడ-హైదరాబాద్ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రంపల్లి వద్ద లారీ బోల్తా పడింది. డివైడర్‌ను ఢీకొని రహదారి మధ్యలో లారీ పడిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

  • తల, రెండు వేర్వేరు చేతులు

పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం కుందనపల్లిలో రాజీవ్ రహదారి పక్కన ఓ వ్యక్తి తల, రెండు వేర్వేరు చేతులు కనిపించాయి. అటుగా వెళ్తున్న స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు.

  • తగ్గిన కరోనా కేసులు, మరణాలు

భారత్​లో కొవిడ్​ కేసుల సంఖ్య (India covid cases) స్వల్పంగా తగ్గింది. తాజాగా 8,318 మందికి కరోనా సోకినట్లు(Corona cases in India) తేలింది. వైరస్​ (Coronavirus India)​ ధాటికి మరో 465 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజే 10,967 మందికిపైగా కరోనాను జయించారు.

  • ఆ భూభాగాలను తీసుకుంటాం

Kalapani Dispute: తమ పార్టీ అధికారంలోకి వస్తే.. వివాదస్పద భూభాగాలైన కాలాపానీ, లింపియాధుర, లిపులేఖ్​లను​ చర్చల ద్వారా భారత్​ నుంచి తీసుకుంటామని చెప్పారు నేపాల్​ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ. సమస్యలను చర్చలతోనే పరిష్కరిస్తామే తప్ప సరిహద్దు దేశాలతో శత్రుత్వాన్ని పెంచుకోబోమన్నారు.

  • ఆ హీరో నా వెంటపడుతున్నట్టు

నేను సినిమా చూసిన తర్వాత ఆ ప్రభావం వారం దాకా నాపై తీవ్రంగా ఉంటుంది. ఆ హీరో నా వెంట పడుతున్నట్టు.. మేం ప్రేమించుకుంటున్నట్టు ఊహల్లో తేలిపోతుంటా. అదే ట్రాజెడీ సినిమా అయితే నా బాధ ఆపడం ఎవరితరం కాదు. హీరో చనిపోతే ఏడుపాగదు. పదేపదే తలచుకొని కుమిలిపోతుంటా. అన్నం సహించదు. ఏ పనిపై ధ్యాస పెట్టలేను. నన్ను చూసి ఫ్రెండ్స్‌ నవ్వుతున్నారు. ఎంత ప్రయత్నించినా మారలేకపోతున్నా. ఎందుకిలా? - ఓ యువతి వేదన

08:53 November 27

టాప్​ న్యూస్​@9AM

  • భగాయత్‌ ప్లాట్ల విక్రయానికి మరోసారి ప్రీబిడ్‌

Uppal Bhagayath Lands E-Auction 2021 : మేడ్చల్ జిల్లా ఉప్పల్ భగాయత్ భూముల వేలానికి హెచ్​ఎండీఏ అధికారులు రంగం సిద్ధం చేశారు. డిసెంబరు 2, 3 తేదీల్లో 44 ప్లాట్ల విక్రయానికి నిర్వహించనున్న ఈ-వేలంలో ఎక్కువ మంది పాల్గొనేలా చర్యలు తీసుకుంటున్నారు. నేడు బేగంపేట టూరిజం ప్లాజాలో హెచ్​ఎండీఏ ప్రీబిడ్‌ నిర్వహిస్తోంది. ఆసక్తి కలిగిన వారంతా ప్రీబిడ్‌కి రావొచ్చని తెలిపింది.

  • ఉగ్రవాదుల నిధుల కోసం పాక్ కుట్ర

ఉగ్రవాదులకు నిధులు సమకూర్చేందుకు పాకిస్థాన్​ పెద్ద మొత్తంలో (news kashmir drugs) డ్రగ్స్​ను తరలిస్తోందన్నారు జమ్ముకశ్మీర్​ డీజీపీ దిల్​బాగ్​ సింగ్​. ఓ ప్రణాళిక ప్రకారం మాదకద్రవ్యాలను రవాణా చేసి స్థానిక యువతను అందుకు బానిసలను చేస్తోందని ఆరోపించారు. నార్కోటిక్స్​ కంట్రోల్​ బ్యూరో, జమ్ముకశ్మీర్​ పోలీస్​ (news kashmir drugs) సంయుక్తంగా నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన దిల్​బాగ్​.. ఈ వ్యాఖ్యలు చేశారు.

  • 15 మంది విద్యార్థులకు అస్వస్థత

Food Poison in BC boys Hostel Hyderabad : హైదరాబాద్ సరూర్​నగర్​లోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ సంక్షేమ బాలుర వసతి గృహంలో కలుషిత నీరు తాగి 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, కడుపునొప్పి, ఛాతీలో నొప్పితో ఇబ్బంది పడుతున్న వారిని హాస్టల్ నిర్వాహకులు నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు.

  • కట్నం డబ్బులు.. హాస్టల్​ నిర్మాణానికి విరాళం

Barmer daughter: బాలికల విద్యను ప్రోత్సహించేందుకు రూ. 75 లక్షలను బాలికల వసతి గృహ నిర్మాణం కోసం విరాళంగా ఇచ్చారు ఓ నవ వధువు. ఆమె తీసుకున్న నిర్ణయంతో రాజస్థాన్​లోని బాడ్​మేర్​, జైసేల్మర్ ప్రాంతాల్లో అనేకమంది బాలికలకు విద్యాభ్యాసం సులభతరం కానుంది.

  • సంజీదా.. నీ అందానికి అల్విదా!

సంజీదా.. హిందీ టీవీ నటి, మోడల్, టీవీ ప్రజెంటర్. 1984 డిసెంబరు 20న కువైట్​లో సంజీదా పుట్టింది. ఈమె కుటుంబం అహ్మదాబాద్​ నుంచి అరబ్ దేశానికి వలస వెళ్లింది. పలు సినిమాలు చేసినప్పటికీ, టీవీ సీరియళ్ల ద్వారానే బాగా గుర్తింపు తెచ్చుకుంది. తనతో పాటు రెండు సీరియల్స్ చేసిన ఆమిర్ అలీని 2012లో పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత వీరిద్దరూ గతేడాది విడాకులు తీసుకున్నారు.

07:58 November 27

టాప్​ న్యూస్​@8AM

  • ఎంత మంది పేదలున్నారో తెలుసా?

Poor People in Telangana 2021 : దేశంలో అత్యధిక పేదలున్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ 18వ స్థానంలో నిలిచింది. ఏపీ 20వ స్థానంలో ఉండగా.. మొదటి స్థానంలో బిహార్​ ఉంది. రాష్ట్రంలో 13.74 శాతం పేద ప్రజలున్నారని నీతి ఆయోగ్ విడుదల చేసిన నివేదిక వెల్లడించింది.

  • భారత్​లో కొంత భాగం కోసం..

Azadi ka amrit mahotsav: భారత్‌ను విడిచి పెట్టడానికి అతికష్టం మీద, అయిష్టంగా అంగీకరించిన బ్రిటన్‌... చివరి నిమిషం దాకా ఎన్ని కొర్రీలు పెట్టాలో అన్ని పెట్టింది. వాటిలో ఒకటి... ప్రిన్సిస్థాన్‌ ఏర్పాటు! భారత స్వాతంత్య్రానికి మొదట్నుంచీ మోకాలడ్డిన అప్పటి బ్రిటిష్‌ ప్రధాని విన్‌స్టన్‌ చర్చిల్‌.. చివర్లో ప్రిన్సిస్థాన్‌ అంటూ కొత్త దేశాన్ని తెరపైకి తెచ్చాడు. విభజన తర్వాత కూడా 'అక్కడ మనదైన ప్రాంతం' ఉండాలంటూ మెలికపెట్టాడు.

  • మహారాష్ట్రలో ప్రభుత్వం మారనుందా?

మహారాష్ట్ర రాజకీయాలపై(Maharashtra politics) కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి నారాయణ రాణే. రాష్ట్రంలో మార్చి నెలలో భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. ఇదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌, ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్.. దేశ రాజధానిలో ఉండటం ఈ వ్యాఖ్యలకు మరింత బలం చేకూరుస్తోంది.

  • ఉత్తమ బ్యాటర్​ విరాట్ కోహ్లేనే

Mohammad Amir on Virat Kohli: టీమ్​ఇండియా టెస్టు సారథి విరాట్ కోహ్లీని ప్రశంసలతో ముంచెత్తాడు పాకిస్థాన్ మాజీ ఆటగాడు మహ్మద్ ఆమిర్. ప్రస్తుత కాలంలో విరాట్ ఉత్తమ బ్యాటర్ అని అభిప్రాయపడ్డాడు.

  • సల్మాన్​ త్రిపాత్రాభినయం

కొత్త సినిమాలో సల్మాన్​ త్రిపాత్రాభినయం చేయనున్నారు. ఇందులోనే మొత్తంగా తొమ్మిది మంది హీరోయిన్లు నటించనున్నారు. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే?

06:59 November 27

టాప్​ న్యూస్​@ 7AM

  • వచ్చే ఏడాది ప్రభుత్వ సెలవులివే!

Government Of Telangana Holiday List 2022: 2022వ సంవత్సరంలో 28 రోజుల సాధారణ సెలవులతో పాటు.. 23 ఐచ్చిక సెలవులు.. 23 వేతనంతో కూడిన సెలవుల (Holidays in 2022)పై తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు (Telangana Government Holiday List 2022) జారీ చేసింది. పారిశ్రామిక సంస్థలు, ప్రభుత్వరంగ సంస్థలు, విద్యాసంస్థలు, ప్రజాపనుల శాఖలకు ఈ ఉత్తర్వులు వర్తించవని స్పష్టం చేసింది.

  • ఎలుకల మందు తిని ఆత్మహత్య

ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు విషం తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన మధ్యప్రదేశ్​లోని భోపాల్‌లో జరిగింది. వీరిలో ఇద్దరు మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు అప్పులే ప్రధాన కారణమని వివరించారు.

  • బ్యాంక్‌ ప్రమోటర్లకు ఆర్​బీఐ ఊరట

ప్రైవేటు బ్యాంక్​ ప్రమోటర్లకు సంబంధించి ఆర్​బీఐ కీలక అడుగులు వేసింది. ప్రమోటర్లు.. 15 ఏళ్ల తర్వాత కూడా 26 శాతం వాటాను కొనసాగించుకోవచ్చని తెలిపింది. తాజా నిర్ణయాలు కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌లతో పాటు ఇతర ప్రైవేటు బ్యాంకుల (Private Bank Guidelines RBI) యాజమాన్యాలకు ప్రయోజనం చేకూర్చవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

  • అయ్యర్‌ కోసం ఖాళీ చేసేదెవరు?

Shreyas Iyer in IND vs NZ 2nd Test: టీమ్​ఇండియా యువ బ్యాటర్ శ్రేయస్​ అయ్యర్ అరంగేట్ర మ్యాచ్​లోనే సెంచరీతో అదరగొట్టాడు. అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఇప్పుడిక కోహ్లీ మళ్లీ జట్టులోకి వస్తే.. శ్రేయస్​ ఏ స్థానంలో ఆడతాడనేది సందిగ్ధంగా మారింది.

  • కథ వినకుండానే 'అఖండ' చేశా

అందం, అభినయం కలగలిసిన హీరోయిన్లలో ప్రగ్యా జైస్వాల్‌ ఒకరు. 'కంచె', 'జయ జానకి నాయక' తదితర చిత్రాలతో ఇదే అంశాన్ని చాటిచెప్పిన ముద్దుగుమ్మ 'అఖండ'తో మరోసారి ప్రేక్షకుల్ని అలరించేందుకు వస్తుంది. బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న చిత్రమిది.

04:25 November 27

ఈటీవీ భారత్​ ముఖ్యాంశాలు

  • మరిన్ని మాడ్యుల్స్

ధరణి పోర్టల్‌(Dharani Portal)లోని సమస్యల పరిష్కారానికి మరికొన్ని మాడ్యూల్స్ త్వరలో అందుబాటులోకి రానున్నాయి. పొరపాటున నిషేధిత జాబితాలోకి వెళ్లిన భూములను సుమోటోగా తొలగించాలని... ఇప్పటికే కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది.

  • కాంగ్రెస్ దీక్షాస్త్రం

రాష్ట్రంలో వడ్ల కొనుగోలుపై మరింత ఉద్ధృతం చేసేందుకు కాంగ్రెస్‌ (Congress Deeksha) సిద్ధమైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగడుతూ ఇప్పటికే వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తం చేసిన హస్తంపార్టీ... రెండ్రోజుల దీక్షకు సిద్ధమైంది.

  • బూస్టర్ తప్పనిసరి

రెండు డోసుల టీకా పొందినా కొవిడ్‌ (Covid Vaccine) లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయొద్దనీ, సత్వరమే పరీక్ష చేయించుకొని అవసరమైన చికిత్స పొందాలని డాక్టర్‌ డి.నాగేశ్వరరెడ్డి స్పష్టం చేశారు.

  • ఎస్సై రాసలీలలు

రక్షణ కల్పించాల్సిన పోలీసే పక్కచూపులు చూశాడు. మరొకరి భార్యపై కన్నేసి ముగ్గులోకి దించాడు. భర్త బయటకు వెళ్లగానే రెక్కలు కట్టుకుని ఆమె ఒళ్లో వాలిపోతున్నాడు. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగితే.. ఎవరూ చూడలేదనుకున్నట్టు.. వీళ్లు తమ బాగోతం నడిపించారు. తీరా ఈ విషయం ఆ నోటా ఈ నోటా ఆమె భర్తకు చేరింది. ఇంకేముంది.. పక్కా స్కెచ్​తో రొమాన్స్​లో మునిగి తేలుతున్న జంటను రెడ్​హ్యాండెడ్​గా పట్టుకుని చితకబాదారు.

  • సురభి కళాకారుల ప్రదర్శన

నాటకాలతో తమదైన గుర్తింపుపొందిన సురభి కళాకారులు మరోసారి ప్రత్యేకతను చాటుకోబోతున్నారు. వందేళ్ల చరిత్ర కలిగిన సురభి కళ(Surabhi Natakam)ను బతికిస్తూ.. తమ కుటుంబాలను పోషించుకుంటున్న కళాకారులు ఈసారి సరికొత్తగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి స్థలపురాణాన్ని నాటక రూపంలో ప్రదర్శించేందుకు సిద్ధమయ్యారు.

  • రైలు ఢీకొని ఏనుగులు మృతి

తమిళనాడు-కేరళ సరిహద్దులో జరిగిన రైలు ఢీకొని మూడు ఏనుగులు మృతిచెందాయి. తల్లితో పాటు.. రెండు పిల్ల ఏనుగులు మరణించినట్లు తెలుస్తోంది.

  • మేము మద్యం ముట్టము

Liquor Consumption Oath: మద్యపాన నిషేధాన్ని మరింత కఠనంగా అమలు చేయడానికి బిహార్​ ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజలు, అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ప్రతిజ్ఞ చేశారు.

  • కదులుతున్న బస్సుపై కాల్పులు

కదులుతున్న బస్సుపై ఓ సాయుధుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో డ్రైవర్​ సహా.. ముగ్గురు మరణించగా.. ఓ వ్యక్తి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

  • అఖండ' ప్రీ రిలీజ్ ఈవెంట్​

'అఖండ' ప్రీ రిలీజ్​ ఈవెంట్​కు (Akhanda Pre Release Event) ప్రత్యేక అతిథిగా హాజరుకానున్నారు దర్శకధీరుడు రాజమౌళి. హైదరాబాద్​లోని శిల్పాకళా వేదికలో శనివారం ఈ ఈవెంట్ జరగనుంది.

  • రాత్రి సరిగా నిద్ర పట్టలేదు

Shreyas Iyer Century in Test: టీమ్ఇండియా యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ న్యూజిలాండ్​తో జరుగుతోన్న తొలి టెస్టులో సెంచరీతో మెరిశాడు. ఇదే ఇతడికి తొలి టెస్టు మ్యాచ్ కావడం గమనార్హం.

Last Updated : Nov 27, 2021, 9:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.